Maruti Suzuki e-Vitara Features : మారుతి సుజుకి భారత మార్కెట్లో తన మొదటి ఎలక్ట్రిక్ SUVని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. మారుతి సుజుకి ఇ-విటారా పేరుతో వస్తున్న ఈ కారుపై మార్కెట్‌లో బారీ అంచనాలు ఉన్నాయి. దీనిని మొదటిసారిగా 2025 భారత మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించారు. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ SUV విడుదల చేయడానికి మారుతి సుజుకి సిద్ధమవుతోంది. రాబోయే కొన్ని నెలల్లో దీనిపై అధికారిక ప్రకటన విడుదలకానుంది.   

Continues below advertisement


మారుతి సుజుకి ఇ-విటారాను భారతదేశంలో NEXA డీలర్‌షిప్ నెట్‌వర్క్ ద్వారా విక్రయిస్తారు. ఈ SUV అనేక ప్రీమియం, సాంకేతిక పరిజ్ఞానంతో నిండిన ఫీచర్లతో వస్తుంది, ఇది మార్కెట్లో మంచి ఆప్షన్‌గా మారుతుందని అంటున్నారు.  


ఫీచర్లు ఎలా ఉంటాయి?


ఈ ఎలక్ట్రిక్ SUVలో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, 6 ఎయిర్‌బ్యాగ్‌లతో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.  దీనితోపాటు, ఇందులో 360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా సిస్టమ్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్లు కలిగి ఉంది. SUV 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. లెవెల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్)తో కూడా వస్తుంది. ఈ ఫీచర్లతో, ఇ-విటారా సాంకేతికంగానే కాకుండా, భద్రత, సౌకర్యంపరంగా కూడా వినియోగదారుల అంచనాలను పూర్తిగా అందుకుంటుంది.


బ్యాటరీ ఎంపికలు


ఇ-విటారాను రెండు వేర్వేరు బ్యాటరీ ప్యాక్ ఎంపికలలో రావచ్చని అంచనాలు ఉన్నాయి. మొదటి ఎంపిక 48.8kWh బ్యాటరీ ప్యాక్, రెండవది, పెద్ద వేరియంట్, 61.1kWh బ్యాటరీతో ఉంటుంది. ఇ-విటారా ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ డ్రైవింగ్ రేంజ్‌ను అందించగలదని కంపెనీ పేర్కొంది. అదే సమయంలో, ఇది రాపిడ్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా పొందుతుంది, దీనితో ఈ SUV కేవలం 50 నిమిషాల్లో 0 నుంచి 80% వరకు ఛార్జ్ అవుతుంది.


డిజైన్  


డిజైన్ పరంగా కూడా ఇ-విటారా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది సింగిల్ టోన్, డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. సింగిల్ టోన్ కలర్ ఆప్షన్‌లలో ఓపులెంట్ రెడ్, బ్లూయిష్ బ్లాక్, ఆర్కిటిక్ వైట్, గ్రాండ్యూర్ గ్రే, స్ప్లెండిడ్ సిల్వర్, నెక్సా బ్లూ ఉన్నాయి. డ్యూయల్ టోన్ ఫినిష్ ఎంపికల‌్లో ల్యాండ్ బ్రీజ్ గ్రీన్, ఓపులెంట్ రెడ్, స్ప్లెండిడ్ సిల్వర్, ఆర్కిటిక్ వైట్ వంటి రంగుల్లో ఈ మోడల్ రానుంది. ఇ-విటారాను మూడు వేరియంట్‌లలో విడుదల చేస్తారు - డెల్టా, బీటా,  ఆల్ఫా, వీటిలో ఫీచర్లు, ధర ప్రకారం వ్యత్యాసం ఉండవచ్చు.


సేఫ్టీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఆరు ఎయిర్‌ బ్యాగ్స్‌ రానున్నాయి.  ఇందులో డ్రైవర్ మోకాలి అక్సిలరేట్‌ ఎయిర్‌ బ్యాగ్‌, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్‌, యాంటీ లాక్ బ్రేకింగ్‌ సిస్టమ్‌ ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ ఉంటుంది. 


డైమన్షన్స్‌ చూస్తే... 



  • వెహికల్ పొడవు- 4,275 ఎంఎం

  • వెడల్పు-1800 ఎంఎం

  • ఎత్తు- 1635-1640 ఎంఎం

  • వీల్‌ బేస్‌ - 2700 ఎంఎం

  • గ్రౌండ్‌ క్లియరెన్స్‌- 180 ఎం ఎం

  • వీల్‌ - 18 ఇంచ్‌ అల్లాయ్‌వీల్స్ 


ఎప్పుడు లాంచ్ అవుతుంది- ధర ఎంత ఉండొచ్చు


ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే విడుదల కానున్న ఈ వెహికల్ ధర 17-22.5 లక్షల నుంచి 20-30 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.  


భారత మార్కెట్లో విడుదలైన తర్వాత మారుతి సుజుకి ఇ-విటారా నేరుగా హ్యుందాయ్ క్రెటా EV, టాటా హారియర్ EV వంటి రాబోయే ఎలక్ట్రిక్ SUVలతో పోటీపడుతుంది. ఇవన్నీ మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ SUV విభాగంలో పోటీపడతాయి.