Best Family Cars Under 10 Lakhs:నేటి భారతీయ కార్ల మార్కెట్‌ను ఒక్కసారి గమనిస్తే, ఎక్కడ చూసిన ఎస్‌యూవీల సందడే కనిపిస్తోంది. ప్రతి కొత్త లాంచ్, ప్రతి ప్రకటన అడ్వెంచ్, రోడ్ ప్రెజెన్స్ గురించి మాట్లాడుతున్నాయి. కొనుగోలుదారులు కూడా ఎత్తుగా ఉండే వాహనాలు, మెరుగైన విజిబిలిటీ, సాఫీగా సాగిపోయే గ్రౌండ్ క్లియరెన్స్‌ కలిగిన వాహనాలవైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఈ ఎస్‌యూవీల తుపానులోనూ ఒక సెడన్ మాత్రం చెక్కుచెదరకుండా వినియోగదారుల మనసులు గెలుచుకుంటోంది. అదే మారుతి సుజుకి డిజైర్(Maruti Suzuki Dzire Performance). 

Continues below advertisement

భారత్‌లో ఎస్‌యూవీల పెరుగదల అనేది కేవలం ప్రాక్టికాలిటీకి సంబంధించింది మాత్రమే కాదు. అది ఒక ఎమోషన్. ఎస్‌యూవీలు(Sedan vs SUV Market India) కొనుగోలుదారులకు భద్రతను, సామాజిక హోదాను, ఆత్మవిశ్వసాన్ని ఇస్తాయి. గుంతలతో నిండిన రోడ్లు, అస్తవ్యస్తమైన స్పీడ్‌ బ్రేకర్లు ఉన్న మన దేశ పరిస్థితుల్లో  ఎస్‌యూవీలు మరింత ధైర్యాన్ని ఇస్తాయి. అందుకే కాంపాక్ట్ ఎస్‌యూవీలు కూడా ఒకప్పుడు సెడాన్‌లు, హ్యాచ్‌బ్యాక్‌లు కలిగి ఉన్న క్రేజ్‌ను ఇప్పుడు పొందుతున్నాయి. 

Continues below advertisement

డిజైర్ బిగ్ హిట్‌కు కారణం ఏంటీ?(Why Indians Buy Dzire)

మార్కెట్‌ మొత్తం ఆర్భాటంగా, ఎమోషనల్‌గా మారుతున్నా, డిజైర్‌ (Dzire Sales 2026)మాత్రం ఒకే ఒక్క అంశంపై దృష్టి పెట్టింది. అదే ఈజ్‌. ఈ కారును డ్రైవ్ చేయడం సులభం. పార్క్ చేయడం సులభం ఇంధన పొదుపులో మేటి, అన్నింటికంటే ముఖ్యంగా దీనిని మెయింటెన్‌ చేయడం చాలా సులభం.

Also Read: కుటుంబ ప్రయాణాలకు అనువైన టాప్‌ ఎంపీవీలు ఇవే! ధర, ఫీచర్స్‌ ఇతర వివరాలు తెలుసుకోండి!

ఫ్యామిలీ వినియోగదారుల దృష్టి

కుటుంబ అవసరాలకు తగ్గట్టుగా విశాలమైన క్యాబిన్, ఉపయోగకరమైన బూట్స్ పేస్‌ దీని సొంతం.  ఈ కారులో ఏది క్లిష్టంగా ఉండదు. విజిబిలిటీ బాగుంటుంది. ప్రయాణం సౌకర్యవంతంగా సాగుతుంది. 6. 26 లక్షల ప్రారంభ ధరతో ఇది మధ్యతరగతి వినియోగదారుడికి అందుబాటులో ఉంది. మారుతి సుజుకి నెట్‌వర్క్, రీసేల్ వాల్యూ కొనుగోలుదారులకు ఒక భరోసా ఇస్తాయి. 

Also Read: పోర్షే నుంచి లంబోర్ఘిని వరకు... ఎన్టీఆర్ గ్యారేజీలో కార్ కలెక్షన్, ఆయన టోటల్ నెట్ వర్త్ తెలుసా?

మారుతి డిజైర్‌ అనగానే చాలా మందికి ట్యాక్సీ మార్కెట్ గుర్తుకు వస్తుంది. వాస్తవానికి డిజైర్ బలాన్ని మరింత పెంచుతుంది. ఫ్లీట్ ఆపరేటర్లు అత్యంత ఆచరణాత్మకమైన కొనుగోలుదారులు. వారు మైలేజీ, మెయింటెనెన్స్ ఖర్చులు, విశ్వసనీయత, రీసేల్ విలువను లెక్కలు వేసుకొని కారును ఎంచుకుంటారు. సంవత్సరాలుగా డిజైర్ ఈ పరీక్షలన్నింటినీలోనూ నెగ్గుతూ వస్తోంది. ప్రైవేటు కొనుగోలుదారులు మెరిసే ఎస్‌యూవీలను ఇష్టపడవచ్చు. కానీ ఫ్లీట్ మార్కెట్(Maruti Suzuki Fleet Market) మాత్రం డిజైర్‌ ఎంతటి దృఢమైన కారో నిరూపిస్తూనే ఉంది. 

Also Read: పెట్రోల్ వర్సెస్ ఎలక్ట్రిక్ బైక్స్: వాహనదారులకు ఏది బెస్ట్ ఆప్షన్?

డిజైర్ విజయ ప్రస్థానం యాదృచ్చికం కాదు. మార్చి 2026లో డిజైర్‌ అన్ని ఎస్‌యూవీల కంటే ఎక్కువ అమ్మకాలను నమోదు చేసింది. అంతేకాకుండా, మార్చి 2026 నాటికి 3 మిలియన్ల విక్రయాలు మైలురాయిని ఈ కారు అందుకుంది. 2025 క్యాలెండర్‌ ఇయర్‌లో మారుతి సుజుకి మొత్తంగా  22. 55 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయగా, అందులో డిజైర్‌ అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. ఈ గణాంకాలే సామాన్యుడి నమ్మకాన్ని ప్రతిబింబిస్తున్నాయి. 

Also Read: 10 లక్షల బడ్జెట్‌తో లభించే అత్యుత్తమ కార్లు! ఫీచర్లు, మైలేజీ వివరాలు ఇవే!

ఎవరితో పోటీ పడుతుంది?

మారుతి డిజైర్‌ తన స్థానాన్ని కాపాడుకోవడానికి హోండా అమేజ్‌, హ్యుందాయ్ ఆరా వంటి బలమైన పోటీదారులను ఎదుర్కొంటోంది. సేఫ్టీ విషయంలో అమేజ్‌, డిజైర్‌ మధ్య నిరంతర చర్చ జరుగుతూనే ఉంటుంది. మరోవైపు మారుతి విక్టోరిస్‌ వంటి కొత్త మోడళ్లు విభిన్నమైన అనుభూతిని అందిస్తున్నప్పటికీ, డిజైర్‌ తనకంటూ ఒక ప్రత్యేకమైన వర్గాన్ని కలిగి ఉంది. 

Also Read: Electric Bike లో క్లచ్‌ పనితీరు ఏంటీ? Honda కొత్త EVలో ఫేక్ క్లచ్ ఇవ్వడానికి కారణమిదే

ప్రాక్టికాలిటీ ఎప్పుడూ ఫ్యాషన్ అవుట్ కాదు

మారుతి డిజైర్‌ విజయం ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. భారతీయ వినియోగదారులు ఆకాంక్షలను గౌరవిస్తారు. కానీ అవసరాలను విస్మరించరు. పెరుగుతున్న కారు ధరలు, ఇంధన ఖర్చుల దృష్ట్యా, ఒక మధ్యతరగతి కుటుంబానికి లేదా ఒక పట్టణ వినియోగదారుడికి తక్కువ ఖర్చుతో కూడిన సౌకర్యవంతమైన సెడాన్ ఇప్పటికీ ఒక స్మార్ట్ నిర్ణయమే. ఎస్‌యూవీలు ట్రెండీగా ఉన్నా సరే రోజువారి జీవితాన్ని సులభతరం చేసే మారుతి డిజైర్ వంటి కార్లు ఎప్పటికీ తమ ఉనికిని చాటుకుంటూనే ఉన్నాయి. 

Also Read: హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ సరికొత్త లుక్ - డీలర్‌షిప్స్‌లో సందడి చేస్తున్న లగ్జరీ సెడాన్ కార్