Petrol vs Electric Motorcycles Which One Should You Choose: దశాబ్దాలుగా భారతీయ రోడ్లపై పెట్రోల్ మోటార్ సైకిళ్ల హవా నడుస్తోంది. నమ్మకమైన ప్రదర్శన, ఈజీ మెయింటెనెన్స్, ఎక్కడ చూసినా దొరికే ఫ్యూయల్ స్టేషన్లు, సర్వీస్ సెంటర్ల సపోర్ట్ వల్ల ఇవి అందరి ఆదరణ పొందాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు మెల్లగా మారుతున్నాయి. ఒకవైపు పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతుండటం, మరోవైపు ఈవీ (EV) టెక్నాలజీ వేగంగా ఇంప్రూవ్ అవుతుండటంతో డైలీ కమ్యూటింగ్ కోసం ఎలక్ట్రిక్ బైకులు ఒక స్ట్రాంగ్ ఆప్షన్‌గా మారుతున్నాయి. అయినప్పటికీ ఈ రెండింటిలో ఏది బెస్ట్ అని చెప్పడం అంత ఈజీ కాదు. ఎందుకంటే రైడర్ల రోజువారీ అవసరాలపైనే ఈ ఎంపిక పూర్తిగా ఆధారపడి ఉంటుంది.

Continues below advertisement

Read Also: Honda City Facelift: హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ సరికొత్త లుక్ - డీలర్‌షిప్స్‌లో సందడి చేస్తున్న లగ్జరీ సెడాన్ కార్ 

సిటీ రైడర్లకు ఎలక్ట్రిక్ బైకులు ..

Continues below advertisement

నగరాల్లో ప్రయాణించే వారికి ఎలక్ట్రిక్ బైకులు ఇప్పుడు చాలా ప్రాక్టికల్‌గా అనిపిస్తున్నాయి. సిటీల్లో ఆఫీసులకు వెళ్లేవారు రోజుకు సగటున 20 నుండి 50 కిలోమీటర్లు ప్రయాణిస్తుంటారు. ఈ రేంజ్ ఆధునిక ఎలక్ట్రిక్ బైకులు ఈజీగా ఆఫర్ చేస్తున్నాయి. ఢిల్లీ, బెంగళూరు, ముంబై లాంటి మెట్రో సిటీల్లో ఉండే భారీ ట్రాఫిక్‌లో ఈవీలను నడపడం చాలా సులువు. వీటిలో క్లచ్ నొక్కడం, గేర్లు మార్చడం లాంటి ఇబ్బందులు ఉండవు. ఇన్‌స్టంట్ టార్క్ ఉండటం వల్ల స్టాప్-అండ్-గో ట్రాఫిక్‌లో ఇవి క్విక్‌గా మూవ్ అవుతాయి. రన్నింగ్ కాస్ట్ పరంగా చూస్తే పెట్రోల్ రీఫిల్స్‌తో పోలిస్తే చార్జింగ్ ఖర్చు చాలా తక్కువ. ఇంజన్ ఆయిల్ మార్చడం, క్లచ్ వర్క్ లాంటివి లేకపోవడం వల్ల మెయింటెనెన్స్ బిల్స్ కూడా భారీగా తగ్గుతాయి.

Read Also: New FASTag Category Planned: టోల్ మిన‌హాయించిన‌ వాహనాల కోసం కొత్త ఫాస్ట్‌ట్యాగ్ కేటగిరీ - కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్లాన్ 

లాంగ్ రైడ్స్ కోసం పెట్రోల్ బైకులే ...

ఎలక్ట్రిక్ బైకులకు ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నా పెట్రో మోటార్ సైకిళ్లకు ఉన్న క్రేజ్ అస్సలు తగ్గలేదు. దీనికి ప్రధాన కారణం కన్వీనియన్స్. దేశంలో ఎక్కడ చూసినా ఫ్యూయల్ స్టేషన్లు అందుబాటులో ఉంటాయి. అదే ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంకా అన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో డెవలప్ అవ్వలేదు. చిన్న టౌన్లలో నివసించే వారికి, తరచూ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే వారికి పెట్రోల్ బైకులే ఇప్పటికీ ది బెస్ట్ ఆప్షన్. కేవలం ఐదు నిమిషాల్లో ఫ్యూయల్ రీఫిల్ చేసుకోవచ్చు, మధ్యలో చార్జింగ్ అయిపోతుందనే భయం అస్సలు ఉండదు. మన దేశంలో ఒక వాహనాన్ని కొంటే చాలా ఏళ్ల పాటు వాడతారు. అందువల్ల పెట్రోల్ బైకులకు ఉన్న రీసేల్ వాల్యూ, నమ్మకమైన సర్వీస్ సపోర్ట్ కస్టమర్లకు మరింత ధీమాను ఇస్తాయి. బ్యాటరీ రీప్లేస్‌మెంట్ కాస్ట్, ఈవీల మన్నికపై ఇంకా కొందరిలో సందేహాలు ఉన్నాయి.

రైడింగ్ ఫీలింగ్.. ఫైనల్ బడ్జెట్ డెసిషన్

భారతీయులకు బైక్ అనేది కేవలం ఒక మెషిన్ మాత్రమే కాదు, దాంతో ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. ఇంజన్ నుంచి వచ్చే సౌండ్, గేర్లు మార్చేటప్పుడు వచ్చే ఫీలింగ్, వైబ్రేషన్స్ అన్నీ ఆ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌లో ఒక భాగం. ఈ రకమైన క్యారెక్టర్, ఎంగేజ్‌మెంట్‌ను ఎలక్ట్రిక్ బైకులు ఇప్పటికీ పూర్తిగా రీప్లేస్ చేయలేకపోతున్నాయి. హోమ్ చార్జింగ్ సదుపాయం ఉండి, కేవలం సిటీ లోపల మాత్రమే తిరగాలనుకునే వారికి ఎలక్ట్రిక్ బైకులు చాలా కాస్ట్-ఎఫెక్టివ్ పరిష్కారం. కానీ రూరల్ ఏరియాస్, లాంగ్ జర్నీలు, మాగ్జిమం ఫ్లెక్సిబిలిటీ కోరుకునే మెజారిటీ ఇండియన్ బయర్స్ కోసం పెట్రోల్ మోటార్ సైకిళ్లే ఇప్పటికీ పర్ఫెక్ట్ ఛాయిస్.