New Cars Launching Under 10 Lakh Rupees: భారత మార్కెట్లో కొత్త కార్లు ఒకదాని తర్వాత ఒకటి లాంచ్ అవుతున్నాయి. ప్రజలు తమ బడ్జెట్‌కు అనుగుణంగా మంచి కారు కోసం చూస్తున్నారు. ఇటీవల నిస్సాన్ చవకైన ధరలో కొత్త మాగ్నైట్‌ను లాంచ్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు రూ.10 లక్షల బడ్జెట్‌లో రెండు కొత్త కార్లు మార్కెట్లోకి రానున్నాయి. ఈ కొత్త కార్లు మారుతి డిజైర్, స్కోడా కైలాక్. వీటిని రూ. 10 లక్షల బడ్జెట్‌లో మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.


మారుతి డిజైర్ లీకైన ఫోటో ఈ కారు మునుపటి మోడల్ కంటే ఎక్కువ ప్రీమియం కావచ్చని చూపిస్తుంది. ఈ కారు స్లిమ్ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంటుంది. వీటిని క్రోమ్ లైన్‌తో కనెక్ట్ చేయవచ్చు. ఈ మారుతి కారు మునుపటి మోడల్ కంటే పెద్ద గ్రిల్ కలిగి ఉంటుంది. మారుతి డిజైర్ పొడవు మునుపటిలాగా నాలుగు మీటర్ల రేంజ్‌లోనే ఉంటుంది. కారు వెనుక భాగంలో పెద్ద క్రోమ్ లైన్‌ను కూడా ఇన్‌స్టాల్ చేయవచ్చని తెలుస్తోంది. ఇది టెయిల్ ల్యాంప్‌లతో అనుసంధానం అయి ఉంటుంది.



Also Read: వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉన్న బెస్ట్ కార్లు - అసలు లేకపోయినా ఆశ్చర్యం అక్కర్లేదు!


మారుతి డిజైర్ కొత్త ఇంజిన్‌లో మార్పులు...
మారుతి డిజైర్ కొత్త తరం మోడల్ పవర్‌ట్రెయిన్‌లో మార్పులు ఉండవచ్చు. కొత్త స్విఫ్ట్ లాగా ఈ కారులో జెడ్ సిరీస్, 3 సిలిండర్ ఇంజన్ ఉండవచ్చు. ఈ ఇంజన్‌తో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ను కూడా అందించవచ్చని తెలుస్తోంది. దాని స్టాండర్డ్ మోడల్‌లో 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ చూడవచ్చు. మారుతి లాంచ్ చేయనున్న ఈ కొత్త మోడల్ వాహన తయారీదారుల అమ్మకాలను గణనీయంగా పెంచుతుంది.


స్కోడా కైలాక్
ఇది కాకుండా రెండో లాంచ్ స్కోడా కైలాక్. ఇది నవంబర్ 6వ తేదీన భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ ఎస్‌యూవీ పొడవు నాలుగు మీటర్ల కంటే తక్కువగా ఉండబోతోంది. దీనిలో 1.0 లీటర్ టీఎస్ఐ టర్బో పెట్రోల్ చూడవచ్చు. దీనితో పాటు ఇది 6 స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్‌తో మార్కెట్లోకి రానుంది. సెక్యూరిటీ కోసం ఈ మోడల్‌లో ఈబీడీ, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు కనిపిస్తాయి. 



Also Read: ఆకాశాన్నంటే ధర - అయినా అవుట్ ఆఫ్ స్టాక్ - మార్కెట్లో ఈ కియా కారుకు సూపర్ డిమాండ్‌!