Maruti Suzuki Budget Cars : భారత్‌లో సామాన్యుడి కారు కల నిజయం చేయడంలో మారుతి సుజుకి పాత్ర అమోఘం. ముఖ్యంగా పది లక్షల రూపాయల లోపు ధరలో విభిన్న బాడీ స్టైల్స్, ఇంధన రకాలు, అధునాతన ఫీచర్లతో కూడిన కార్లను అందించడంలో ఈ సంస్థ ముందంజలో ఉంటుంది. ప్రస్తుతం ఈ బడ్జెట్‌లో మధ్యతరగతికి 13 రకాల మోడళ్లు అందుబాటులో ఉన్నాయి.
భారతీయ వినియోగదారులు మారుతి కార్లను ఎంచుకోవడానికి ప్రధాన కారణం వాటి అసాధారణమైన మైలేజీ, తక్కువ నిర్వహణ ఖర్చు. ఈ బడ్జెట్ విభాగంలో లభించే 12 మోడళ్లు లీటరకు 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీని అందిస్తున్నాయి. అదనంగా రీసేల్ వాల్యూ, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న సర్వీస్ నెట్‌వర్క్ వినియోగదారులకు ఈ బ్రాండ్ పట్ల నమ్మకాన్ని కలిగిస్తున్నాయి.
ప్రజలకు అందుబాటులో ఉన్న మోడల్స్ ఇవే
మారుతి సుజుకి తన పది లక్షల బడ్జెట్‌ను హ్యాచ్‌బ్యాక్, ఎస్‌యూవీ, ఎంపీవీ, సెడాన్ వంటి విభాగాల్లో విస్తరించింది.
హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మారుతి చాలా బలంగా ఉంది. ఇక్కడ మొదటి ఎంపిక మారుతి ఆల్టో కే 10. ఇది 3.70 లక్,ళ నుంచి 5.45 లక్షల ధరలో లభిస్తుంది. ఈకారు 24.4 నుంచి 33.9 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. తర్వాత మైక్రో ఎస్‌యూవీ లుక్‌లో ఉండే మారుతి ఎస్‌ప్రెస్సో. ఇది 3.50 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఎక్కువ మైలేజీ ఇచ్చేది మారుతి సెలెరియో. ఇది సీఎజీపై 34.4కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది. స్విఫ్ట్ 5.79 లక్షల నుంచి బలెనో 5.99 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇవి స్టైల్, పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటున్నాయి.
ఎస్‌యూవీ, సెడాన్‌లో ఆకట్టుకుంటున్న మారుతి
6.85 లక్షలతో లభించే మారుతి ఫ్రాంక్ నియో రెట్రో లుక్‌తో ఆకర్షిస్తోంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో నమ్మకమైన మోడల్ మారుతి బ్రెజ్జా. దీని ధర 8.26 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. సెడాన్ ప్రియులను 6.26 లక్షల ప్రారంభదరతో మారుతి డిజైర్ బాగా నచ్చుతోంది. ఇది సీఎన్జీ విభాగంలో 33.7కిలోమీటర్ల మైలేజీని అందిస్తోంది.
ఎంపీవీ, కమర్షియల్‌లోనూ టాప్
మారుతి ఎర్టిగా ఫ్యామిలీ ఎంపీవీగా పేరొంది. ఇది 8.80 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మారుతి ఈకో వాణిజ్య అవసరాల కోసం పెద్ద కుటుంబాల కోసం ఉపయోగపడుతోంది. దీని ధర 5.21 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
భద్రతలోనూ చాలా అప్‌డేషన్స్
ఒకప్పుడు భద్రత విషయంలో చాలా విమర్శలు ఎదుర్కొన్న మారుతి, ఇప్పుడు తన ప్రమాణాలను మెరుగుపరుచుకుంది. పది లక్షల లోపు లభించే కార్లలో పది మోడళ్లు ఇప్పుడు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తున్నాయి. దాదాపు అన్ని మోడల్స్‌లో ABS సిస్టమ్ వస్తోంది. సెంట్రల్ లాకింగ్ తప్పనిసరి అయ్యింది. ప్రీమియం మోడల్స్‌లో 60 డిగ్రీ కమెరా, సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ చార్జింగ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వంటి ఫీచర్లు కూడా ఉంటున్నాయి.
త్వరలో మారుతి నుంచి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ లాంచ్ చేయనుంది. దీని అంచనా ధర 8.50 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం మారుతిలో పది లక్షల రూపాయల లోపు మోడల్స్ 13 ఉండగా, వాటిలో పది మోడల్స్ సీఎన్జీ వేరియంట్లలో కూడా లభిస్తున్నాయి. ఇది పట్టణ, గ్రామీణ ప్రాంత వినియోగదారులను ఆకట్టుకోనున్నాయి.
