Peddi Release Latest Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' ఈ నెల (ఏప్రిల్)లో విడుదల కావడం లేదు. ఏప్రిల్ 30న థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ఈసారి ఆ మాటను అధికారికంగా చిత్ర బృందం చెప్పింది. మరి, సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది? అంటే... 

జూన్ నెలకు వెళ్లిన 'పెద్ది'Peddi June Release Date: అవును... 'పెద్ది' విడుదల ఏప్రిల్ 30వ తేదీ నుంచి జూన్ నెలకు వాయిదా పడింది. ఆ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ స్పష్టం చేసింది. అయితే... జూన్ నెలలో ఎప్పుడు విడుదల చేస్తారు? అనేది మాత్రం ఇంకా చెప్పలేదు. జూన్ మొదటి వారంలో విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుస్తోంది.

'పెద్ది' వాయిదాకు కారణాలు...Reasons For Peddi Release Postponed: 'పెద్ది' వాయిదా వేయడానికి కారణం చిత్ర బృందానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోవడానికి తగిన సమయం ఇవ్వాలని అనుకోవడమే అని నిర్మాణ సంస్థ పేర్కొంది. 

Also Read: Purple Halcyon: ఇన్‌స్టాలో సబ్‌స్క్రిప్షన్‌తో నెలకు కోటి సంపాదించిన కేరళ కుట్టి... ఇప్పుడు ఏమైందో తెలుసా?

''సినిమా టాకీ పార్ట్ పూర్తి అయ్యింది. ఇంకా ఒక్క సాంగ్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. మేం ఆల్రెడీ ఎడిట్ పార్ట్ చూశాం. అవుట్ పుట్ చూసి చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాం. మా చేతిలో గొప్ప కంటెంట్ ఉన్నప్పుడు... దాన్ని అంతే బెస్ట్ గా ప్రేక్షకుల ముందు ప్రజెంట్ చేయాలి. పర్ఫెక్షన్ కోసం, ప్రేక్షకులకు బెస్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం కోసం మా టెక్నీషియన్లకు, పోస్ట్ ప్రొడక్షన్ టీంకి మరికొంత సమయం ఇవ్వాలని అనుకున్నాం. అందుకని జూన్ నెలకు విడుదల వాయిదా వేశాం. త్వరలో కచ్చితమైన విడుదల తేదీని చెబుతాం'' అని 'పెద్ది' టీం ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఆల్రెడీ విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలకు వచ్చిన స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేసింది.

Also Read: Mrunal Thakur: మళ్ళీ బికినీలో మృణాల్... బాలీవుడ్‌లో అంతే అంతే!

రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్న 'పెద్ది' సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. శివరాజ్ కుమార్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా సినిమా విడుదల కానుంది.

Also Read: Varun Tej: ప్రాక్టీస్ 'బరి'లో మెగా హీరోకి గాయాలు... అపోలో ఆస్పత్రిలో సర్జరీ