భారత మార్కెట్లో మారుతి సుజుకి బ్రెజ్జాకి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఫెస్టివల్ సీజన్లో మీరు ఈ కారును కొనాలని అనుకుంటున్నారా.. అయితే మీరు మారుతి బ్రెజ్జా CNG కారును మీరు ఎలా కొనుగోలు చేయవచ్చు, ప్రతి నెల ఎంత EMI చెల్లించాలి ఫైనాన్స్ వివరాలు అందిస్తున్నాం. చాలా మంది కారు కొనేటప్పుడు ఒకేసారి డబ్బులు చెల్లించే బదులు లోన్ లేదా ఈఎమ్‌ఐ విధానాన్ని ఎంచుకోవడం మనం చూస్తుంటాం.
ఒకేసారి చెల్లించేందకు మీ వద్ద పూర్తి నగదు లేకపోయినా మీరు కేవలం 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్ చెల్లించి బ్రెజ్జా సిఎన్‌జిని మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు. ప్రతినెల ఎంత వాయిదా చెల్లించాలి అనేది మీరు ఎంచుకునే టర్మ్ బట్టి డిసైడ్ అవుతుంది. మారుతి సుజుకీ అద్భుతమైన ఎస్‌యూవీ బ్రెజ్జా CNG ఫైనాన్స్ చేయడం ద్వారా మీకు ఖర్చు ఎంత అవుతుంది, బ్యాంక్ లెక్కలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
బ్రెజ్జా CNG ఆన్-రోడ్ ధర
మారుతి బ్రెజ్జా సిఎన్‌జి ప్రారంభ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 9.20 లక్షలకు ప్రారంభమై టాప్ వేరియంట్లలో రూ. 12 లక్షల వరకు ఉంటుంది. దీనికి మీరు ఆర్‌టిఓ, ఇన్సూరెన్స్, ఇతర ఛార్జీలను కలిపితే ఆన్-రోడ్ ధర అవుతుంది. మీరు ఎంచుకున్న వేరియంట్ మొత్తం ఆన్-రోడ్ ధర హైదరాబాద్‌లో సుమారు రూ. 11 లక్షలు అనుకుందాం. ఇప్పుడు మీరు రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లిస్తే, మీరు బ్యాంక్, ఫైనాన్స్ సంస్థల నుండి మొత్తం రూ. 9 లక్షల కార్ లోన్ తీసుకోవాలి. 2 లక్షల రూపాయలు చెల్లించిన తర్వాత మిగిలిన డబ్బుపై బ్యాంక్ వడ్డీని వసూలు చేస్తుంది.
ప్రతి నెల EMI ఎంత కట్టాలి
మీరు రూ.9 లక్షల లోన్ తీసుకుంటే ప్రతి నెల ఈఎమ్‌ఐ అనేది వడ్డీ రేట్లు, మీరు ఎంచుకునే టర్మ్ బట్టి డిసైడ్ చేస్తారు. సుమారు 9 శాతం సగటు వడ్డీ రేటు, లోన్ కాలాన్ని ఒకవేళ మీరు 4 సంవత్సరాల (48 నెలలు) ఎంచుకుంటే, ప్రతి నెలా సుమారు రూ.22,392 ఈఎంఐ చెల్లించాలి. చెల్లించే మొత్తం వడ్డీ సుమారు రూ.1,74,816 అవుతుంది.
Also Read: సరికొత్తగా మార్కెట్లోకి Skoda Slavia Facelift.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే.. ఫీచర్ల వివరాలు
లోన్ 5 సంవత్సరాల (60 నెలలు) వ్యవధికి తీసుకుంటే, నెలవారీ ఈఎంఐ 18,683 రూపాయలకు తగ్గుతుంది. కానీ టైమ్ పెరగడం వల్ల మొత్తం వడ్డీ భారం 2,20,980 కు పెరుగుతుంది. ఇక 6 సంవత్సరాల (72 నెలలు) కాలపరిమితిని ఎంచుకుంటే నెలవారీ కట్టవలసిన ఈఎంఐ మరింత తగ్గి రూ.16,220 అవుతుంది. లోన్ మీద మీరు చెల్లించే మొత్తం వడ్డీ సుమారు 2,67,840 కు పెరుగుతుంది.
సిఎన్‌జి కారు మైలేజ్
మారుతి బ్రెజ్జా సిఎన్‌జి కారు అద్భుతమైన ఇంధన సామర్థ్యంతో ఆకట్టుకుంటోంది. కిలో సిఎన్‌జికి సుమారు 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీ ఇస్తుంది. రోజువారీ ఆఫీసుకు వెళ్లడానికి లేదా సిటీలో బిజినెస్ పనిమీద వెళ్లేవారు తక్కువ మెయింటనెన్స్ ఖర్చుతో ఈ కారును ఉపయోగించవచ్చు.
Also Read: హ్యుందాయ్ వెర్నా పెట్రోల్ CVT నిజమైన మైలేజ్ ఇదే.. నగరంలో నిరాశపరిచినా హైవేపై డబ్బు ఆదా!
