Maruti Brezza 2026 On Road Price Hyderabad: భారతీయ ఆటోమొబైల్ రంగంలో కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగానికి ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించిన మోడల్ మారుతి సుజుకి బ్రెజ్జా. నగర వీధుల్లో సులువుగా ప్రయాణించడమే కాకుండా, లాంగ్ డ్రైవ్స్‌లోనూ అద్భుతమైన కంఫర్ట్, నమ్మకమైన మైలేజీని అందించే ఈ కారు, హైదరాబాద్ వినియోగదారులను ఎంతగానో కట్టుకుంటోంది. హైదరాబాద్ మార్కెట్‌లో ఈ కారు ధరలు, వేరియంట్స్, ఫీచర్లలో వచ్చిన మార్పులు గురించి తెలుసుకుందాం.
ఒక కారును కొనుగోలు చేసే సమయంలో కేవలం ఎక్స్‌షోరూమ్ ధర మాత్రమే కాకుండా, రోడ్డుపైకి వచ్చేసరికి అయ్యే మొత్తం ఖర్చు ఎంత అనేది ప్రతి మధ్యతరగతి కుటుంబానికి అత్యంత కీలకం. హైదరాబాద్ నగర పరిధిలో వర్తించే రోడ్ టాక్స్, ఇన్సూరెన్స్ ఛార్జీలతో కూడిన పూర్తి ధరల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
మారుతి బ్రెజ్జా మొత్తం 15 వేరియంట్లను మార్కెట్‌లో అమ్మకానికి ఉంచింది. వాటి హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ధరల గురించి చూద్దాం.
| వేరియంట్ పేరు | ఫ్యూయల్ టైప్ | ట్రాన్స్మిషన్ | ఎక్స్‌షోరూమ్ ధర | ఆన్‌రోడ్ ప్రైస్ |
| బ్రెజ్జాLXi | పెట్రోల్ | మాన్యువల్ | ₹ 8,25,900 | ₹ 10,02,567 |
| బ్రెజ్జాLXi | సీఎన్‌జీ | మాన్యువల్ | ₹ 9,16,900 | ₹ 11,11,929 |
| బ్రెజ్జాVXi | పెట్రోల్ | మాన్యువల్ | ₹ 9,25,900 | ₹ 11,21,832 |
| బ్రెజ్జాVXi | సీఎన్‌జీ | మాన్యువల్ | ₹ 10,16,900 | ₹ 12,82,273 |
| బ్రెజ్జాZXi | పెట్రోల్ | మాన్యువల్ | ₹ 10,39,900 | ₹ 13,10,762 |
| బ్రెజ్జాZXi DT | పెట్రోల్ | మాన్యువల్ | ₹ 10,55,300 | ₹ 13,29,682 |
| బ్రెజ్జాVXi AT | పెట్రోల్ | ఆటోమేటిక్ | ₹ 10,59,900 | ₹ 13,34,718 |
| బ్రెజ్జాZXi | సీఎన్‌జీ | మాన్యువల్ | ₹ 11,30,900 | ₹ 14,25,134 |
| బ్రెజ్జాZXi DT | సీఎన్‌జీ | మాన్యువల్ | ₹ 11,46,300 | ₹ 14,43,853 |
| బ్రెజ్జాZXi Plus | పెట్రోల్ | మాన్యువల్ | ₹ 11,50,900 | ₹ 14,49,324 |
| బ్రెజ్జాZXi Plus DT | పెట్రోల్ | మాన్యువల్ | ₹ 11,66,300 | ₹ 14,68,032 |
| బ్రెజ్జాZXi AT | పెట్రోల్ | ఆటోమేటిక్ | ₹ 11,74,900 | ₹ 14,78,670 |
| బ్రెజ్జాZXi AT DT | పెట్రోల్ | ఆటోమేటిక్ | ₹ 11,90,300 | ₹ 14,97,378 |
| బ్రెజ్జాZXi Plus AT | పెట్రోల్ | ఆటోమేటిక్ | ₹ 12,85,900 | ₹ 16,17,008 |
| బ్రెజ్జాZXi Plus AT DT | పెట్రోల్ | ఆటోమేటిక్ | ₹ 13,01,300 | ₹ 16,35,715 |
బ్రెజ్జా ఎందుకు కొనాలి?
మారుతి సుజుకి బ్రెజ్జా కేవలం ఒక బ్రాండ్ పేరుతో మాత్రమే కాకుండా రోడ్లపై బలమైన ముద్ర వేసింది. పోటీదారుల కంటే భిన్నంగా వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇందులో ఉపయోగించిన 1.5 లీటర్ కే15సి స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ లాంగ్ డ్రైవ్‌లకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇది 102 బీహెచ్‌పీ పవర్, 136.8ఎన్‌ఎం టార్క్‌ను అందిస్తుంది. సిటీ ట్రాఫిక్‌లోనైనా, హైవేలపైనైనా బ్రెజ్జా మైలేజ్ అత్యంత ఆకట్టుకుంటుంది. పెట్రోల్ వేరియంట్లు లీటరుకు సుమారు 17.38 కిలోమీటర్ల నుంచి 19.89 వరకు మైలేజీ అందిస్తుండగా, సీఎన్జీ వేరియంట్లు కేజీకి 25.51 కిలోమీటర్ల మైలేజీ అందిస్తాయి.
భారత్‌లో మారుతి సుజుకి వాహనాలకు ఉన్న రీసేల్ మార్కెట్ మరో ఇతర బ్రాండ్‌కు లేదు. ఐదేళ్ల తర్వాత విక్రయించినా మంచి ధర పలుకుతుంది. ఐదుగురు ప్రయాణికులు ఎంతో సౌకర్యవంతంగా కూర్చుకోవడానికి తగిన లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ ఇందులో ఉన్నాయి. లాంగ్ జర్నీల్లో అలట లేకుండా ప్రయాణించవచ్చు.
ఈఎంఐ అంచనాలు!
మీరు హైదరాబాద్‌లో బ్రెజ్జా మోడల్ ఎల్‌ఎక్స్‌ఐను లోన్ ద్వారా కొనుగోలు చేయాలనుకుంటే, దీని కోసం కనీసం లక్ష రూపాయలు డౌన్‌పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మిగతా 9 లక్షలకుపైగా నగదును బ్యాంక్ లోన్ ద్వారా పొందవచ్చు. దీనికి 9.5 శాతం వడ్డీతో ఐదేళ్ల కాలపరిమితితో లోన్ తీసుకుంటే నెలకు 19 వేల నుంచి 19500 వరకు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అయితే మీకు ఉన్న సిబిల్ స్కోర్ ఆధారంగా బ్యాంకు వడ్డీ, బ్యాంక్ లోన్ ఆధారపడి ఉంటుంది.
