ఫ్యామిలీ జర్నీ కోసం కారు కొనాలని చాలా మంది ఆలోచిస్తుంటారు. మీరు కనుక తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కొనాలని ప్లాన్ చేస్తుంటే మారుతి బలేనో (Maruti Baleno) బెస్ట్ ఆప్షన్ కావచ్చు. అయితే మీ వద్ద కారు కొనేందుకు మొత్తం నగదు లేకపోయినా కొనుగోలు చేయవచ్చు. మీరు రూ. 50,000 చెల్లించి కూడా మారుతి బలేనో బేస్ వేరియంట్‌ను సొంతం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ కారును ఫైనాన్స్ ద్వారా తీసుకుంటే ప్రతి నెలా ఎంత EMI చెల్లించాలి పూర్తి వివరాలు తెలుసుకోండి. 

Continues below advertisement

మారుతి సుజుకి బలేనో బేస్ వేరియంట్ పేరు Sigma. ఈ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.5.99 లక్షలుగా ఉంది. దీనిని హైదరాబాద్‌లో కొనుగోలు చేస్తే, ఎక్స్-షోరూమ్ ధరతో పాటు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ ఖర్చులు కలుపుకుని ఆన్-రోడ్ ధర సుమారు రూ.7.18 లక్షల వరకు ఉంటుంది.

ఎంత డౌన్ పేమెంట్‌పై కారును కొనవచ్చు?మీరు Baleno Sigma వేరియంట్ కోసం కనీసం రూ. 50,000 డౌన్ పేమెంట్ చేస్తే, మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ నుండి కార్ లోన్ పొందవచ్చు. అప్పుడు మీరు ఈ కారు కోసం రూ.6.68 లక్షల లోన్ తీసుకోవాలి. ఒకవేళ మీరు ఈ లోన్‌ను 4 సంవత్సరాలకి 9 శాతం వడ్డీ రేటుతో తీసుకుంటే, ప్రతి నెలా 16,612 EMI చెల్లించాల్సి ఉంటుంది. అదే 5 సంవత్సరాలకు లోన్ తీసుకుంటే ప్రతినెలా EMI సుమారు ₹13,857 అవుతుంది.

Continues below advertisement

ఒకవేళ 6 సంవత్సరాలకు అయితే ఈఎంఐ రూ. 12,033, 7 సంవత్సరాల లోన్ అయితే ప్రతి నెలా EMI రూ.10,740 చెల్లించాలి. EMI అనేది బ్యాంక్ వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు, మీ లోన్ ప్రొఫైల్‌ ఆధారంగా మారవచ్చు. 9 శాతం వడ్డీ రేటుపై ఏడేళ్లపాటు లోన్ చెల్లిస్తే, కేవలం వడ్డీ రూపంలోనే సుమారు ₹2.30 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఎక్స్-షోరూమ్ ధర, ఆన్-రోడ్ ఖర్చులు, వడ్డీని కలిపితే మీరు కారు కోసం మొత్తం రూ.9 లక్షల వరకు ఖర్చు చేస్తారు. 

మారుతి బలేనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌ కారు. మార్కెట్‌లో Toyota Glanza, Tata Altroటతో పాటు Hyundai i20 వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తుంది. ధర పరంగా చూస్తే Nissan Magnite, రెనాల్ట్ కైగర్ (Renault Kiger), మారుతి స్విఫ్ట్ (Maruti Swift), Fronx వంటి కార్లతోనూ పోటీ పడుతుంది. 

త్వరలో మార్కెట్లోకి కొత్త మారుతి బలేనో కారుకొత్త మారుతి బలేనో ఫేస్‌లిఫ్ట్‌లో అతిపెద్ద మార్పు కారు ఎక్స్‌టీరియర్ డిజైన్‌లో చూడవచ్చు. దీని ఫ్రంట్ లుక్‌ను మరింత స్పోర్టీగా, ఆకర్షణీయంగా మార్చవచ్చు. ఇందులో కొత్త డిజైన్ గ్రిల్, అప్‌డేటెడ్ LED హెడ్‌లైట్లు, కొత్త ఫ్రంట్ బంపర్ ఇచ్చే అవకాశం ఉంది. DRLలు, టైల్‌లైట్లలో కూడా మార్పు చేయవచ్చు. దాంతో కారు డిజైన్ మరింత మోడ్రన్ అనిపిస్తుంది. కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్ ద్వారా దీని రోడ్ ప్రెజెన్స్‌ను మరింత మెరుగుపరుస్తాయి.

బలేనో ఫేస్‌లిఫ్ట్ క్యాబిన్‌లో కూడా మార్పులుంటాయి. కంపెనీ ఇందులో కొత్త అపోల్స్టరీ, మంచి క్వాలిటీ డ్యాష్‌బోర్డ్‌ అందించవచ్చు. ఇవే కాకుండా పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 360-డిగ్రీ కెమెరా, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లే వంటి ఫీచర్లు ఇవ్వవచ్చు. ఈ మార్పులతో కొత్త బలేనో క్యాబిన్ గతంలో కంటే మరింత ప్రీమియంగా, టెక్నాలజీతో కనిపిస్తుంది.

కొత్త మారుతి బలేనో ఫేస్‌లిఫ్ట్‌లో ప్రస్తుతం ఉన్న 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ సిఎన్‌జి (CNG) ఆప్షన్‌తో కూడా రావొచ్చు. దీనితో పాటు కంపెనీ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ లేదా హైబ్రిడ్ టెక్నాలజీ ఆప్షన్‌ లాంచ్ చేయవచ్చు. హైబ్రిడ్ వర్షన్ వస్తే, కారు పెర్ఫార్మెన్స్‌తో పాటు మైలేజ్ కూడా పెరుగుతుంది. హైబ్రిడ్ బలేనో లీటరుకు 30 నుండి 35 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కొన్ని రిపోర్ట్స్ వెల్లడించాయి.