Maruti Grand Vitara vs Maruti Dzire Mileage: మారుతి సుజుకి కార్లకు ఇండియన్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ఈ కార్లు మంచి మైలేజ్ ఇవ్వడం వల్ల ప్రజలు బాగా ఇష్టపడతారు. అందుకే ఇండియన్ మార్కెట్లో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మారుతి సుజుకి కార్లన్నీ బాగానే ఉన్నా, గ్రాండ్ విటారా, మారుతి డిజైర్‌లలో ఏది ఎక్కువ మైలేజ్ ఇస్తుందో ఇక్కడ మనం తెలుసుకుందాం.
గ్రాండ్ విటారా, మారుతి డిజైర్ మైలేజ్‌ను పోల్చితే, ఈ పోటీలో గ్రాండ్ విటారా సూపర్ అని చాలా మంది చెబుతారు. కంపెనీ అత్యధిక మైలేజ్ ఇచ్చే కారు గ్రాండ్ విటారానే. ఈ కారులో 1462 cc పెట్రోల్ ఇంజన్ ఉంది, ఇది 6,000 rpm వద్ద 75.8 kW పవర్, 4,400 rpm వద్ద 136.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
గ్రాండ్ విటారా మైలేజ్
మారుతి గ్రాండ్ విటారా హైబ్రిడ్ మోడల్‌లో లిథియం అయాన్ బ్యాటరీ ఉంది, ఇది 3,995 rpm వద్ద 59 kW పవర్, 0 నుండి 3,995 rpm వద్ద 141 Nm టార్క్ ఇస్తుంది. గ్రాండ్ విటారా పెట్రోల్ వేరియంట్ 27.91 kmpl మైలేజ్ ఇస్తుందని చెబుతున్నారు. మాన్యువల్ CNG వేరియంట్ మైలేజ్ 26.6 km/kg. కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.99 లక్షల నుంచి రూ. 20.9 లక్షల వరకు ఉంటుంది.
కొత్త మారుతి డిజైర్ మైలేజ్
కొత్త మారుతి డిజైర్‌ను కంపెనీ గతేడాది విడుదల చేసింది. ఇందులో 1.2-లీటర్ Z సిరీస్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్‌తో ఈ కారు 25.71 kmpl మైలేజ్ ఇస్తుందని చెబుతున్నారు. అయితే, మారుతి డిజైర్ CNG వేరియంట్ మైలేజ్ ఎక్కువ. డిజైర్ CNG వేరియంట్ 33.73 km/kg మైలేజ్ ఇస్తుంది. కొత్త డిజైర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.79 లక్షల నుంచి రూ. 10.14 లక్షల వరకు ఉంటుంది.
మారుతి గ్రాండ్ విటారాvs మారుతి డిజైర్ మధ్య ఈఎంఐలో తేడాలు
మారుతి గ్రాండ్ విటారా కొనాలంటి అంటే ఎంత ఈఎంఐ చెల్లించాలి. గ్రాండ్ విటారా దాదాపు ఆరు వేరియంట్స్‌లో లభిస్తుంది. దాని బట్టి మీ ఖర్చు, ఈఎంఐ ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు బేసిక్ మోడల్ ఆల్ఫా పెట్రోల్ వెహికల్ తీసుకుంటే 20 లక్షల 23 వేల రూపాయలు ఖర్చు చేయాలి. ఇందులో లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ చేసుకుంటే మీరు మిగతా అమౌంట్‌ను లోన్ రూపంలో తీసుకొవచ్చు. ఈ అమౌంట్ నాలుగేళ్లకు తీసుకుంటే నెలకు 48,836 రూపాయలు ఈఎంఐ చెల్లించాలి. అదే మీరు తీసుకున్న సంవత్సరాలను బట్టి ఈఎంఐ మారిపోతూ ఉంటుంది. మీరు చెల్లించే డౌన్ పేమెంట్ ఆధారంగా కూడా మారుతుంది.
మారుతి డిజైర్ మోడల్ ధర 8 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడ కూడా మీరు బేసిక్ మోడల్ తీసుకుంటే మాత్రం 8 లక్షల ఇరవై వేలు చెల్లించాలి. దీనికి మీరు లక్ష రూపాయల డౌన్ పేమెంట్ చెల్లించే పది శాతం వడ్డీతో నాలుగేళ్లకు మిగతా అమౌంట్ లోన్ తీసుకుంటే నెలకు 18వేల రూపాయలు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. సంవత్సరాలు, వడ్డీ రేట్లు మారిన కొద్దీ ఈఎంఐలో హెచ్చుతగ్గులు ఉంటాయి.