భారత మార్కెట్‌లో గత కొన్నేళ్లుగా ఆటోమొబైల్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచంలో అత్యధికంగా వాహనాల విక్రయాలు జరుపుకుంటున్న దేశాలలో భారత్ ఒకటి. కేవలం పొదుపుగా ఉండటమే కాకుండా, ఇంధన సామర్థ్యం కలిగిన సిఎన్‌జి కార్ల కోసం చూస్తున్నారు. భారత ఆటో మార్కెట్‌లో ఉన్న Maruti Fronx CNG వారికి మెరుగైన ఆప్షన్‌గా చెప్పవచ్చు.  ఒకవేళ మీరు ఈ కారును ఫుల్ పేమెంట్ ఇచ్చి కాకుండా నెలవారీ EMI ప్రాతిపదికన కొనాలనుకుంటే, ఎంత డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ ఒకేసారి నగదు చెల్లించలేరు, కనుక ఫైనాన్స్ ప్లాన్ చేసుకుని కారు కొనుగోలు చేయడం మంచిది. 

Continues below advertisement

Maruti Fronx CNG ఆన్-రోడ్ ధర ఎంత?న్యూఢిల్లీలో Maruti Fronx లోని Sigma CNG వేరియంట్ ఆన్-రోడ్ ధర ₹8.81 లక్షలుగా ఉంది. ఒకవేళ మీరు ఈ కారును ₹2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించి కొనుగోలు చేస్తే 9.8 శాతం వడ్డీ రేటుతో 4 ఏళ్ల కాలానికి ప్రతి నెలా ₹17,228 EMI చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ లోన్ 3 ఏళ్లకు తీసుకుంటే, నెలవారీ EMI మొత్తం ₹21,937 అవుతుంది. అలాగే, ఈ లోన్ 2 ఏళ్ల కాలానికి తీసుకుంటే EMI మొత్తం ₹31,400 గా ఉంటుంది.

Maruti Fronx పవర్‌ట్రెయిన్మారుతి ఫ్రాంక్స్ రెండు వేర్వేరు పెట్రోల్ ఇంజన్లు, CNG ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులో 1.2 లీటర్ K-సిరీస్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, CNG ఇంజన్‌తో పాటు, 1.0 లీటర్ టర్బో బూస్టర్‌జెట్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ లభిస్తుంది. ఈ SUVని 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లలో కొనవచ్చు. ఈ రెండు ఇంజన్లు BS6 ఫేజ్ 2 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. ఇవి స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో పనిచేస్తాయి. ఇది పెట్రోల్‌ను ఆదా చేయడమే కాకుండా పర్ఫార్మెన్స్‌ను స్మూత్‌గా మార్చుతుంది.

Continues below advertisement

మారుతి కారు మైలేజీMaruti Suzuki Fronx ఈ సెగ్మెంట్‌లో అద్భుతమైన మైలేజీనిచ్చే కార్లలో ఒకటి. ARAI ప్రకారం, దీని 1.2 లీటర్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ 21.79 kmpl, 1.2 లీటర్ పెట్రోల్ AMT వేరియంట్ 22.89 kmpl మైలేజీని అందిస్తాయి. 1.2 లీటర్ CNG వేరియంట్ మైలేజీ 28.51 km/kg అని కంపెనీ తెలిపింది. దీని 1.0 లీటర్ టర్బో పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ 21.5 kmpl,  టర్బో పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ 20.01 kmpl మైలేజీ ఇస్తాయి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం, పెట్రోల్ + CNG బై-ఫ్యూయల్ మోడల్ ఫుల్ ట్యాంక్‌పై దాదాపు 1200 కిలోమీటర్ల నాన్ స్టాప్ డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది.