Tata Punch EV | కొత్త టాటా పంచ్ EV ఇప్పుడు గతంలో కంటే మరింత బడ్జెట్ ధరలో లభిస్తోంది. అయితే టాటా పంచ్ వాహనాల్లో ఏ వేరియంట్ కారు తీసుకోవాలో తెలియాలంటే ముందుగా వాటి ధరతో పాటు ఫీచర్లు, మైలేజీ వివరాలు తెలుసుకోవాలి. దాంతో మీకు ఏది కొనుగోలు చేయాలో అవగాహన వస్తుంది. టాటా పంచ్ ICE (పెట్రోల్) ధర రూ.5.5 లక్షల నుండి ₹9.7 లక్షల మధ్య ఉండగా, టాటా పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ ధర రూ.9.6 లక్షల నుండి రూ.12.5 లక్షల మధ్య ఉంది. అయితే BAAS (Battery as a Service) ప్రైసింగ్‌తో దీని ధర రూ.6.4 లక్షల నుంచి ప్రారంభమవుతుందని టాటా మోటార్స్ తెలిపింది.

Continues below advertisement

పాత టాటా పంచ్ ICE, EVల మధ్య ఉన్న ధరల మధ్య వ్యత్యాసం ఇప్పుడు తగ్గింది. టాటా పంచ్ టర్బో పెట్రోల్ ఇప్పుడు 120bhp పవర్‌ను అందిస్తుండగా, 40kWh బ్యాటరీ ప్యాక్ టాటా పంచ్ EV 129PS పవర్‌ను ఇస్తుంది. ఈ కార్ల ఫీచర్లు కూడా దాదాపు ఒకేలా ఉన్నాయి. కేవలం ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ డిజైన్‌లో స్వల్ప మార్పులు చేశారు. 

టాటా పంచ్ కార్ల ధర ఏది చౌక

Continues below advertisement

ఇప్పుడు ఖర్చు, ధరలో ఆదా విషయానికి వస్తే.. టాటా పంచ్ EV లైఫ్‌టైమ్ వారంటీతో వస్తుంది. ఇంట్లోనే ఛార్జింగ్ చేసుకుంటే, పెట్రోల్, డీజిల్ ఇంధన ఖర్చుతో పోలిస్తే పవర్ బిల్ చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల నెలవారీ మెయింటనెన్స్ ఖర్చు కూడా తగ్గుతుంది. టాటా పంచ్ ICE ధర పరంగా చౌక అని చెప్పవచ్చు. కానీ సర్వీస్, ముఖ్యంగా ఫ్యూయల్ ఖర్చులు గురించి ఆలోచిస్తే పంచ్ EVతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది.

ఏది కొంటే మంచిది?

నగరంలో ఎక్కువగా ప్రయాణించే వారికి, ఖర్చును ఆదా చేయాలనుకునే వారికి, స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని కోరుకునే వారికి పంచ్ EV సరిపోతుంది. పంచ్ EV ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. కానీ పంచ్ టర్బో పెట్రోల్ మాన్యువల్ లేదా AMT ఆప్షన్లలో లభిస్తుండగా.., ఇందులో EV అంత పవర్ ఉండదు.

ఎవరైతే ఎక్కువ దూరం ప్రయాణిస్తారో, ఎక్కడైతే ఛార్జింగ్ సౌకర్యాలు దొరకడం కష్టమో లేదా ఎవరి బడ్జెట్ తక్కువగా ఉందో వారికి టాటా పంచ్ ICE సరిపోతుంది. ఏదేమైనా EV, ICE కార్ల ధరల మధ్య వ్యత్యాసం తగ్గుతూ వస్తోందని టాటా పంచ్ EV, ICEల విషయంలో స్పష్టమవుతోంది.