Maruti Ertiga vs Kia Carens:భారతదేశంలో 7-సీటర్ MPV ఎల్లప్పుడూ పెద్ద కుటుంబాలకు చాలా అనుకూలంగా ఉంటాయి. అందుకే ఈ వాహనాలు కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి కార్లలో ఏది ఉత్తమమో కొనే ముందు తెలుసుకుంటే చాలా మంచిది. Maruti Ertiga ఈ విభాగంలో భారీ సంఖ్యలో వినియోగదారులను ఆకర్షిస్తోంది. అందుకే ఇది టాప్‌లో ఉంటుంది. అయితే మార్కెట్‌లోకి Kia Carens CNG రాకతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. రెండు కార్లు స్పేస్‌, సౌకర్యం, భద్రత, సులభమైన డ్రైవింగ్ కారణంగా ప్రజలను ఆకర్షిస్తాయి. అయితే, ధర, ఫీచర్లు, మైలేజ్‌లో చాలా వ్యత్యాసం ఉండటం వల్ల సరైన ఆప్షన్ ఎంచుకోవడం కొన్నిసార్లు కష్టమవుతుంది. కాబట్టి, బడ్జెట్, అవసరాలకు అనుగుణంగా ఏ MPV మీకు మంచిదో తెలుసుకుందాం.

Continues below advertisement

రేట్‌లో ఎవరు బెస్ట్

ధర గురించి మాట్లాడితే, Maruti Ertiga CNG, Kia Carens CNGతో పోలిస్తే కొంచెం చౌకగా ఉంటుంది. Ertiga CNG ధర రూ.10.76 లక్షల నుంచి రూ.12.11 లక్షల వరకు ఉంటుంది, అయితే Carens CNG దాదాపు రూ.11.77 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. Ertiga బడ్జెట్‌లో బాగా సెట్‌ అవుతుంది. దాని వేరియంట్‌లు కూడా మరింత పొదుపుగా ఉంటాయి. Carens మరింత ప్రీమియం ఫీచర్లు, పెద్ద క్యాబిన్ కారణంగా కొంచెం ఖరీదైనదిగా అనిపించవచ్చు, కానీ ఫీచర్లు దాని ధరకు తగ్గట్టుగానే ఉంటాయి. అంటే, తక్కువ బడ్జెట్ ఉన్నవారికి Ertiga సరైన ఎంపిక, అయితే మరింత ప్రీమియం అనుభవం కోరుకునే వారికి Carens మంచిది.

ఇంటీరియర్ -ఫీచర్లు

Ertiga ఇంటీరియర్ సాధారణమైనది. ఫ్యామిలీ వినియోగానికి సరిగా సరిపోతుంది. ఇది 7-అంగుళాల టచ్‌స్క్రీన్, Android Auto, రియర్ AC వెంట్స్,  మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వంటి ప్రాథమిక కానీ అవసరమైన సౌకర్యాలను అందిస్తుంది. ఇందులో స్పేస్‌ చాలా ఎక్కువగా ఉంది. బాగుంది, కానీ క్యాబిన్‌లో ప్రీమియం అనుభూతి లోపిస్తుంది. అదే సమయంలో, Carens ఫీచర్ల పరంగా Ertiga కంటే చాలా ఫార్వర్డ్‌గా ఉంటుంది. ఇది 10.25-అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, ప్రీమియం సాఫ్ట్-టచ్ ఇంటీరియర్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. మూడో వరుసలో కూడా స్పేస్‌ బాగుంది. CNG ట్యాంక్ ఉన్నప్పటికీ బూట్ స్పేస్ చాలా ఉంది. మీరు ప్రీమియం, ఆధునిక క్యాబిన్‌ను కోరుకుంటే, Carens మరింత మెరుగ్గా ఉంటుంది.

Continues below advertisement

ఏ వాహనం ఎక్కువ సురక్షితం?

భద్రతపరంగా, Carens కొంచెం ముందుంది. Ertiga 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, ESP, హిల్ హోల్డ్‌లను కలిగి ఉంది, అయితే Carens 6 ఎయిర్‌బ్యాగ్‌లతోపాటు ESC, హిల్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లను కూడా కలిగి ఉంది. Global NCAP పరీక్షలో, Carens పిల్లల భద్రతలో 5-నక్షత్రాల రేటింగ్ సాధించింది.

ఇంజిన్ -మైలేజ్

Ertiga CNG 1.5L ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది CNGపై 87 bhp పవర్‌ని అందిస్తుంది. దాని మైలేజ్ 26.11 km/kg వరకు ఉంటుంది. మైలేజ్‌పరంగా, Ertiga ఈ విభాగంలో ముందుంది. అదే సమయంలో, Kia Carens CNG 1.5L ఇంజిన్ 95 bhp పవర్‌ని అందిస్తుంది, ఇది మరింత శక్తివంతమైనది, కానీ దాని మైలేజ్ దాదాపు 16–17 km/kg, ఇది Ertiga కంటే తక్కువ. అంటే, Ertiga మైలేజ్‌లో మెరుగ్గా ఉంటుంది, అయితే Carens శక్తిలో ముందుంటుంది.

మీకు ఏ MPV సరైనది?

మీ బడ్జెట్ తక్కువగా ఉంటే, మైలేజ్ మీ ప్రాధాన్యత అయితే, మీరు తక్కువ నిర్వహణ కలిగిన MPVని కోరుకుంటే, Maruti Ertiga CNG మీకు సరైన ఎంపిక. కానీ మీరు మరింత ప్రీమియం ఫీచర్లు, మెరుగైన భద్రత, ఎక్కువ పవర్‌, ఆధునిక ఇంటీరియర్‌ను కోరుకుంటే, Kia Carens CNG మీ అన్ని అవసరాలను బాగా తీరుస్తుంది.