Special Sweets for Vegans : నవంబర్ నెలను ప్రపంచమంతా వీగన్ నెల(World Vegan Month Special)గా సెలబ్రేట్ చేస్తారు. రుచి లేదా సంప్రదాయానికి రాజీ పడకుండా.. మొక్కల ఆధారిత ఆహారాలు ఎంత రుచికరంగా ఉంటాయో తెలపడమే దీని లక్ష్యం. భారతీయ వంటకాలు, దాని విభిన్న రుచులు ఎంతో ప్రసిద్ధి చెందినవి. అయితే వీటిని వీగన్ పద్ధతిలో సులభంగా తయారు చేసుకోవచ్చు. వాటిలో భాగంగా రుచికరమైన స్వీట్స్ ఎలా చుసుకోవచ్చో చూసేద్దాం. డ్రై ఫ్రూట్స్, నట్స్ లడ్డూల నుంచి సిరప్ తీపి పదార్థాల వరకు.. ఈ స్వీట్లు వీగన్ పద్ధతిలో చేసుకోవచ్చు. స్పెషల్ అకేషన్ కోసం వీటిని మీరు ట్రై చేయవచ్చు.
బేసన్ లడ్డూలు
వీగన్ బేసన్ లడ్డూలు వేయించిన శనగ పిండి, బెల్లం లేదా చక్కెర, మొక్కల ఆధారిత నెయ్యి లేదా నూనెతో తయారు చేసుకోగలిగే ఆరోగ్యకరమైన స్వీట్. ఇవి చాలా మృదువుగా నట్స్‌తో నిండి ఉంటాయి. యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు. ఈ లడ్డూలు వీగన్ జీవనశైలికి అనుగుణంగా ఉంటాయి.
కాజు బర్ఫీ
జీడిపప్పు బర్ఫీలు జీడిపప్పు పొడి లేదా పేస్ట్ చేసి.. సహజమైన స్వీటెనర్తో చేయగలిగే స్వీట్. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. నోటిలో ఇట్టే కరిగిపోయే.. ఎక్కువమంది ఇష్టపడే స్వీట్స్ ఇవి. సహజంగానే వీగన్ గ్లూటెన్-రహితంగా ఉంటుంది. అలాంటివారికి ఇది స్పెషల్ స్వీట్ అవుతుంది. హెవీగా లేకుండా డెజర్ట్ కోరికలను తీరుస్తుంది. వాటి మృదువైన ఆకృతి, నట్స్ సువాసన చాలా బాగా ఉంటుంది.
జలేబి
జలేబి సాంప్రదాయమైన స్వీట్. ఇది క్రిస్పీ, బంగారు రంగులో ఉంటుంది. సువాసనగల చక్కెర సిరప్‌లో నానబెట్టి తినవచ్చు. వీగన్-స్నేహపూర్వక నూనె, మొక్కల ఆధారిత పిండిని ఉపయోగించి దీనిని తయారు చేసుకోవచ్చు. ఈ డెజర్ట్ పాల ఉత్పత్తులు లేకుండానే తయారు చేసుకోవచ్చు. బయట క్రంచీగా సిరప్ టెస్ట్ అద్భుతంగా ఉంటుంది.
కొబ్బరి లడ్డూ
కొబ్బరి లడ్డూలు తురిమిన కొబ్బరి, చక్కెర, యాలకుల పొడితో తయారు చేసుకోవచ్చు. సులభమైన వీగన్ స్వీట్‌లలో ఇది ఒకటి. ఈ చిన్న సైజు స్వీట్లు మృదువుగా, సువాసనతో నిండి ఉంటాయి. కొబ్బరి సహజమైన తీపిని ఇస్తుంది. స్వీట్ క్రేవింగ్స్ తగ్గిస్తుంది. తాజాగా లేదా ఎండిన కొబ్బరితో తయారు చేసుకోవచ్చు. కొందరు దీనిలో పాలు వేస్తారు. వేగన్ పద్ధతిలో పాలు వేయరు.
గులాబ్ జామూన్ (వీగన్ వెర్షన్)
సాంప్రదాయకంగా పాలకు సంబంధించిన పదార్థాలతో గులాబ్ జామూన్ తయారు చేస్తారు. కానీ దీనిని వీగన్ ప్రియుల కోసం మొక్కల ఆధారిత పాలు లేదా ఖోయా ప్రత్యామ్నాయాలను ఉపయోగించి వీగన్ టచ్ ఇవ్వవచ్చు. ఈ డీప్-ఫ్రైడ్ స్వీట్లో యాలకులు, రోజ్ వాటర్ కూడా వేసుకోవచ్చు.
బాదం బర్ఫీ
బాదం బర్ఫీని బాదం పొడి, బెల్లం లేదా మేపుల్ సిరప్ వంటి సహజ స్వీటెనర్లతో తయారు చేసుకోవచ్చు. మొక్కల ఆధారిత పాలు లేదా నూనెతో తయారు చేసినప్పుడు.. ఇది ఒక పరిపూర్ణమైన వీగన్ స్వీట్‌గా మారుతుంది. ఆకృతిలో గొప్పగా ఉంటుంది. మంచి సువాసనతో నిండిన ఈ ట్రీట్ స్వీట్ క్రేవింగ్స్ తీర్చడంతో పాటు మంచి పోషణ అందిస్తుంది.
మరి ఇంకెందు ఆలస్యం మీరు కూడా ఈ వీగన్ స్పెషల్ స్వీట్స్‌ను ఇంట్లో తయారు చేసేసుకోండి. స్వీట్స్ విషయంలో క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోకుండా ఇలా హెల్తీగా డిజెర్ట్స్ను ఇంటిల్లీపాది ఎంజాయ్ చేయవచ్చు.