Maruti e Vitara Variants Explained In Telugu: మారుతి సుజుకి, తన తొలి ఎలక్ట్రిక్‌ SUV ‘ఈ విటారా’ను రూ.10.99 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) ధర నుంచి మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. డెల్టా, జెటా, ఆల్ఫా (Delta, Zeta, Alpha) వేరియంట్లలో ఈ కారును లాంచ్ చేసిన మారుతి, ఈ వేరియంట్ల ధరలను పూర్తి స్థాయిలో ఇంకా ప్రకటించలేదు. కానీ, ఫీచర్ల వివరాలు మాత్రం వెల్లడించింది. మరి ఈ మూడు వేరియంట్లలో ఏది మీకు సరిపోతుంది? ఇప్పుడు ఒక్కోటి తెలుసుకుందాం.

Continues below advertisement

బ్యాటరీ ఆప్షన్లు - రేంజ్‌ ఎంత?

ఈ విటారా రెండు బ్యాటరీ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.

Continues below advertisement

49kWh బ్యాటరీ (డెల్టా వేరియంట్‌) - 144hp పవర్‌, 193Nm టార్క్‌, 440 కి.మీ. వరకు క్లెయిమ్డ్‌ రేంజ్‌.

61kWh బ్యాటరీ (జెటా, ఆల్ఫా) - 174hp పవర్‌, 193Nm టార్క్‌, 543 కి.మీ. వరకు క్లెయిమ్డ్‌ రేంజ్‌.

అంటే ఎక్కువ రేంజ్‌ కావాలంటే జెటా లేదా ఆల్ఫా వైపు వెళ్లాలి.

కలర్‌ ఆప్షన్లు

మొత్తం 10 రంగుల్లో ఈ SUV లభిస్తుంది. ఆర్కిటిక్‌ వైట్‌, బ్లూయిష్‌ బ్లాక్‌, గ్రాండ్యూర్‌ గ్రే, ల్యాండ్‌ బ్రీజ్‌, ఓపులెంట్‌ రెడ్‌, స్ప్లెండిడ్‌ సిల్వర్‌ వంటి మోనోటోన్‌ ఆప్షన్లు ఉన్నాయి. నెక్సా బ్లూ, బ్లూయిష్‌ బ్లాక్‌ తప్ప మిగతా రంగులకు డ్యూయల్‌ టోన్‌ రూఫ్‌ ఆప్షన్‌ ఉంటుంది.

డెల్టా వేరియంట్‌ - బేస్‌ అయినా ఫీచర్లలో తక్కువ కాదు

49kWh బ్యాటరీతో వచ్చే డెల్టా వేరియంట్‌ ధర రూ.10.99 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). ఈ ధరలో బ్యాటరీ రేటును కలపలేదు, బ్యాటరీని అద్దె ప్రాతిపదికన అందిస్తోంది. బ్యాటరీ అద్దె ప్రతి కిలోమీటర్‌కు 3.99 రూపాయలు.

ఈ వేరియంట్‌లోనే 10.1 ఇంచుల డిజిటల్‌ డ్రైవర్‌ డిస్ప్లే, 10.25 ఇంచుల టచ్‌స్క్రీన్‌, వైర్‌లెస్‌ Android Auto, Apple CarPlay, ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, 7 ఎయిర్‌బ్యాగ్స్‌, ముందు–వెనుక పార్కింగ్‌ సెన్సర్లు, TPMS, EPB, హిల్‌ హోల్డ్‌, LED హెడ్‌ల్యాంప్స్‌, 18 ఇంచుల అలాయ్‌ వీల్స్‌ వంటి ఫీచర్లు అందిస్తున్నారు.

అయితే.. పార్కింగ్‌ కెమెరా, వైర్‌లెస్‌ ఛార్జర్‌ లేవు.

జెటా వేరియంట్‌ - అదనపు సౌకర్యాలు

డెల్టా వేరియంట్‌లో వచ్చే అన్ని ఫీచర్లతో పాటు...

వైర్‌లెస్‌ ఫోన్‌ ఛార్జర్‌

రియర్‌ పార్కింగ్‌ కెమెరా

పార్సెల్‌ ట్రే

అంటే, రోజువారీ వినియోగంలో ఉపయోగపడే కొన్ని అదనపు ఫీచర్లు ఇక్కడ లభిస్తాయి.

ఆల్ఫా వేరియంట్‌ - టాప్‌ స్పెసిఫికేషన్‌

డెల్టా జెటా వేరియంట్లలో వచ్చే అన్ని ఫీచర్లతో పాటు...

Level 2 ADAS

360 డిగ్రీ కెమెరా

వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు

10-వే పవర్డ్‌ డ్రైవర్‌ సీట్‌

గ్లాస్‌ రూఫ్‌

8-స్పీకర్‌ Infinity సౌండ్‌ సిస్టమ్‌

అంటే, పూర్తి ప్రీమియం అనుభవం కావాలంటే ఆల్ఫా సరైన ఎంపిక.

ఏ వేరియంట్‌ కొంటే బెనిఫిట్‌?

మీకు బడ్జెట్‌ ముఖ్యమైతే, రోజువారీ సిటీ డ్రైవ్‌ మాత్రమే ఉంటే డెల్టా సరిపోతుంది. ఎక్కువ రేంజ్‌, అదనపు ఫీచర్లు కావాలంటే జెటా మంచి బ్యాలెన్స్‌ ఆప్షన్‌. టెక్నాలజీ, ADAS, పూర్తి కంఫర్ట్‌ కావాలంటే ఆల్ఫా ఎంచుకోవచ్చు.

హైదరాబాద్‌, విజయవాడలో బుకింగ్స్‌ రూ.21,000తో ప్రారంభమయ్యాయి. పూర్తి ధరల జాబితా వెలువడిన తర్వాత ఏ వేరియంట్‌ రేటెంతో మరింత స్పష్టంగా తెలుస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.