Maruti e Vitara Safety: మారుతి సుజుకి, తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఇ విటారాను ఇండియా-స్పెక్ రూపంలో పరిచయం చేసింది (లాంచ్ చేయలేదు). ఈ ఎలక్ట్రిక్ కారును 49kWh & 61kWh వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొస్తోంది & ARAI-రేటెడ్ రేంజ్ 543 కి.మీ. వరకు ఉంటుంది. ఈ కారు కోసం, మారుతి, సబ్‌స్క్రిప్షన్ & BaaS స్కీమ్‌లను అందించనుంది. 2,000 పాయింట్లకు పైగా ఫాస్ట్-ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఇ విటారా బుకింగ్‌లు త్వరలో ప్రారంభం కానున్నాయి, దీని 2026 ప్రారంభంలో ఈ కారును లాంచ్ చేస్తుంది.
మరో బిగ్ అప్‌డేట్ మారుతి ఇ విటారా భద్రత పరంగా పెద్ద ఘనత సాధించింది. భారత్ ఎన్‌క్యాప్ (Bharat NCAP లేదా B NCAP) తాజాగా ప్రకటించిన క్రాష్ టెస్ట్ ఫలితాల్లో, ఈ ఎలక్ట్రిక్ SUV 5 స్టార్ రేటింగ్ సాధించింది, మారుతి నుంచి ఇప్పటి వరకు వచ్చిన కార్లలో సేఫ్టీ పరంగా అత్యుత్తమ మోడల్‌గా నిలిచింది. డిజైర్, బాలెనో, ఇన్విక్టో తర్వాత భారత్ NCAP పరీక్షల్లో నిలిచిన నాలుగో మారుతి మోడల్ కూడా ఇదే.
పెద్దల భద్రతలో దాదాపు ఫుల్ స్కోర్‌భారత్ NCAP టెస్టింగ్‌లో, ఇ విటారా, అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP) విభాగంలో మొత్తం 32 పాయింట్లకు 31.49 స్కోర్ సాధించింది. ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో డ్రైవర్ తల, మెడ, తొడలు, పాదాలకు ‘గుడ్’ ప్రొటెక్షన్ లభించిందని టెస్టింగ్ సంస్థ వెల్లడించింది. ఛాతి, టిబియాలకు మాత్రం ‘అడిక్వేట్’ ప్రొటెక్షన్ నమోదైంది. అయితే సైడ్ ఇంపాక్ట్ టెస్టుల్లో మాత్రం తల నుంచి పెల్విస్ వరకు ప్రతిభాగానికీ ‘గుడ్’ రేటింగ్ రావడం ఇ విటారాకు పెద్ద ప్లస్‌గా మారింది.
పిల్లల భద్రతలో కూడా టాప్ పెర్ఫార్మెన్స్‌చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (COP) విభాగంలో కూడా ఇ విటారా 49కి 43 పాయింట్లు అందుకుంది. ఇక్కడ డైనమిక్ స్కోర్‌లో ఫుల్ (24/24), CRS ఇన్‌స్టలేషన్ స్కోర్‌లో కూడా ఫుల్ (12/12) వచ్చింది. 18 నెలలు, 3 సంవత్సరాల పిల్లల మోడల్ డమ్మీలను రియర్‌వర్డ్ ఫేసింగ్‌లో ఉంచి టెస్ట్ చేశారు. ఫ్రంట్, సైడ్ క్రాష్ టెస్టుల్లో రెండూ ఫుల్ పాయింట్లు సాధించాయి. వాహనంలో కొన్ని ఫిక్స్‌డ్ పాయింట్లు లేకపోవడం వల్ల వాహన అసెస్‌మెంట్ విభాగంలో 6 పాయింట్లు కోల్పోయింది.
సేఫ్టీ ఫీచర్ల జాబితా కూడా బలంగా ఉంది
ఇ విటారా టాప్ స్పెక్ అయిన "ఆల్ఫా" వెర్షన్‌లో ఈ ఫీచర్లు ఉన్నాయి:
- 7 ఎయిర్‌బ్యాగ్స్
- లెవల్ 2 ADAS
- 360-డిగ్రీ కెమెరా
- ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ + ఆటోహోల్డ్
- టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS)
- ISOFIX చైల్డ్ సీట్ ఆంకరేజ్
మారుతి బ్రాండ్ నుంచి Victoris తర్వాత 'లెవల్ 2 ADAS'తో వచ్చిన రెండో మోడల్ ఇదే కావడం మరో ఆసక్తికరమైన విషయం.
BE 6 తో పోలిక – మారుతిపై స్వల్ప ఆధిక్యంమార్కెట్లో ఇ విటారాకు ప్రధాన ప్రత్యర్థి Mahindra BE 6 కూడా ఇదే ఏడాది భారత్ NCAPలో 5 స్టార్ సాధించింది. అయితే BE 6, ఇ విటారాతో పోలిస్తే AOPలో 0.49 పాయింట్లు, COPలో 2 పాయింట్లు ఎక్కువ తెచ్చుకుంది. అయినప్పటికీ రెండూ భద్రత పరంగా టాప్ SUVలలో ఉంటాయి.
తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్‌ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ SUVలకు డిమాండ్ పెరుగుతున్న ఈ సమయంలో, ఇ విటారా లాంటి సేఫ్టీ-సెంట్రిక్ మోడల్ రావడం పెద్ద ప్లస్. కుటుంబ ప్రయాణాలు, హైవే రైడ్స్, రోజువారీ కమ్యూట్.. ఇలా ఏ అవసరానికైనా ఈ SUV సేఫ్టీ పరంగా మంచి నమ్మకం ఇస్తుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.