Maruti Brezza Facelift Update: మారుతి సుజుకి పేరుతో అత్యంత ప్రజాదరణ పొందిన కంపాక్ట్ SUV బ్రెజ్జా. ఈ కారు ఇప్పుడు తదుపరి పెద్ద అప్‌డేట్‌కు సిద్ధమవుతోంది. ప్రస్తుతం మనం చూస్తున్న జనరేషన్ కారు 2022లో వచ్చింది. ఆ తర్వాత ఇదే మొదటి పెద్ద ఫేస్‌లిఫ్ట్ కావడం విశేషం. ఇప్పటికే రోడ్డుపై టెస్ట్ మ్యూల్స్ కనిపించడంతో, కొత్త బ్రెజ్జా ఎలా ఉండొచ్చు అన్న ఆసక్తి పెరిగిపోయింది. డిజైన్, ఫీచర్లు, ఇంటీరియర్‌లో చిన్నవి, అదే సమయంలో ఉపయోగకరమైన మార్పులు ఉండవచ్చని సమాచారం.
ఎక్స్‌టీరియర్ – చిన్న మార్పులతో ఫ్రెష్ లుక్
రోడ్డుపై కనిపించిన స్పై షాట్స్ ప్రకారం, బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ పూర్తిగా కొత్త డిజైన్‌తో కాకుండా, ఉన్న మోడల్‌ను మరింత ఫ్రెష్‌గా చూపించే సబ్‌టిల్ మార్పులతో వస్తోంది.
కొత్త ఫోర్-స్పోక్ బ్లాక్ ఆలాయ్ వీల్స్ స్విర్ల్ ప్యాటర్న్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.
స్లిమ్ హెడ్‌ల్యాంప్స్, LED లైట్ బార్ ఉన్న కొత్త టెయిల్ ల్యాంప్స్‌కు అవకాశం ఉంది.
బంపర్లు కొంచెం రీషేప్ చేసి ఉండవచ్చు.
అయితే, మొత్తం SUV ప్రొఫైల్ (అప్రైట్ బాడీ స్టాన్స్, కాంపాక్ట్ ప్రపోర్షన్స్) యథాతథంగానే ఉంటాయి. అంటే ఫేస్‌లిఫ్ట్ వచ్చినా, ఇది ప్రస్తుత బ్రెజ్జా లైన్-అప్‌లో పెద్దగా విభిన్నంగా కనిపించదన్నమాట.
ఇంటీరియర్ – చిన్న అప్‌డేట్లు, కొత్త ఫీచర్లు
బ్రెజ్జా ఇంటీరియర్‌లో లేఅవుట్ మారే అవకాశాలు తక్కువ. 9-అంగుళాల & 7-అంగుళాల టచ్‌స్క్రీన్‌లు కొనసాగుతాయి. అయితే కేబిన్‌ను ఫ్రెష్‌గా చూపించేందుకు:
కొత్త అప్హోల్స్టరీ డిజైన్‌లు
కొత్త ఇంటీరియర్ ట్రిమ్స్
కొన్ని కొత్త కన్వీనియన్స్ ఫీచర్లు అందుబాటులోకి రావచ్చు.
అధిక వేరియంట్లలో అదనపు భద్రతా ఫీచర్లు వచ్చే అవకాశమూ ఉంది. కానీ ఇవి ఇంకా కన్ఫర్మ్ కాలేదు.
పవర్‌ట్రెయిన్ – మార్పుల్లేవు
ఇంజిన్ విషయంలో మార్పులు ఉండబోవని దాదాపు ఖాయంగా తెలుస్తోంది. ప్రస్తుత మోడల్‌లాగే:
1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ (NA) పెట్రోల్ ఇంజిన్ (103hp, 137Nm)
5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్
CNG ఆప్షన్ కూడా కొనసాగుతాయి.
కొత్త రైవల్ మోడల్‌లు అధిక ఫీచర్లతో మార్కెట్‌లోకి వస్తుండటంతో, ఈ చిన్న అప్‌డేట్ బ్రెజ్జాను సెగ్మెంట్‌లో కాంపిటీటివ్‌గా నిలబెడుతుందనేది ఆటో ఎక్స్‌పర్ట్‌ల అభిప్రాయం.
లాంచ్ ఎప్పుడు?
ప్రస్తుతం ఈ SUV టెస్టింగ్ దశలో ఉంది. అధికారిక రివీల్ 2026లో జరుగుతుంది. ఆ తర్వాత, లాంచ్ డేట్ దగ్గర పడేకొద్దీ పవర్‌ట్రెయిన్, ఫీచర్లు, వేరియంట్ వివరాలు వెల్లడవుతాయి.
కాంపాక్ట్ సెగ్మెంట్‌లో ఏ కార్లతో పోటీ?
బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ మార్కెట్లోకి వస్తే, ఈ హాట్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో దిగ్గజాలైన Hyundai Venue, Kia Sonet, Tata Nexon, Mahindra XUV 3XO, Kia Syros, Skoda Kylaq, Nissan Magnite, Maruti Fronx, Renault Kiger & Toyota Taisor వంటి మోడల్‌లతో పోటీ పడుతుంది.
మారుతి బ్రెజ్జా ఇప్పటికే ప్రజాదరణ ఉన్న SUV. ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ ద్వారా డిజైన్, ఫీచర్లు, భద్రతా అంశాల్లో... చిన్నవైనా ప్రభావం చూపే అప్‌డేట్లు ఇవ్వవచ్చు. ఇదే జరిగితే, ఈ SUV కాంపాక్ట్ సెగ్మెంట్‌లో మరింత బలంగా నిలవడం ఖాయం.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.