Maruti Brezza Facelift 2026 Price And Features: కాంపాక్ట్ SUV మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో మారుతి సుజుకి బ్రెజ్జా ఒకటి. మిడిల్‌ క్లాస్‌ ప్రజల ఇష్టమైన కార్లలో ఇది ఒకటి. ఇప్పుడు, ఈ SUVకి పెద్ద అప్‌డేట్ ఇవ్వడానికి మారుతి సిద్ధమైంది. 2022లో రెండో తరం బ్రెజ్జాను విడుదల చేసిన మారుతి, ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఈ నెల 24న (జులైన 24, 2026‌) అధికారికంగా ఆవిష్కరించనుంది. ఇప్పటికే రూ.11,000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కొత్త బ్రెజ్జాలో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయో తెలుసుకుందాం.

Continues below advertisement

ఎక్స్‌టీరియర్కొత్త బ్రెజ్జాలో మొదటగా కనిపించే మార్పు ఎక్స్‌టీరియర్ డిజైన్‌లోనే ఉంటుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌లో కొత్త గ్రిల్ డిజైన్‌తో పాటు హెడ్‌ల్యాంప్‌లను కలుపుతూ సన్నని ఎరుపు రంగు స్ట్రిప్ కనిపించింది. ముందు బంపర్ దిగువ భాగంలో కూడా ఎరుపు రంగు ట్రిమ్ ఇవ్వనున్నారు. డోర్ల దిగువ భాగంలో కొత్త క్లాడింగ్ ఉండగా, టెయిల్‌గేట్‌పై ఉండే "Brezza" లోగోకు కొత్త ఫాంట్‌ను ఉపయోగించారు.

అల్లాయ్ వీల్స్‌కు కూడా కొత్త డిజైన్ రానుంది. టెస్టింగ్ సమయంలో కనిపించిన ప్రోటోటైప్‌లను బట్టి 4-స్పోక్‌ల డిజైన్ వచ్చే అవకాశం ఉంది. ఫ్రంట్ బంపర్‌ను పూర్తిగా రీడిజైన్ చేశారు. ఫాగ్ ల్యాంప్‌లను కాస్త ఎత్తులో అమర్చడంతో పాటు సిల్వర్ ట్రిమ్ & సిల్వర్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌ను అందించనున్నారు. అయితే L ఆకారంలోని DRLsతో వచ్చే LED హెడ్‌ల్యాంప్స్ & స్లిమ్ LED టెయిల్ ల్యాంప్స్‌ను యథాతథంగా కొనసాగించనున్నారు.

Continues below advertisement

ఇది కూడా చదవండి: 526km రేంజ్‌, రెండు బ్యాటరీ ఆప్షన్లతో Kia Syros EV - బుకింగ్స్ ప్రారంభం, రేటు ఎంత ఉండొచ్చంటే?

ఇంటీరియర్ క్యాబిన్ లేఅవుట్‌లో పెద్ద మార్పులు ఉండకపోయినా కొత్త కలర్ థీమ్ & ప్రీమియం ట్రిమ్ మెటీరియల్స్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న HUDను కొనసాగించడంతో పాటు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను 9 అంగుళాల నుంచి 10.1 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్‌కు అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉంది. దీంతో వినియోగదారులకు మరింత మెరుగైన డిజిటల్ అనుభవం లభించనుంది.

సౌకర్యాల పరంగా కూడా కొత్త బ్రెజ్జా మరింత ఆకర్షణీయంగా మారనుంది. వెనుక సీట్ల హెడ్‌రెస్ట్‌లకు కొత్త కర్వ్డ్ సైడ్ బోల్స్టరింగ్ ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే పవర్డ్ డ్రైవర్ సీట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, అంబియంట్ లైటింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు జాబితాలో చేరే అవకాశముంది. భద్రత కోసం Level-2 ADAS, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్లు వంటి ఆధునిక ఫీచర్లను కూడా అందించే అవకాశం ఉందని టెస్టింగ్ సమయంలో కనిపించిన వాహనాలను బట్టి తెలుస్తోంది.

టర్బో పెట్రోల్ ఇంజిన్పవర్‌ట్రైన్ పరంగా ఈసారి అత్యంత కీలకమైన మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ విభాగంలో టర్బో పెట్రోల్ ఇంజిన్ లేని ఏకైక SUVగా ఉన్న బ్రెజ్జాకు ఇకపై ఫ్రాంక్స్‌లో ఉన్న 1.0 లీటర్ Boosterjet టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అందించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఇంజిన్‌తో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇదే ఇంజిన్‌కు CNG ఆప్షన్‌ను కూడా మారుతి అందించే అవకాశం ఉందని సమాచారం.

ఇది కూడా చదవండి: 125cc నుండి 350cc వరకు ఏ బైక్ అత్యుత్తమ విలువ కలిగి ఉంటుంది.. లిస్ట్ చూడండి

1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో మరో ప్రయోజనం కూడా ఉంది. ప్రస్తుతం 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌పై వర్తించే 28 శాతం GSTకి బదులుగా, చిన్న ఇంజిన్ కారణంగా 18 శాతం GST పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో కొత్త బ్రెజ్జా ధరను మరింత పోటీ స్థాయిలో నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ధర ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ప్రస్తుతం విక్రయిస్తున్న బ్రెజ్జా ఎక్స్‌షోరూమ్ ధర రూ.8.26 లక్షల నుంచి రూ.12.86 లక్షల మధ్య ఉంది. కొత్త మోడల్‌లో డిజైన్ & ఫీచర్లలో మెరుగుదలలు వచ్చినప్పటికీ చిన్న ఇంజిన్ కారణంగా ధరను ఇదే స్థాయిలో ఉంచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

కొత్త మారుతి బ్రెజ్జా విడుదలైన తర్వాత... హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, స్కోడా కైలాక్, మహీంద్రా XUV 3XO, కియా సోనెట్ & కియా సైరస్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.