భారత్‌లో రోజురోజుకూహ్యాచ్‌బ్యాక్ కార్ల డిమాండ్ పెరుగుతోంది. దాంతో ఆటోమొబైల్ కంపెనీలు హ్యాచ్‌బ్యాక్ కార్లపై ఫోకస్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మారుతి సుజుకి బలెనో, టాటా ఆల్ట్రోజ్ పేర్లు ముందుగా వినిపిస్తున్నాయి. మార్కెట్లో ఈ 2 కార్లు తమ సెగ్మెంట్‌లో ప్రజాదరణ పొందాయి. వినియోగదారులు వీటిని ఇష్టపడి నమ్మకంగా కొంటున్నారు. ఒకవైపు బలెనో అద్భుతమైన మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్, నమ్మకమైన ఇంజిన్‌కు పేరుగాంచింది. మరోవైపు టాటా ఆల్ట్రోజ్ సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో పాటు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్, ప్రీమియం డిజైన్ కారణంగా మార్కెట్లో నిలదొక్కుకుంది.
అయితే రూ. 6 లక్షల ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరతో రెండు కార్ల బేస్ లేదా లోయర్-మిడ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు, మెరుగైన డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్, మీ నగదుకు తగిన విలువ చేసే కారను సెలెక్ట్ చేసుకోవం ముఖ్యం. అందుకోసం మీ అవసరాల ప్రకారం ఏ కారు సెట్ అవుతుందో వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
మైలేజ్‌లో వీటి మధ్య పోటీ
ఇంజిన్, పనితీరు పరంగా మారుతి బలెనో 1.2 లీటర్ K సిరీస్ పెట్రోల్ ఇంజిన్ చాలా రిఫైన్డ్‌గా, స్మూత్ అని భావిస్తారు. ఈ ఇంజిన్ ట్రాఫిక్‌లో డ్రైవ్ చేసేందుకు చాలా సులభం. అలాగే దీని థ్రాటిల్ రెస్పాన్స్ కూడా వేగంగా ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, మైలేజ్ విషయంలో బలెనో పైచేయి సాధిస్తుంది. లీటరుకు 20 నుంచి 22 కిలోమీటర్ల వరకు మైలేజ్ వస్తుంది. మరోవైపు టాటా ఆల్ట్రోజ్‌లో 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ వస్తుంది. ఇది సిటీ డ్రైవింగ్‌కు బాగానే ఉన్నప్పటికీ రిఫైన్మెంట్ విషయంలో బలెనో కంటే కొంచెం వెనుకంజలో ఉంటుంది. ఆల్ట్రోజ్ మైలేజ్ లీటరుకు సుమారు 18 నుంచి 19 కిలోమీటర్ల మధ్య ఇస్తుంది.
Also Read: పాత లుక్ - కొత్త అనుభూతి.. నిజ జీవితంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 440 రైడింగ్ ఎక్స్‌పీరియన్స్
సేఫ్టీలో ఏది బెస్ట్
మీ మొదటి ప్రాధాన్యం సేఫ్టీ అయితే టాటా ఆల్ట్రోజ్ అత్యంత బలమైన పోటీదారు. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో టాటా ఆల్ట్రోజ్‌కు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ఈ బడ్జెట్‌లో అత్యంత సురక్షిత కార్లలో ఒకటిగా చెప్పవచ్చు. దీని బాడీ షెల్, డోర్ స్ట్రాంగ్ నెస్ తాకగానే తెలుస్తుంది.
మారుతి బలెనోలో ఇప్పుడు గతంతో పోలిస్తే మెరుగైన సేఫ్టీ ఫీచర్లుగా 6 ఎయిర్‌బ్యాగ్స్, ABSతో EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అందిస్తున్నారు. బిల్డ్ క్వాలిటీ, క్రాష్ టెస్ట్ రేటింగ్ లో టాటా ఆల్ట్రోజ్ ఇప్పటికీ బలెనో కంటే ముందుంటుంది.
క్యాబిన్, కంఫర్ట్‌లో ఏది ఫస్ట్
కేబిన్ స్పేస్ విషయానికి వస్తే రెండు కార్లూ చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. 5 మంది కూర్చోవడానికి సరిపడే స్పేస్ ఇస్తాయి. మారుతి బలెనోలో చాలా విశాలంగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అలాగే దీని సీట్లు లాంగ్ జర్నీకి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. దీని రియర్ లెగ్‌రూమ్ కూడా అద్భుతంమని చెబుతారు.
టాటా ఆల్ట్రోజ్ ఇంటీరియర్ చాలా ప్రీమియం. అలాగే దీని 90 డిగ్రీల వరకు తెరుచుకునే డోర్లు కారులో ఎక్కడం, దిగడం సులభం చేస్తాయి. ఆల్ట్రోజ్ సీట్లు కొంచెం మెరుగ్గా అనిపిస్తాయి. అలాగే దీని డాష్‌బోర్డ్ లేఅవుట్ చాలా మోడ్రన్. అయితే, మారుతి బలెనో రియర్ సీట్ కంఫర్ట్ కొంచెం మెరుగ్గా అనిపిస్తుంది.
Also Read: క్రెటా కంటే తక్కువ ధరలో కొత్త SUV.. బేయాన్ గురించి కీలక వివరాలు షేర్ చేసిన హ్యుందాయ్
రీసేల్ వాల్యూ దేనికి ఎక్కువ?
భారత్‌లో మారుతి సుజుకి నెట్‌వర్క్ చాలా పెద్దది. దాంతో బలెనో సర్వీసింగ్, స్పేర్ పార్ట్స్ చాలా చౌకగా అందుబాటులో ఉంటాయి. మీరు కారును 4-5 సంవత్సరాలు నడిపి అమ్మాలనుకుంటే, బలెనో రీసేల్ విలువ ఎక్కువ.
టాటా సర్వీస్ గత కొన్ని సంవత్సరాల్లో చాలా మెరుగైంది. మెయింటెనెన్స్ విషయంలో ఇది మారుతి కంటే కొంచెం ఖర్చుతో కూడుకున్నది. ఎక్కువ మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ కావాలంటే బలెనో తీసుకోవాలి. సేఫ్టీకి అధిక ప్రాధాన్యం అయితే ఆల్ట్రోజ్‌ను ఎంచుకోండి.
