Satya Dev's Echological Action Thriller Samavarthi Teaser Review : ఇటీవల రావు బహదూర్‌తో నటుడిగా తనలో మరో కోణాన్ని చూపించారు యంగ్ హీరో సత్య దేవ్. తాజాగా ఆయన హీరోగా రాబోతోన్న ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ సమవర్తి (Samavarthi). ఈ మూవీకి అజయ్ నాగ్ వి దర్శకత్వం వహించగా... తాజాగా రిలీజ్ చేసిన టీజర్ హైప్ క్రియేట్ చేస్తోంది.
టైగర్ వర్సెస్ మహాదేవ్
టీజర్ ఫస్ట్ ఫ్రేమ్‌లోనే అడవి నేపథ్యంతో ప్రారంభమై... థ్రిల్లింగ్, యాక్షన్ మోడ్‌లోకి తీసుకెళ్తుంది. అడవిలో స్మగ్లింగ్, జింకలను వేటాడే పులి కథలా ఈ మూవీ స్టోరీని అందులో రోల్స్ ఇంట్రడ్యూస్ చేశారు మేకర్స్. నేపాల్‌లోని అటవీ ప్రాంతంలో 49 మందిని బలిగొన్న మ్యాన్ ఈటర్ పులి వేటను చూపించారు. అడవిలో వారిని కాపాడే పవర్ ఫుల్ రోల్ మహాదేవ్‌గా సత్యదేవ్ ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపించారు. అసలు, అడవిలో వారిని చంపింది పులేనా? లేదా పులి పేరుతో ఎవరైనా హత్యలు చేస్తున్నారా? వారిని మహాదేవ్ ఎలా మట్టుపెట్టాడు? అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
'అడవిలో పులి 20 ఏళ్లు బలంగా జీవిస్తది. జింక ఎనిమిదేళ్లే.', 'పులికి జింక కనిపిస్తది. కానీ జింకకు పులి కనిపించదు. అడవిలో పులులు తక్కువుంటాయి. జింకలు ఎక్కువుంటాయి.' అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
ఈ మూవీకి అజయ్ నాగ్ వి దర్శకత్వం వహించగా... సత్యదేవ్ సరసన గానవి లక్ష్మణ్ హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే దిలీష్ పోతన్, రాజీవ్ కనకాల, శ్రీకాంత్, రవీంద్ర విజయ్, మోహన్ భగత్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సింజిత్ యర్రమిల్లి మ్యూజిక్ అందించగా... రుద్ర పిక్చర్స్, పంచభూత ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శివచరణ్ రెడ్డి జక్కిడి, శశిధర్ రెడ్డి పటమట నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో త్వరలోనే మూవీ రిలీజ్ కానుంది.
'డోంట్ మిస్... అడ్వెంచర్ ఎక్స్‌పీరియన్స్'
నా మొహమాటాన్ని పక్కన పెట్టి మరీ తనతో సినిమా చేయమని అడిగింది డైరెక్టర్ అజయ్‌నేనని హీరో సత్యదేవ్ తెలిపారు. 'సౌత్ ఇండియాలో ఎన్ని అడవులున్నాయో అన్నింటిలోనూ సమవర్తి షూటింగ్ జరిపాం. ఇది మాకొక గొప్ప అడ్వెంచర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. థియేటర్లలో సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్‌కు కూడా అదే ఎక్స్‌పీరియన్స్ కలుగుతుందని నమ్ముతున్నా.' అని అన్నారు.
