Maruti Baleno vs Tata Altroz: భారత్‌ మార్కెట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగం బాగా ప్రాచుర్యం పొందింది. టాటా మోటార్స్ ఆల్ట్రోజ్, మారుతి సుజుకి బాలెనో ఈ విభాగంలో బాగా డిమాండ్ ఉన్న కార్లు. రెండు కార్లు వాటి డిజైన్, ఫీచర్లు, ధర దృష్ట్యా డిమాండ్ బాగా పెరిగింది. మీరు కొత్త కారు కొనాలనే ఆలోచన చేస్తుంటే, ఈ రెండు కూడా మంచి ఆప్షన్ అవుతాయి. ఈ రెండింటిలో దేనిని ఎంచుకోవాలనుకుంటే, ఇంజిన్, ఫీచర్లు, ధర ఆధారంగా పోలికను తెలుసుకోవడం ముఖ్యం. ఇంజిన్, పనితీరు పరంగా ఏ కారు మెరుగ్గా ఉందో తెలుసుకుందాం.

Continues below advertisement

ఫీచర్స్‌లో ఎవరు ఎవరు ఫస్ట్?

2025లో టాటా ఆల్ట్రోజ్‌ను అప్‌డేట్ చేసింది, అనేక కొత్త ఫీచర్లను జోడించారు. ఇందులో ఇప్పుడు LED DRLలు, హెడ్‌లైట్లు, కనెక్ట్ చేసిన టెయిల్‌లైట్లు, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, 360-డిగ్రీ కెమెరా, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. లోపల, ఇది ట్రై-టోన్ ఇంటీరియర్, D-కట్ స్టీరింగ్ వీల్, క్రూయిజ్ కంట్రోల్, యాంబియంట్ లైట్, రియర్ డీఫాగర్, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లను కలిగి ఉంది. అదనంగా, ఇది పెద్ద 26.03 సెం.మీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెనుక AC వెంట్‌లను కలిగి ఉంది.

మారుతి బాలెనో LED హెడ్‌లైట్లు, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, వెనుక వైపర్, స్పాయిలర్,  స్కిడ్ ప్లేట్ వంటి లక్షణాలతో వస్తుంది. ఇది ఫాబ్రిక్ సీట్లు, టిల్ట్, టెలిస్కోపిక్ స్టీరింగ్, పుష్-బటన్ స్టార్ట్, కీలెస్ ఎంట్రీ, హైట్ అడ్జెస్ట్‌ చేయగల డ్రైవర్ సీటుతో కూడా వస్తుంది. బాలెనోలో 22.86 సెం.మీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హెడ్స్-అప్ డిస్ప్లే,  నాలుగు స్పీకర్లు, రెండు ట్వీటర్‌లతో కూడిన ఆర్కిమిస్ ఆడియో సిస్టమ్ కూడా ఉన్నాయి. ఆల్ట్రోజ్ లక్షణాల పరంగా కొంచెం ఆధునికంగా కనిపిస్తుంది.

Continues below advertisement

ఇంజిన్, పనితీరులో తేడా

టాటా ఆల్ట్రోజ్ పెట్రోల్, డీజిల్, CNG ఇంజన్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. దీని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 88 PS పవర్‌ని, 115 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజన్ 90 PS పవర్‌ని, 200 Nm టార్క్‌ను అందిస్తుంది. CNG మోడల్ 73.5 PS పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్, AMT, DCA ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్‌తో వస్తుంది. మారుతి బాలెనో 66 kW పవర్‌ని, 113 Nm టార్క్‌ను అందించే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో అమర్చి ఉంటుంది. దీని CNG మోడల్ 57 kW శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్, AMT ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో లభిస్తుంది. ఇంజిన్ ఎంపికల పరంగా, ఆల్ట్రోజ్ మరిన్ని ఎంపికలను అందిస్తుంది.

ధరలో ఏది చౌకైనది?

టాటా ఆల్ట్రోజ్ టాప్-స్పెక్ మోడల్ ధర ₹6.30 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై ₹10.51 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. మారుతి బాలెనో ధర ₹5.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై టాప్-స్పెక్ మోడల్ ధర ₹9.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. బాలెనో ధర పరంగా కొంచెం చౌకగా ఉంటుంది.