Modi Israil Tour: ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా జరిగిన అధికారిక కార్యక్రమాల మధ్య ఒక ప్రత్యేక దృశ్యం కనిపించింది. ఇజ్రాయెల్ ప్రధాని Benjamin Netanyahu భారత ప్రధాని Narendra Modi కోసం భారతీయ వేషధారణలో హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.
జెరుసలేమ్‌లో జరిగిన జాయింట్ డిన్నర్‌కు ముందు నేతన్యాహూ నెహ్రూ జాకెట్‌తో పాటు తెల్లటి కుర్తా స్టైల్ షర్ట్ ధరించారు. స్టోన్ కలర్ జాకెట్‌లో నెతన్యాహూ ఓ ఇండియన్‌లానే కనిపించారు. సాధారణంగా సూట్ లేదా వెస్ట్రన్ ఫార్మల్ దుస్తుల్లో కనిపించే ఆయన, ఈసారి భారతీయ శైలిని ఎంచుకోవడం విశేషంగా మారింది. కార్యక్రమానికి ముందు ఆయన ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
“మా జాయింట్ డిన్నర్‌కు ముందు నా స్నేహితుడు ప్రధాని మోదీకి సర్ప్రైజ్ ఇవ్వాలని భారతీయ దుస్తులు ధరించాను” हमारे संयुक्त रात्रिभोज से पहले, मैंने अपने मित्र प्रधानमंत्री मोदी को पारंपरिक भारतीय परिधान पहनकर चौंका दिया। అని నేతన్యాహూ తన X అకౌంట్‌లో హిందీలో పోస్ట్ చేశారు ఈ వీడియో తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. భారత్‌లోనూ, ఇజ్రాయెల్‌లోనూ దీనిపై కామెంట్స్ బాగా వస్తున్నాయి.
తన ఇజ్రాయెలీ స్నేహితుడు ఇచ్చిన సడన్ సర్‌పైజ్‌కు మోదీ కూడా పొంగిపోయారు. "ఈ డ్రెస్ వేసుకున్నారా.. Shandar" అంటూ మోదీ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇద్దరు నేతలు కలిసి ఆత్మీయంగా మాట్లాడుకున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. మోదీ ఎక్కువుగా ఈ టైప్ జాకెట్లు ధరిస్తారు. ఇండియాలో చాలా మంది రాజకీయ నాయకులు వీటిని ధరించినా ఈ వేషధారణను ఇంటర్నేషనల్ స్థాయిలో పాపులర్ చేసింది మోదీనే. పైగా నెతన్యూహూ.. మోదీ ఎప్పుడూ ఎక్కువుగా ధరించే స్టోన్‌కలర్ జాకెట్‌నే వేసుకున్నారు.
ప్రభుత్వ స్థాయిలో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి తోడు, వ్యక్తిగత అనుబంధం కూడా ఈ నాయకుల మధ్య స్పష్టంగా కనిపించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇజ్రాయల్ పార్లమెంట్‌లో ప్రసంగం
ఈ పర్యటనలో ప్రధాన హైలైట్‌గా నిలిచింది మోదీ ప్రసంగం. ఇజ్రాయెల్ పార్లమెంట్ Knesset ను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. భారత ప్రధానిగా ఆ వేదికపై ప్రసంగించిన తొలి నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. రక్షణ, టెక్నాలజీ, వ్యవసాయం, స్టార్టప్ ఎకోసిస్టమ్ వంటి రంగాల్లో రెండు దేశాల మధ్య పెరుగుతున్న సహకారాన్ని ఆయన ప్రస్తావించారు.
భారత్–ఇజ్రాయెల్ సంబంధాలు గత కొన్నేళ్లుగా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. రక్షణ రంగంలో కీలక ఒప్పందాలు, వ్యవసాయ సాంకేతికతలో భాగస్వామ్యం, నీటి నిర్వహణ పద్ధతుల్లో సహకారం వంటి అంశాలు ఈ సంబంధాలను మరింత బలపరిచాయి.
అధికారిక చర్చల మధ్య చోటుచేసుకున్న ఈ చిన్న సంఘటన ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో కూడా ప్రాధాన్యం పొందుతోంది.
