Toyota Glanza | మీరు ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్ళడానికి సౌకర్యవంతమైన, చవకైన, మంచి మైలేజ్ ఇచ్చే కారు కొనాలిని ప్లాన్ చేస్తున్నారా.. అయితే మారుతి బలెనో (Maruti Baleno), టయోటా గ్లాంజా (Toyota Glanza) రూపంలో అత్యంత నమ్మదగిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లు ఉన్నాయి. టయోటా Glanza వాస్తవానికి Baleno నుంచి రీబ్యాడ్జ్ చేయబడిన వెర్షన్ కావడంతో, రెండు కార్లు చాలా వరకు ఒకేలా ఉంటాయి. కానీ కొన్ని చిన్న వ్యత్యాసం, ఫీచర్లు వాటిని భిన్నంగా చేస్తాయి. కార్ల ఫీచర్లు, ధర వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 

Continues below advertisement

Baleno vs Toyota Glanza: ధరలో ఏది బెస్ట్

  • ధర విషయంలోనే అతిపెద్ద వ్యత్యాసం కనిపిస్తుంది. Maruti Baleno ప్రారంభ ధర టయోటా Glanza కంటే దాదాపు ₹40,000 తక్కువగా ఉంటుంది. ఇది బడ్జెట్‌లో కారు కోసం చూస్తున్న వారికి డబ్బు ఆదా చేస్తుంది. Glanza, Toyota బ్యాడ్జ్‌తో వస్తుంది. ఇది దాని ప్రీమియం ఇమేజ్, రీసేల్ విలువను సైతం పెంచుతుంది. మీ బడ్జెట్ పరిమితంగా ఉంటే, Baleno చాలా మీకు బెస్ట్ ఛాయిస్. కానీ బ్రాండ్ వాల్యూ, నాణ్యత మీ ప్రాధాన్యత అయితే, టాయోటా Glanza మీకు మంచి ఎంపిక అవుతుంది.

ఇంజిన్, పనితీరుతో పాటు కార్ల మైలేజ్

  • మారుతి Baleno, టయోటా Glanza రెండూ 1.2-లీటర్ K-Series పెట్రోల్ ఇంజిన్‌తో నడుస్తున్నాయి. ఇది సిటీ డ్రైవింగ్‌కు చాలా మంచి ఆప్షన్. సిటీలో జర్నీకి ఫ్యూయల్ కు న్యాయం జరుగుతుంది. రెండు కార్లు ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్‌తో వస్తాయి. ఇది ట్రాఫిక్ జామ్‌, చిన్న సిటీ లేన్‌లలో నడపటాన్ని తేలిక చేస్తుంది. CNG మోడ్‌లో పవర్ కొద్దిగా తగ్గుతుంది. ఇది 77 bhp వరకు పరిమితం అవుతుంది. కానీ ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్ళడానికి ఈ పనితీరు సరిపోతుంది. మైలేజ్ పరంగా రెండు కార్లు CNG మోడ్‌లో 30.61 km/kg ఇస్తాయి. ఇక పెట్రోల్‌లో దాదాపు 22-23 kmpl సగటును ఇస్తాయి. 50–60 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉన్న వినియోగదారులకు CNG వేరియంట్ చాలా ఉపయోగకరం. 

ఫీచర్లు, టెక్నాలజీతో ఎవరు ముందున్నారు?

  • ఫీచర్ల పరంగా రెండు కార్లు 9 అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ Android Auto/ Apple CarPlay, క్రూయిజ్ కంట్రోల్, ఆటో క్లైమేట్ కంట్రోల్, USB ఛార్జింగ్, కీలెస్‌ ఎంట్రీ తో పాటు LED హెడ్‌లైట్‌ల వంటి ఫీచర్లు కలిగి ఉన్నాయి. Glanza లో Toyota Google/Alexa కనెక్టివిటీ, సెంట్రల్ ఆర్మ్‌రెస్ట్ స్టోరేజ్ సహా ఐడిల్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్ వంటి కొన్ని అదనపు ఫీచర్లు ఉన్నాయి. ఇది కొంచెం మోడ్రన్ అనిపిస్తుంది. 

Continues below advertisement

భద్రత, రైడ్ సౌకర్యం

  • రెండు కార్లు బలెనో, గ్లాంజా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS+EBD, ESP సహా హిల్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లతో వస్తున్నాయి. Baleno Bharat NCAPలో 4 స్టార్ రేటింగ్‌ను పొందింది. అయితే Glanza క్రాష్ టెస్ట్ ఇంకా పూర్తి కాలేదు. అయితే Toyota బిల్డ్ క్వాలిటీని చూస్తే ఇది మంచి ఎంపికగా భావిస్తారు. 

ఏ కారు కొనడం మంచిది?

  • మీరు తక్కువ బడ్జెట్‌లో మంచి మైలేజ్, మెయింటనెన్స్, సర్వీస్ నెట్‌వర్క్‌ కోసం చూస్తే కనుక Maruti Baleno సరైన ఎంపిక. మీరు ప్రీమియం ఎక్స్ పీరియన్స్, మంచి బ్రాండ్ విలువ, అదనపు ఫీచర్లను కోరుకుంటే Toyota Glanza మీకు  విలువైన ఎంపిక అవుతుంది.