Maruti Alto K10 vs Maruti S Presso: మారుతి సుజుకి కార్లలో చాలా తక్కువ బడ్జెట్‌లో కొనగలిగే హ్యాచ్‌బ్యాక్‌లు.. ఆల్టో K10 & ఎస్-ప్రెస్సో. డైలీ డ్రైవింగ్‌కు ఈ రెండు కార్లు సరైనవే. రెండింటి ధరలు కూడా దగ్గరదగ్గరగానే ఉన్నప్పటికీ.. డిజైన్, మైలేజ్, బూట్ స్పేస్, డ్రైవింగ్ పొజిషన్‌లో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి.
ధర ఆల్టో K10 ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.3.70 లక్షల నుంచి రూ.5.45 లక్షల వరకు ఉంటుంది. ఎస్-ప్రెస్సో ధర సుమారు రూ.3.50 లక్షల నుంచి రూ.5.25 లక్షల వరకు ఉంది. అంటే ప్రారంభ ధరలో ఎస్-ప్రెస్సో సుమారు రూ.20,000 వరకు తక్కువగా ఉంటుంది.
ఇంజిన్ రెండు కార్లకు పెద్దగా తేడా లేదు. రెండింటిలోనూ 998 సీసీ, 1.0 లీటర్ K10C, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఆల్టో K10 గరిష్టంగా 68 బీహెచ్‌పీ పవర్ & 91.1 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎస్-ప్రెస్సో 68 బీహెచ్‌పీ పవర్ & 89 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది.
మైలేజ్ ఆల్టో K10కు స్వల్ప ఆధిక్యం ఉంది. పెట్రోల్ వెర్షన్‌లో ఆల్టో K10 24.39 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఎస్-ప్రెస్సో 24.12 కిలోమీటర్ల వరకు ఇస్తుంది. CNG వెర్షన్లలో కూడా ఆల్టో K10 33.85 కిలోమీటర్లు, ఎస్-ప్రెస్సో 32.73 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తాయి.
ఇది కూడా చదవండి: రూ.50,000 డౌన్‌పేమెంట్‌తో Maruti Alto K10 మీ ఇంటికి.. నెలకు ఎంత EMI కట్టాలి?
కొలతలు & డిజైన్ రెండు కార్లు విభిన్నంగా ఉంటాయి. ఆల్టో K10 సాంప్రదాయ చిన్న హ్యాచ్‌బ్యాక్ డిజైన్‌లో ఉంటుంది. ఎస్-ప్రెస్సో మాత్రం ఎత్తైన బాడీతో మైక్రో SUV తరహాలో కనిపిస్తుంది. దీంతో ఎస్-ప్రెస్సోలో డ్రైవర్‌కు కొంత ఎత్తైన డ్రైవింగ్ పొజిషన్ లభిస్తుంది.
బూట్ స్పేస్‌ఈ విషయంలో ఎస్-ప్రెస్సో ముందంజలో ఉంది. ఇందులో 240 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. ఆల్టో K10లో 214 లీటర్ల సామర్థ్యం ఉంది. కుటుంబంతో ప్రయాణించేవాళ్లకు ఎస్-ప్రెస్సో అదనపు స్థలం ఉపయోగపడుతుంది.
ఫీచర్లు రెండు కార్ల టాప్ వేరియంట్లలో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, Apple CarPlay & Android Auto వంటి సదుపాయాలు ఉన్నాయి. భద్రత కోసం డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ABS, EBD, రివర్స్ పార్కింగ్ సెన్సర్లు వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: హ్యుందాయ్ కారు కొనేవాళ్లకు బిగ్ అలర్ట్.. సెప్టెంబర్ నుంచి ధరలు పెంపు - ఏ మోడల్‌పై ఎంత పెరుగుతుంది?
కారు ఎంపిక పూర్తిగా మీ అవసరాలు, అభిరుచిపై ఆధారపడి ఉంటుంది. తక్కువ ధర, మంచి మైలేజ్ & సిటీ డ్రైవింగ్ కోసం చూస్తే ఆల్టో K10 ఆకర్షణీయమైన ఎంపిక. ఎత్తైన డ్రైవింగ్ పొజిషన్, ఎక్కువ బూట్ స్పేస్ & SUV తరహా డిజైన్ కావాలంటే ఎస్-ప్రెస్సోను పరిశీలించవచ్చు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
