Maruti Suzuki Alto K10 Loan and EMI Details: బాగా తక్కువ బడ్జెట్‌లో సొంత కారు కొనాలని చూస్తుంటే మారుతి సుజుకి ఆల్టో K10 మీ ఆలోచనకు సరిపోయే ఆప్షన్ కావచ్చు. ముఖ్యంగా, ఫస్ట్‌టైమ్ కార్ బయ్యర్స్‌, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్ నమ్మకమైన కారుగా గుర్తింపు సంపాదించింది. తక్కువ ధర, మంచి మైలేజ్, సులభమైన నిర్వహణ దీని ప్రధాన బలాలు.

Continues below advertisement

కారు కొనాలంటే పెద్ద మొత్తంలో డబ్బు చేతిలో ఉండాల్సిందేనని చాలామంది అనుకుంటారు. అయితే లోన్ సదుపాయంతో తక్కువ డౌన్‌పేమెంట్‌తోనూ ఆల్టో K10ను మీ సొంతం చేసుకునే అవకాశం ఉంది. రూ.50,000 నుంచి రూ.లక్ష వరకు డౌన్‌పేమెంట్‌తో కారు కొనాలని చూస్తున్నవాళ్లకు ఇది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్‌.

ఆల్టో K10.. పెట్రోల్ & CNG ఆప్షన్లలో లభిస్తుంది. వేరియంట్‌ను బట్టి దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.3.70 లక్షల నుంచి రూ.5.45 లక్షల వరకు ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ తదితర ఖర్చులు కలిపిన తర్వాత ఆన్-రోడ్ ధర మరికాస్త పెరుగుతుంది.

Continues below advertisement

ఆన్‌-రోడ్‌ ధరలుబేస్ STD వేరియంట్ ధర సుమారు రూ.3.70 లక్షలుగా ఉంటుంది. LXi వేరియంట్ ధర దాదాపు రూ.4 లక్షలు. VXi ధర సుమారు రూ.4.50 లక్షలు. VXi Plus & ఆటోమేటిక్ వేరియంట్ల ధరలు సుమారు రూ.5 లక్షల నుంచి రూ.5.45 లక్షల వరకు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆన్-రోడ్ ధరలు సుమారు రూ.4.42 లక్షల నుంచి రూ.6.51 లక్షల వరకు ఉంటాయి.

రూ.50,000 డౌన్‌పేమెంట్‌తో EMI ఆప్షన్స్‌రూ.50,000 డౌన్‌పేమెంట్‌ చెల్లించి, 9.5 శాతం వార్షిక వడ్డీ రేటుతో రుణం తీసుకుంటే, మీరు ఎంచుకునే రుణ కాలపరిమితిని బట్టి EMI మారుతుంది. 36 నెలల (మూడేళ్లు) కాలానికి నెలకు సుమారు రూ.12,400 EMI చెల్లించాలి. 60 నెలల (ఐదేళ్లు) కాలానికి EMI దాదాపు రూ.8,250 అవుతుంది. 84 నెలల (ఏడేళ్లు) కాలాన్ని ఎంచుకుంటే నెలవారీ EMI సుమారు రూ.6,450కు తగ్గుతుంది.

రూ.లక్ష డౌన్‌పేమెంట్‌తో EMI ఆప్షన్స్‌మీరు రూ.లక్ష డౌన్‌పేమెంట్‌ చేసి, 9.5 శాతం వార్షిక వడ్డీ రేటుతో రుణం తీసుకుంటే, నెలవారీ భారం మరింత తగ్గుతుంది. 3 సంవత్సరాల కాలానికి EMI సుమారు రూ.10,800గా ఉండొచ్చు. 5 సంవత్సరాలకు EMI దాదాపు రూ.7,200 చెల్లించాలి. 7 సంవత్సరాల కాలానికి నెలకు సుమారు రూ.5,600 EMI ఉండొచ్చు.

ఆల్టో K10 స్పెసిఫికేషన్స్‌ఆల్టో K10లో 1.0 లీటర్ K10C, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 67 bhp పవర్ & 89 Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లో మాన్యువల్, AMT గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. కంపెనీ క్లెయిమ్ ప్రకారం పెట్రోల్ మోడల్ లీటరుకు 24.39 నుంచి 24.90 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. CNG వెర్షన్ కిలోగ్రాముకు 33.85 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

ఫీచర్ల విషయానికి వస్తే.. 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, Apple CarPlay, Android Auto వంటి సదుపాయాలు ఉన్నాయి. భద్రత కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ABS, EBD, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

మీకు వచ్చే లోన్ మొత్తం, వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు, సిబిల్ స్కోర్ & ఎంచుకునే వేరియంట్‌పై ఆధారపడి మీ EMI మారుతుందని గుర్తుంచుకోండి. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.