Maruti Alto K10 New GST Price: మీరు ఈ దీపావళికి కొత్త కారు, అదీ బాగా చవగ్గా కొనాలని ప్లాన్ చేస్తున్నవాళ్లకు ఈ వార్త ఉపయోగకరంగా ఉంటుంది. ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్‌పై ఏకంగా 1,07,600 రూపాయల వరకు తగ్గింపు లభిస్తోంది. ఈ ఆఫర్ ఈ నెల (అక్టోబర్ 2025) మొత్తం అందుబాటులో ఉంటుంది. ఈ మొత్తం డిస్కౌంట్‌లో, కొత్త జీఎస్‌టీ (GST 2025) స్లాబ్ నుంచి 80,600 రూపాయల పన్ను ప్రయోజనం కూడా కలిసి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో, గతంలో 4,23,000 రూపాయలుగా ఉన్న ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు 3,69,900 రూపాయలకు (Maruti Alto K10 ex-showroom price, Hyderabad Vijayawada) తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో ఆన్-రోడ్ ధరఈ నెలలో మీరు మారుతి సుజుకీ ఆల్టో K10 కారును కొంటే, దాని ఎక్స్-షోరూమ్ ధర రూ. 3,69,900. రిజిస్ట్రేషన్ కోసం దాదాపు రూ. 52,000 చెల్లించాలి. కారు బీమా కోసం దాదాపు రూ. 22,000 కట్టాలి. ఇతర అవసరమైన ఖర్చులు కూడా కలుపుకుంటే, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో ఈ కారును దాదాపు రూ. 4.44 లక్షల ఆన్-రోడ్ ధరకు (Maruti Alto K10 on-road price, Hyderabad Vijayawada) వస్తుంది. అంటే, గతంలో ఆల్టో K10 ఎక్స్-షోరూమ్ ధర (రూ. 4.23 లక్షలు) ఎంత ఉందో, ఇప్పుడు అంతకంటే స్వల్ప పెరుగుదలతో ఆన్-రోడ్ ప్రైస్‌లో వస్తోంది.
మైలేజీమారుతి ఆల్టో K10ను, కొత్త & దృఢమైన హార్టెక్ట్ ప్లాట్‌ఫామ్‌పై ఈ కంపెనీ నిర్మించింది. ఈ కారు K-సిరీస్ 1.0- లీటర్ డ్యూయల్ జెట్ & డ్యూయల్ VVT ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది 66.62 PS పవర్ & 89 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. Maruti Alto K10 ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 24.90 కిలోమీటర్ల మైలేజీని (Maruti Alto K10 Automatic Mileage) అందిస్తుంది, మాన్యువల్ వేరియంట్ లీటరుకు 24.39 కిలోమీటర్ల మైలేజీ (Maruti Alto K10 Manual Mileage) ఇస్తుంది. CNG వేరియంట్ కిలోగ్రాముకు 33.85 కిలోమీటర్ల దూరం (Maruti Alto K10 CNG Mileage) ప్రయాణించగలదు.
6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్న కారుమారుతి ఆల్టో K10 ధరకు తక్కువైనా, మోడ్రన్ ఫీచర్లకు మాత్రం తక్కువ కాదు. కంపెనీ, ఈ కారులో చాలా ఆధునిక ఫీచర్లను చేర్చింది. దీనివల్ల, ఈ చిన్న కారు గతంలో కంటే స్మార్ట్ & సేఫ్టీగా మారింది. ఈ కారు ఇప్పుడు ఆరు ఎయిర్ బ్యాగ్‌లతో ప్రామాణికంగా వస్తుంది, ఇంత తక్కువ ధరలో ఉన్న కారులో ఇది ఒక ముఖ్యమైన మార్పు.
మోడ్రన్ ఫీచర్లుఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇచ్చే 7 -అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఆల్టో K10లో చూడవచ్చు. ఇంకా.. USB , బ్లూటూత్ & AUX వంటి ఇన్‌పుట్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన కొత్త మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్‌ను ఈ కారులో అమర్చారు. దీనివల్ల, డ్రైవ్ చేస్తున్నప్పుడే చేతి వేళ్లతో కారు మొత్తాన్ని నియంత్రించవచ్చు, ఇది డ్రైవింగ్‌ను మరింత సులభంగా చేస్తుంది. ఈ ఫీచర్లు గతంలో S- ప్రెస్సో, సెలెరియో & వ్యాగన్ఆర్ వంటి కార్లలోనే ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆల్టో K10 లో కూడా అందుబాటులోకి వచ్చాయి.
మన మార్కెట్‌లో, మారుతి ఆల్టో K10 - Renault Kwid, S-Presso, Tata Tiago & Celerio వంటి కార్లతో పోటీ పడుతోంది.