Deloitte AI Written Report Found Full of Errors: మనుషుల్ని తప్పించి ఏఐతో పనులు చేయిచుకుంటున్న కంపెనీలకు ఇది షాక్ లాంటి ఘటనే. ప్రపంచ ప్రసిద్ధ కన్సల్టింగ్ ఫర్మ్ డెలాయిట్ ఆస్ట్రేలియా ప్రభుత్వానికి 440,000 డాలర్లు అంటే సుమారు రూ. 3.7 కోట్లు చెల్లించాల్సివస్తోంది. దీనికి కారణం ఆస్ట్రేలియా ప్రభుత్వం ఓ రిపోర్టును డెలాయిట్ నుంచి కోరింది. డెలాయిట్ ఏఐతో మొత్తం తయారు చేసి ఇచ్చింది. కానీ అదంతా తప్పుల తడక.
ఆస్ట్రేలియా ప్రధాని యాంథనీ అల్బానీస్ నేతృత్వంలోని ఫెడరల్ ప్రభుత్వానికి సంబంధించిన ఈ రిపోర్టు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్ GPT-4o ఉపయోగంతో తయారు చేసింది డెలాయిట్. అయితే, దీనిలో ఫేక్ సైటేషన్లు, AI కల్పిత సమాచారం వంటి తప్పులు బయటపడ్డాయి. డెలాయిట్ ఏఐని వాడి ఈ రిపోర్టును తయారు చేశామని చెప్పలేదు. డెలాయిట్ AI వాడకాన్ని దాచుకుని రిపోర్టు సమర్పించినట్లు ఆరోపణలు ఎదుర్కొంది.
డిసెంబర్ 2024లో ఆస్ట్రేలియా ఉపాధి , పని సంబంధాల శాఖ (DEWR) డెలాయిట్ కు ఓ నివేదిక కాంట్రాక్ట్ ఇచ్ిచంది. ఉద్యోగం కోరుకునేవారు 'మ్యూచువల్ అబ్లిగేషన్లు' పాటించకపోతే వెల్ఫేర్ వ్యవస్థలో ఆటోమేటెడ్ పెనాల్టీల సిస్టమ్‌ను సమీక్షించేలా రిపోర్టు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు 'టార్గెటెడ్ కంప్లయన్స్ ఫ్రేమ్‌వర్క్ అస్యూరెన్స్ రివ్యూ' రిపోర్టు జూలై 2025లో ఇచ్చారు. తప్పులు బయటపడటంతో రిస్క్ అసెస్‌మెంట్ ప్రాసెస్‌లో AI ఉపయోగించారని డెలాయిట్ ఒప్పుకుంది.
సిడ్నీ యూనివర్శిటీ వెల్ఫేర్ ఎకడమిక్ క్రిస్ రడ్జ్ ,సహచరులు రిపోర్టు పబ్లిష్ అయిన తర్వాత తప్పులు కనుగొన్నారు. ఆగస్టులో ఆస్ట్రేలియన్ ఫైనాన్షియల్ రివ్యూ (AFR) మొదటిసారిగా ఈ సమస్యను బయటపెట్టింది. 12కి పైగా ఫేక్ రెఫరెన్స్‌లు, సిడ్నీ యూనివర్శిటీ అకడమిక్‌ల పేర్లతో ఫేక్ పేపర్లు సృష్టించారు. ఒక ఫేక్ రెఫరెన్స్ కనుగొన్న తర్వాత మరిన్ని వచ్చాయి. గూగుల్‌లో ఇవి లేవు. తప్పు సైటేషన్లు తొలగించి, కొత్త రెఫరెన్స్ లిస్ట్ జోడించారు. తర్వాత కొత్త ఫేక్ రెఫరెన్స్‌లు కూడా వచ్చాయి, రిపోర్టు మెయిన్ క్లెయిమ్‌లు ఎవిడెన్స్ లేకుండా ఉన్నాయన్న విమర్శలువచ్చాయి.
దీంతో చివరికి డెలాయిట్ కాంట్రాక్ట్ ఎమోంట్ లో కొంత భాగం రిఫండ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ ఘటన AIని ప్రొఫెషనల్ సెట్టింగ్‌లలో ఉపయోగించడంలో రిస్క్‌లను హైలైట్ చేస్తోంది. USలో లాయర్లు చాట్‌జీపీటీతో ఫేక్ కేస్‌లు సైట్ చేసి ఫైన్ చెల్లించారు. CDCలో AI కల్పిత స్టడీలు వచ్చాయి. డెలాయిట్ AIలో బిలియన్లు ఇన్వెస్ట్ చేస్తోంది . కానీ అదంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారుతోంది.