మహీంద్రా ఎక్స్‌యూవీ700 మనదేశంలో మోస్ట్ డిమాండ్ ఉన్న కార్లలో ఒకటి. గత సంవత్సరమే వీటికి సంబంధించిన బుకింగ్స్ మనదేశంలో ప్రారంభం అయ్యాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ700 బుకింగ్స్ మనదేశంలో గతేడాది అక్టోబర్‌లో మొదలయ్యాయి. దీనిపై భారతీయులకు మంచి అంచనాలు ఉన్నాయి. కేవలం దీపావళి నాటికే ఈ కారు కోసం ఏకంగా 70 వేల వరకు ఆర్డర్లు వచ్చాయి.


అయితే ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఉత్పత్తి సమస్యలు ఇంకా ఉన్నాయి. కంపెనీ వీటిని డెలివరీ చేయగలదా? అనే సందేహాలు కూడా తలెత్తాయి. కానీ మహీంద్రా జనవరిలో 14,000 ఎక్స్‌యూవీ700లను డెలివరీ చేసి మాట నిలబెట్టుకుంది.


మహీంద్రా ఎక్స్‌యూవీ బుకింగ్స్‌కు, డెలివరీలకు మధ్యలో తేడా ఎక్కువ ఉన్నా.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్ల కొరత కారణంగా వాహనాల ఉత్పత్తులు ఆలస్యం అవుతున్నాయి. ఈ ఒక్క సమస్యను పక్కన పెడితే కంపెనీ డెలివరీల విషయంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తుందని చెప్పవచ్చు.


ఇప్పుడు మీరు మహీంద్రా ఎక్స్‌యూవీ700ను బుక్ చేసుకుంటే వెయిటింగ్ పీరియడ్ ఆరు నుంచి 10 నెలల వరకు ఉంది. ఇక ఎక్స్‌యూవీ700లో ఏఎక్స్7 వేరియంట్ వెయిటింగ్ పీరియడ్ అయితే ఏకంగా 12 నెలలకు పైగా ఉంది. అంటే వీటిని బుక్ చేసుకోవాలనుకునే వారు ఎదురు చూడటానికి సిద్ధంగా ఉండాలన్న మాట.


మహీంద్రా ఎక్స్‌యూవీ700లో 2.0 లీటర్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్, 2.2 లీటర్ టర్బో చార్జ్‌డ్ డీజిల్ ఇంజిన్ వేరియంట్లు ఉన్నాయి. మాన్యువల్ గేర్ బాక్స్, ఆటోమేటిక్ వేరియంట్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లలో ఈ కారును కొనుగోలు చేయవచ్చు.