Mahindra XUV 3XO Waiting Period: మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ప్రారంభించబడింది. ఈ కారు లాంచ్ కావడంతో ఈ కారు ప్రజల హృదయాలను గెలుచుకుంది. దీని వెనుక అతి పెద్ద కారణం ఈ కారు ధర అని చెప్పవచ్చు. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.49 లక్షలుగా ఉంది. అదే సమయంలో ఈ కారు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 15.49 లక్షల వరకు ఉంటుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో వెయిటింగ్ పీరియడ్ ఎంత?
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో కోసం మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. దీని వెయిటింగ్ పీరియడ్ ఆరు నెలలకు చేరుకుంది. అంటే ఈరోజు ఈ కారును బుక్ చేసుకుంటే ఆరు నెలల తర్వాత ఈ కారు తాళాలు మీకు అందుతాయన్న మాట. ఈ కారు వెయిటింగ్ పీరియడ్ దాని వేరియంట్ ప్రకారం ఎక్కువ లేదా తక్కువ ఉండవచ్చు.
Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే
ఏ వేరియంట్‌లో ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉంది?
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వోలో ఎంఎక్స్1 పెట్రోల్ వేరియంట్ వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువ కాలం ఉంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో తీసుకువచ్చిన ఈ మోడల్‌ను కొనుగోలు చేయాలంటే దాదాపు ఆరు నెలల పాటు వేచి ఉండవలసి ఉంటుంది. మరోవైపు పెట్రోల్ వేరియంట్లు అయిన MX2, MX2 ప్రో, MX3, MX3 ప్రో, AX5 కోసం వెయిటింగ్ పీరియడ్ మూడు నుంచి నాలుగు నెలలకు చేరుకుంది.
ఇది కాకుండా AX5L, AX7, AX7L కోసం వెయిటింగ్ పీరియడ్ రెండు నుంచి మూడు నెలలుగా ఉంది. మరోవైపు మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వోకు సంబంధించిన అన్ని డీజిల్ వేరియంట్ల కోసం వెయిటింగ్ పీరియడ్ ఒక నెల వరకు ఉంది. ఈ మహీంద్రా కారు పెట్రోల్ వేరియంట్‌కు మార్కెట్లో డిమాండ్ బాగా పెరిగింది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ఇంజిన్ ఆప్షన్లు ఇలా...
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో మూడు ఇంజన్ ఆప్షన్లతో మార్కెట్లో ఉంది. ఈ కారులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అందించారు. ఈ ఇంజన్ 82 కేడబ్ల్యూ పవర్, 200 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో ఈ కారులో 1.2 లీటర్ టీజీడీఐ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంది. ఇది 96 కేడబ్ల్యూ పవర్‌ని, 230 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మహీంద్రా కారులో 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ కూడా ఉంది. ఈ డీజిల్ ఇంజన్ 86 కేడబ్ల్యూ పవర్, 300 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
Also Read: రూ.ఆరు లక్షల్లోనే సెవెన్ సీటర్ కారు - పెద్ద ఫ్యామిలీకి బెస్ట్ ఆప్షన్!