Mahindra XUV 3XO EV Launched: భారతీయ ఆటోమొబైల్‌ దిగ్గజం  మహీంద్రా అండ్ మహీంధ్రా ఎలక్ట్రిక్‌ వాహనాల విభాగంలో తన దూకుడు పెంచింది. సామాన్యుడికి సైతం ఎలక్ట్రిక్‌ కారును చేరువ చేయాలనే లక్ష్యంతో తన అత్యంత సరసమైన ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ 3XOను మార్కెట్‌లోకి ప్రవేశ పెట్టింది. గత కొంత కాలంగా వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ కారు, అటు ధరలోనూ, ఇటు అత్యాధునిక ఫీచర్‌లనూ పోటీదారులకు గట్టి సవాల్‌ విసురుతోంది. 

Continues below advertisement

ధర మధ్యతరగతికి చేరువలో 

మహీంద్రా ఎక్స్‌యూవీ 3XOEV ప్రారంభం ధరను 13.89 లక్షలుగా నిర్ణయించారు. ఇది మహీంద్రా నుంచి వచ్చిన అత్యంత చౌకైన ఎలక్ట్రిక్‌ కారుగా రికార్డు సృష్టించింది. ఈ కారు ప్రధానంగా రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. విక్రయాలను సంబంధించి వినియోగదారులకు మరో శుభవార్త ఏంటంటే... ఈ కారు డెలివరీలు ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభంకానున్నాయి. అంటే బుక్స్‌ చేసుకున్న కొద్ది రోజుల్లోనే ఈ ఎలక్ట్రిక్‌ వాహనం మీ ఇంటి ముంగిట ఉండబోతోంది. 

డిజైన‌, ప్లాట్‌ఫామ్‌,

చాలా ఎలక్ట్రిక్‌ కార్లు నేడు సరికొత్త బోర్న్‌ ఎలక్ట్రిక్‌ ఆర్కిటెక్చర్‌పై నిర్మిస్తున్నారు. అయితే మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO EV మాత్రం తన పెట్రోల్ డీజీల్ వెర్షన్‌ ప్లాట్‌ఫామ్‌ ఆధారంగానే రూపొందించారు. దీని వల్ల కారు నిర్మణ వ్యయం తగ్గి, వినియోగదారులకు తక్కువ ధరకే లభిస్తోంది. 

Continues below advertisement

డిజైన్‌పరంగా చూస్తే, ఇది తన ఐసీఈ వెర్షన్‌ను పోలి ఉన్నప్పటికీ, ఎలక్ట్రిక్‌ వాహనమని గుర్తించేందుకు కొన్ని ప్రత్యేక మార్పులు చేశారు. 

గ్రిల్‌ వద్ద కొత్త గోల్డ్‌ ఇన్సర్ట్స్‌ అందించారు. 

  • సరికొత్త 17 అంగులాల అల్లాయ్‌ వీల్స్‌ కారుకు మరింత స్పోర్టీ లుక్‌ను ఇస్తున్నాయి. 
  • ఛార్జింగ్ పోర్ట్ ఎడమ వైపు ఇచ్చారు. కారు వెనుక భాగంలో ఈవీ బ్యాడ్జ్‌ ఉంటుంది. 
  • కారు బయటి భాగం అక్కడక్కడ ఎర్పు రంగు మెరుపులు ఉండటం వల్ల ఇది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. 

పర్ఫార్మెన్స్‌-మైలేజీ

ఈ కారులో 39.4 kWh బ్యాటరీ ప్యాక్, ఒకే మోటార్‌ను అమర్చారు. ఇది 147bhp పవర్‌, 310Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల కారు వేగంగా దూసుకుపోతుంది. 

అయితే రేంజ్ విషయంలో మహీంద్రా కొంత జాగ్రత్తగా వ్యవహరించింది. పూర్తి ఛార్జింగ్‌పై ఈ కారు వాస్తవ ప్రపంచంలో సుమారు 285కిలోమీటర్ల ప్రయాణ దూరాన్ని ఇస్తుందని అంచనా, ఇది తన పోటీదారుల కంటే కొంచెం తక్కువగా అనిపించినప్పటికీ సిటీ డ్రైవింగ్‌, వారాంతపు విహార యాత్రలు ఇది సరిపోతుందని నిపుణులు భావిస్తున్నారు. ఛార్జింగ్ కోసం 7.2kw ఆప్షనల్‌ చార్జర్‌ కూడా అందుబాటులో ఉంది. 

అత్యాధునిక ఫీచర్లు; లగ్జరీ అనుభవం

ధర తక్కువైనప్పటికీ, ఫీచర్ల విషయంలో మహీంద్రా ఎక్కడా తగ్గలేదు. సాధారణంగా ఖరీదైన కార్లలో ఉండే ప్రీమియం ఫీచర్‌లను ఈ కారులో చేర్చారు. 

లెవల్‌ 2 ADAS: భద్రత కోసం అడ్వాన్స్‌డ్‌ డ్రైవింగ్ అసిస్టెన్స్‌ సిస్టమ్‌ 

పనోరమిక్‌ సన్‌ రూఫ్‌: కారు లోపల ప్రయాణించే వారికి విశాలమైన అనుభూతిని ఇస్తుంది. 

360 డిగ్రీ కెమెరా: ఇరుకైనా సందుల్లో, పార్కింగ్‌లో కారును సులభంగా నడపడానికి ఇది దోహదపడుతుంది. 

డాల్బీ అట్మోస్‌ ఆడియో: ఏడు స్పీకర్లతో కూడిన ఆడియో సిస్టమ్‌ మీకు థియేటర్‌ లాంటి అనుభూతిని అందిస్తుంది. 

ఫ్రంట్‌ పార్కింగ్ అసిస్ట్‌: ముందు వైపు కూడా సెన్సార్‌ సదుపాయం ఉంది. 

మార్కెట్‌ పోటీ: నెక్సాన్‌, విండర్స్‌కు గట్టి సవాల్

మహీంద్ర ఎక్స్‌యూవీ 3XO EV నేరుగా టాటా నెక్సాన్ ఈవీ, ఎంజీ విండ్స్‌ వంటి మోడళ్లతో తలపడనుంది. నెక్సాన్‌ ఎప్పటి నుంచో  మార్కెట్ లీడర్‌గా ఉన్నప్పటికీ, మహీంద్రా తన బ్రాండ్ ఇమేజ్, మెరుగైన సేఫ్టీ ఫీచర్లతో పోటీని రసవత్తరంగా మార్చింది. భవిష్యత్‌లో రాబోయే మహీంద్ర BE6 వంటి కార్ల అంతటి ఫ్యూచరిస్టిక్ ఇంటీరియర్స్‌ ఇందులో లేకపోయినప్పటికీ, ధర విలువల పరంగా ఇది వినియోగదారులకు ఉత్తమ ఎంపికకానుంది. 

కొనుగోలు చేయవచ్చా?

మీరు ఒక సురక్షితమైన, ఫీచర్ లోడెడ్‌ తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ కోసం చూస్తుంటే, మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO EV కచ్చితంగా మీ జాబితాలో ఉండాలి. రేంజ్‌ కొంచెం తక్కువగా ఉన్నా సిటీలో తిరిగే వారికి ఇది స్మార్ట్ ఛాయిస్‌ అవుతుంది.