Mahindra XUV 3XO Waiting Period: మహీంద్రా ఇటీవలే తన కొత్త కారు ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వోను లాంచ్ చేసింది. లాంచ్ అయిన వెంటనే ఈ కారు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. మే 15వ తేదీ నుంచి ఈ కారు బుకింగ్స్‌ను కంపెనీ ప్రారంభించింది. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో కేవలం ఒక్క గంటలోనే 50 వేల యూనిట్లకు పైగా బుకింగ్స్‌ను పొందింది.


డెలివరీలు షురూ...
మహీంద్రా ఈ కారును మే 26వ తేదీ నుంచి డెలివరీ చేయడం కూడా ప్రారంభించింది. మొదటి రోజునే కంపెనీ 1500 యూనిట్లకు పైగా మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో యూనిట్లను డెలివరీ చేసింది. మహీంద్రా ఈ కొత్త ఎస్‌యూవీకి సంబంధించి తొమ్మిది కొత్త వేరియంట్‌లను మార్కెట్‌లో విడుదల చేసింది. వీటిలో కంపెనీ కేవలం నాలుగు వేరియంట్ల డెలివరీని ప్రారంభించింది. మిగిలిన ఐదు వేరియంట్ల డెలివరీ కోసం వినియోగదారులు జూన్ వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. 


మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ఏఎక్స్5, ఏఎక్స్5ఎల్, ఎంఎక్స్3, ఎంఎక్స్3 ప్రో వేరియంట్ల డెలివరీని ప్రారంభించబడింది. ఎం1, ఎంఎక్స్2, ఎంఎక్స్2 ప్రో, ఏఎక్స్7, ఏఎక్స్7ఎల్ వేరియంట్ల డెలివరీ మరికొంత కాలంలో ప్రారంభం కానుంది.


ఈ మహీంద్రా కారులో మూడు ఇంజన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు సీఆర్డీఈ 1.5 లీటర్ టర్బో డీజిల్ వేరియంట్‌లో వస్తోంది. అదే సమయంలో 1.2 లీటర్ టీసీఎంపీఎఫ్ఐ ఇంజన్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఈ కారులో 1.2 లీటర్ ఎంస్టాలియన్ టీజీడీఐ ఇంజన్ కూడా అందించారు.


Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?


డెలివరీ పీరియడ్ ఎంత?
ఈ కారు ఐదు యూనిట్లలో మూడిల్లో పెట్రోల్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు మహీంద్రా ధృవీకరించింది. ఈ మహీంద్రా కారు బలమైన పవర్‌ని కూడా ఇస్తుంది. దీనికి ఎక్కువ డిమాండ్ ఉన్నప్పటికీ, వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉండేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని మహీంద్రా తెలిపింది. కంపెనీ 10 వేల యూనిట్లను డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉంది. ఒక నెలలో ఈ కారుకు సంబంధించి ఉత్పత్తి సామర్థ్యం తొమ్మిది వేల యూనిట్లుగా ఉంది.


ధర ఎంతంటే?
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో అనేది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ కారు. ఈ కొత్త మహీంద్రా ఎస్‌యూవీ ఎక్స్ షోరూమ్ ధర రూ.7.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.










Also Read: కొత్త పల్సర్ విడుదల చేసిన బజాజ్ - లేటెస్ట్ ఫీచర్లు, రేటు ఎంతో తెలుసా