Mahindra XEV 9S Safety Rating: మహీంద్రా ఎలక్ట్రిక్ SUV అయిన XEV 9S.. ప్రయాణీకుల భద్రత పరీక్షల్లో సత్తా చాటింది. భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (BNCAP) నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో ఈ కారు పూర్తి 5 స్టార్ రేటింగ్ సాధించింది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP) పరీక్షల్లో 32 పాయింట్లకు 31.15 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (COP) పరీక్షల్లో 49 పాయింట్లకు 45 పాయింట్లు దక్కించుకుంది. ఈ రేటింగ్, స్కోర్లు XEV 9S అన్ని వేరియంట్లకు వర్తిస్తాయి.
ఈ ఫలితాలతో XEV 9S తన ICE మోడల్ XUV 7XOను మాత్రమే కాకుండా, ఏడు సీట్ల SUVల్లో ఇప్పటివరకు బెస్ట్ స్కోర్ సాధించిన Tata Safariని కూడా అధిగమించింది. XUV 7XO.. అడల్ట్ ప్రొటెక్షన్‌లో 30.76, చైల్డ్ ప్రొటెక్షన్‌లో 44.97 పాయింట్లు సాధించింది. టాటా సఫారీకి ఇదే విభాగాల్లో వరుసగా 30.08, 44.54 పాయింట్లు వచ్చాయి. ఈ రెండు మోడళ్లతో పోలిస్తే XEV 9S మెరుగైన స్కోర్లు నమోదు చేసింది.
అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో మంచి ఫలితాలు
ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బ్యారియర్ పరీక్షలో డ్రైవర్ తల, మెడ, ఛాతీ, పొత్తికడుపు భాగం, తొడలు, కాలి ఎముకలు, పాదాలకు మంచి రక్షణ లభించినట్లు BNCAP వెల్లడించింది. కో-డ్రైవర్‌కు కూడా, పరీక్షించిన శరీర భాగాల్లో దాదాపు అన్నింటికీ మంచి రక్షణ లభించింది. అయితే ఛాతీ భాగానికి మాత్రం 'అడిక్వేట్' రేటింగ్ ఇచ్చారు.
సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బ్యారియర్ పరీక్షలోనూ అన్ని శరీర భాగాలకు మంచి రక్షణ లభించింది. సైడ్ పోల్ ఇంపాక్ట్ పరీక్షలో కూడా ఇదే స్థాయి రక్షణను XEV 9S అందించింది.
చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ ఫలితాలు
చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ పరీక్షల్లో XEV 9S మొత్తం 49 పాయింట్లకు 45 పాయింట్లు సాధించింది. డైనమిక్ టెస్ట్‌లో 24కి 24 పాయింట్లు, చైల్డ్ రెస్ట్రెయింట్ సిస్టమ్ (CRS) ఇన్‌స్టాలేషన్ పరీక్షలో 12కి 12 పాయింట్లు దక్కించుకుంది.
అయితే వెహికల్ అసెస్‌మెంట్ విభాగంలో 13 పాయింట్లకు 9 మాత్రమే సాధించింది. దీంతో మొత్తం చైల్డ్ ప్రొటెక్షన్ స్కోర్ 45కి పరిమితమైంది.
ఇది కూడా చదవండి: ఇన్సూరెన్స్ లేకుండా టోల్ గేట్ దాటుతున్నారా? మీ వాహనం వివరాలు ఈజీగా తెలిసిపోతాయి.. రూ.10 వేల వరకు జరిమానా!
18 నెలల చిన్నారిని సూచించే డమ్మీతో నిర్వహించిన ఫ్రంటల్ క్రాష్ పరీక్షలో 8కి 8 పాయింట్లు, సైడ్ క్రాష్ పరీక్షలో 4కి 4 పాయింట్లు వచ్చాయి. మూడేళ్ల చిన్నారిని సూచించే డమ్మీతో నిర్వహించిన ఈ రెండు పరీక్షల్లోనూ XEV 9S పూర్తి పాయింట్లు సాధించింది.
మహీంద్రా XEV 9Sలో సేఫ్టీ ఫీచర్లు
భద్రత పరంగా XEV 9Sలో స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగులు అందిస్తున్నారు. Pack Three, Pack Three Above వేరియంట్లలో ఏడు ఎయిర్‌బ్యాగులు ఉంటాయి. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) కూడా అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా ఉన్నాయి.
టాప్ వేరియంట్లలో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్ల సూట్ అందుబాటులో ఉంది. ఇందులో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ సెంటరింగ్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోనమస్ ఎమర్జెన్సీ స్టీరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
మొత్తంగా చూస్తే.. BNCAP క్రాష్ టెస్టుల్లో 5 స్టార్ రేటింగ్‌తో పాటు, అడల్ట్ & చైల్డ్ ప్రొటెక్షన్ విభాగాల్లోనూ XEV 9S మంచి స్కోర్లు సాధించింది. ముఖ్యంగా ఏడు సీట్ల SUVల విభాగంలో ఇప్పటివరకు పరీక్షించిన మోడళ్లతో పోలిస్తే మెరుగైన ఫలితాన్ని నమోదు చేయడం విశేషం.
ఇది కూడా చదవండి: Second-hand Car: రూ.7 లక్షల నుంచి Kia Sonet facelift.. సెకండ్‌హ్యాండ్‌లో కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి!
మహీంద్రా XEV 9S ఎక్స్‌షోరూమ్ ధరలు రూ.21.40 లక్షల నుంచి రూ.30.90 లక్షల వరకు ఉన్నాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
