Mahindra XEV 9S Variant Guide: భారతదేశపు తొలి ప్యూర్ ఎలక్ట్రిక్ 3-రో SUV అయిన మహీంద్రా XEV 9S అధికారికంగా లాంచ్ అయింది. ఎక్స్-షోరూమ్‌లో ధరలు ₹19.95 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఈ ధర Mahindra BE 6 కన్నా కాస్త ఎక్కువగా, XEV 9e కన్నా కాస్త తక్కువ రేంజ్‌లో ఉండేలా కంపెనీ ప్లాన్ చేసింది.
Mahindra XEV 9S SUVలో మూడు బ్యాటరీ ఆప్షన్లు (59kWh, 70kWh, 79kWh), నాలుగు వేరియంట్లు (Pack One Above, Pack Two Above, Pack Three, Pack Three Above) అందుబాటులో ఉన్నాయి. అయితే అసలు ప్రశ్న - ఏ వేరియంట్ కొనడం లాభం? ఇదే విషయాన్ని ఇప్పుడు తెలుగు పాఠకుల కోసం సింపుల్‌గా, వివరంగా తెలుసుకుందాం.
బ్యాటరీ ఆప్షన్లు - మీకు ఏది సరిపోతుంది?
59kWh బ్యాటరీ - ఎంట్రీ-లెవల్ Pack One Above లో మాత్రమే
సాధారణ సిటీ-రేంజ్, ఫ్యామిలీ యూజ్‌కు సరిపోతుంది.
తక్కువ బడ్జెట్ లో 7-సీటర్ EV కావాలంటే ఇది బెస్ట్.
70kWh బ్యాటరీ - Pack Two Above లో మాత్రమే
600km ARAI రేంజ్ అందించే మధ్యస్థాయి బ్యాటరీ.
రియర్-మౌంటెడ్ మోటార్‌తో మంచి పనితీరు ఇస్తుంది.
హైవే యూజ్ ఎక్కువైతే ఇది క్లియర్ అడ్వాంటేజ్.
79kWh బ్యాటరీ - అన్ని ట్రిమ్‌లకు
అన్ని వేరియంట్లలో దొరికే లార్జెస్ట్ బ్యాటరీ.
లాంగ్-రేంజ్ ట్రావెల్స్, ఫ్యామిలీ టూరింగ్‌కు సూట్ అవుతుంది.
వేరియంట్లు & ఫీచర్లు - దేనిలో ఏం ఉంది?
XEV 9S Pack One Above (₹19.95–₹21.95 లక్షలు)
ఇది బేస్ వేరియంట్ అయినా, ఫీచర్లు మాత్రం చాలా రిచ్‌గా ఉన్నాయి.
హైలైట్స్:
- 6 ఎయిర్‌బ్యాగ్స్
- పెద్ద 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
- 12.3-అంగుళాల సెంట్రల్ టచ్‌స్క్రీన్ + ప్యాసెంజర్ స్క్రీన్
- పనోరమిక్ సన్‌రూఫ్
- డ్రైవ్ మోడ్‌లు, రెజెన్ లెవల్స్, ఫ్రంక్ స్పేస్
- స్మార్ట్ LED లైటింగ్
ఈ ధరకు ఇన్ని ఫీచర్లు ఇవ్వడం చాలా అరుదు. 7-సీటర్ EVని బడ్జెట్‌లో కావాలనుకునే వారికి ఇది స్ట్రాంగ్ వాల్యూ.
XEV 9S Pack Two Above (₹24.45–₹25.45 లక్షలు)
Pack One Above ఫీచర్లకు అదనంగా:
- ADAS
- 360° కెమెరా
- 16-స్పీకర్ Harman Kardon సిస్టమ్
- డ్యూయల్-జోన్ క్లైమేట్
- వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్
- పవర్డ్ డ్రైవర్ సీటు
- లెదరెట్ ఇంటీరియర్
ఈ వేరియంట్ ఫీచర్లు గొప్పవే, కానీ ధర రూ. 4.5 లక్షలకు పైగా ఎక్కువ. వాల్యూ-ఫర్-మనీ పరంగా ఇది కొంచెం స్ట్రెచ్.
XEV 9S Pack Three (₹27.35 లక్షలు)
Pack two Above ఫీచర్లతో పాటు అదనపు ఫీచర్లతో ఈ వేరియంట్‌లో సేఫ్టీ & లగ్జరీ లెవెల్ ఇంకా పెరుగుతుంది.
అదనపు హైలైట్స్:
- 7 ఎయిర్‌బ్యాగ్స్ [నీ (knee) ఎయిర్‌బ్యాగ్ సహా]
- అడ్వాన్స్‌డ్ ADAS (రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, ఆటో స్టీరింగ్ మొదలైనవి)
- సిక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు
- బాస్ మోడ్ సీటు
- వెంటిలేటెడ్ రెండో వరుస సీట్లు
- అంబియెంట్ లైటింగ్
ఈ వేరియంట్ చాలా రిచ్ ఫీచర్లు ఇస్తుంది. ధర పెరిగినా వాల్యూ మాత్రం మంచి స్థాయిలో ఉంటుంది.
XEV 9S Pack Three Above (₹29.45 లక్షలు)
Pack Three ఫీచర్లకు అదనంగా:
- AR హెడ్-అప్ డిస్‌ప్లే
- ఆటో పార్కింగ్ అసిస్ట్
- డ్రైవర్ & ప్యాసెంజర్ డ్రౌసినెస్ మానిటరింగ్
- కార్‌లో వీడియో కాలింగ్
టెక్నాలజీ అదిరిపోతున్నప్పటికీ, వాల్యూ-ఫర్-మనీ పరంగా కొంచెం ఎక్కువ ధర అనిపిస్తుంది.
ఏ వేరియంట్ కొనాలి?
బడ్జెట్‌లో 7-సీటర్ EV కావాలంటే: Pack One Above (59kWh లేదా 79kWh) తీసుకోవచ్చు. ధరకు తగ్గ అత్యధిక ఫీచర్లు ఇవ్వడంలో ఇది క్లియర్ విన్నర్.
ఫీచర్లు + ప్రీమియం అనుభవం కావాలంటే: Pack Three (79kWh). అడ్వాన్స్‌డ్ సేఫ్టీ, లగ్జరీ, సౌలభ్యం అన్నీ కలిసి ధరకు సరిపోయే బలమైన ప్యాకేజింగ్.
టాప్-టెక్ మాత్రమే కావాలంటే: Pack Three Above తీసుకోవచ్చు. కానీ ధర కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.