Mahindra XEV 9e, XEV 9S BaaS Scheam: ఎలక్ట్రిక్‌ కార్లు కొనాలనుకునే వారికి Mahindra గుడ్‌న్యూస్‌ చెప్పింది. తమ ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్లు XEV 9e & XEV 9Sపై 'బ్యాటరీ యాజ్‌ ఏ సర్వీస్‌' (BaaS) సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఈ రెండు కార్ల ప్రారంభ ధరలు ఏకంగా రూ.8 లక్షల వరకు తగ్గాయి. 

Continues below advertisement

BaaS ఎంపికతో Mahindra XEV 9S ప్రారంభ ధర రూ.12.65 లక్షలు & XEV 9e ప్రారంభ ధర రూ.13.90 లక్షలకు తగ్గుతుంది. ఇవి ఎక్స్‌-షోరూమ్‌ ధరలు. BaaS లేకుండా XEV 9S ధర రూ.20.65 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. XEV 9e ధర రూ.21.90 లక్షల నుంచి ఉంటుంది. అంటే BaaS స్కీమ్‌ ద్వారా కొనుగోలు చేస్తే రూ.8 లక్షల వరకు తక్కువ మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. BaaSలో కారు బ్యాటరీ ధరను వాహనం ధరలో కలపరు. బ్యాటరీని ఫైనాన్స్‌లో తీసుకోవాలి, బ్యాటరీ వినియోగానికి కిలోమీటరుకు నిర్ణీత మొత్తం చెల్లించాలి.

Mahindra ప్రకారం, BaaSలో బ్యాటరీ వినియోగానికి కిలోమీటరుకు రూ.3.75 చెల్లించాలి. బ్యాటరీ EMI రూ.6,975 & రోజుకు సగటున 60 కి.మీ. ప్రయాణాన్ని ఆధారంగా తీసుకుని కంపెనీ ఈ లెక్కలు వేసింది. ఈ రూ.3.75లో బ్యాటరీ చార్జింగ్‌ ఖర్చు ఉండదు. అంటే బ్యాటరీ వినియోగానికి చెల్లించే మొత్తానికి అదనంగా, విద్యుత్‌ చార్జింగ్‌ ఖర్చును కూడా వినియోగదారుడే భరించాలి.

Continues below advertisement

ఇది కూడా చదవండి: పెట్రోల్ బాదుడుకి చెక్ చెబుదాం - పాత వాహనాన్ని ఎలక్ట్రిక్ కారుగా మార్చడం ఎలా?

BaaS అంటే ఏమిటి?

BaaSలో ఎలక్ట్రిక్‌ కారు బ్యాటరీ ధరను వాహనం అసలు ధర నుంచి వేరు చేస్తారు. దీంతో కారు కొనుగోలు సమయంలో చెల్లించాల్సిన మొత్తం గణనీయంగా తగ్గుతుంది. బ్యాటరీ కోసం ప్రత్యేకంగా ఫైనాన్సింగ్‌ ఉంటుంది. కారు ఎంత దూరం ప్రయాణిస్తే దానికి అనుగుణంగా బ్యాటరీ వినియోగానికి అద్దె చెల్లించాలి. ఈ విధానంతో.. కారు కొనుగోలు సమయంలో ఒకేసారి భారీ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం తగ్గుతుంది. బ్యాటరీ ఫైనాన్సింగ్‌ కాలవ్యవధి, వడ్డీ రేటు & ఇతర నిబంధనలు ఫైనాన్సర్‌ను బట్టి మారవచ్చు.

Mahindra తన అన్ని Born EV మోడళ్లకు ఇప్పుడు BaaS ఎంపికను అందుబాటులోకి తెచ్చింది. XEV 9e & XEV 9Sతో పాటు BE 6 Sporteqకు కూడా ఈ సదుపాయాన్ని విస్తరించింది. ఇంతకుముందు, BE 6 Sporteqలో 59 kWh బ్యాటరీ ఉన్న Pack One & Pack Two వేరియంట్లకు మాత్రమే BaaS అందుబాటులో ఉండేది. ఇప్పుడు అన్ని వేరియంట్లకు ఈ ఎంపికను అందిస్తోంది. 

ఇది కూడా చదవండి: Yamaha R2లో మూడు వేరియంట్లు - టాప్‌ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లున్నాయి?

భారత్‌లో BaaS విధానాన్ని మొదట JSW MG Motor India తన Windsor ద్వారా తీసుకొచ్చింది. ఆ తర్వాత Tata Motors, Maruti, Toyota, Hyundai & Citroen వంటి కంపెనీలు కూడా ఈ విధానాన్ని అనుసరించాయి. ఇప్పుడు Mahindra కూడా ఈ జాబితాలో చేరింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.