మహీంద్రా తన కొత్త NU IQ మల్టీ ఎనర్జీ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన SUV లను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి నెమ్మదిగా సన్నాహాలు చేస్తోంది. వీటిలో ఒకటి మహీంద్రా విజన్ S. ఈ ఎస్‌యూవీ దాదాపుగా సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఈ మహీంద్రా SUV ఇటీవల రోడ్ టెస్టింగ్ సమయంలో కనిపించింది. విజన్ S స్కార్పియో చిన్న, మరింత మోడ్రన్ లుక్ వెర్షన్‌గా కనిపిస్తుంది. ఇది కనుక మార్కెట్లోకి వస్తే కనుక టాటా సియెర్రా వంటి రాబోయే SUV లతో పోటీ పడవచ్చు.

Continues below advertisement

డిజైన్ బలమైన SUV లుక్‌ చూపిస్తుందిమహీంద్రా విజన్ S బలమైన, బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంది. దీని ముందు భాగం నిటారుగా కనిపిస్తుంది. విజన్ ఎస్ బోనెట్ ఫ్లాట్‌గా ఉంటుంది. మొత్తం లుక్ కఠినమైన SUV లాగా ఉంటుంది. ఇది రౌండ్ హెడ్‌లైట్‌లు, నిలువు గ్రిల్‌ను కలిగి ఉంటుంది. ఇది కస్టమర్లకు క్లాసిక్ SUV అనుభూతిని ఇస్తుంది. థార్ రాక్స్ లాగా, విజన్ ఎస్ LED DRL లను హెడ్‌లైట్‌లలో కలుపుతుందని భావిస్తున్నారు. టెస్ట్ మోడల్ ఫ్రంట్ గ్రిల్ కింద ఒక రాడార్ యూనిట్‌ను కూడా చూపించింది. మహీంద్రా విజన్ ఎస్ ADAS లక్షణాలను కలిగి ఉంటుందని సూచిస్తుంది.

అధిక గ్రౌండ్ క్లియరెన్స్, బలమైన సస్పెన్షన్విజన్ S ఎస్‌యూవీ ముఖ్య లక్షణం దాని అధిక గ్రౌండ్ క్లియరెన్స్. పెద్ద చక్రాలు, మందపాటి టైర్లు, పొడవైన సస్పెన్షన్ సెట్ దీనిని కాస్త గుంతలుగా భూభాగాలకు సిద్ధంగా ఉంచుతాయి. నివేదికల ప్రకారం, ఇది 5-లింక్ వెనుక స్వతంత్ర సస్పెన్షన్‌ను కలిగి ఉండవచ్చని తెలుస్తోంది. సైడ్ వ్యూ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, వెడల్పు ఉన్న వీల్ ఆర్చ్‌లు, స్ట్రెయిట్ రూఫ్‌లైన్‌ను చూపుతోంది. పెద్ద గ్లాస్ ఏరియా క్యాబిన్ లోపల మంచి విజిబిలీటీని అందిస్తుంది.

Continues below advertisement

ఇంటీరియర్, ఫీచర్స్ గ్లింప్స్వెనుకవైపు, మహీంద్రా విజన్ S క్లాసిక్ SUV డిజైన్‌ను ప్రదర్శిస్తుంది. టెయిల్‌గేట్‌పై అమర్చిన స్పేర్ వీల్ దాని ఆఫ్-రోడ్ లుక్‌ను మరింత స్ట్రాంగ్ చేస్తుంది. ప్రాథమికంగా వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం ఇది ప్రీమియం క్యాబిన్‌ను కలిగి ఉంటుంది. SUVలో పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, డాష్‌బోర్డ్‌లో రెండు పెద్ద స్క్రీన్‌లు, కొత్త డ్యూయల్ టోన్ త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉండవచ్చు. క్యాబిన్ మొత్తం సాఫ్ట్ టచ్ మెటీరియల్‌ ఉపయోగించనున్నారు.

ఇంజిన్ ఎంపికలు ఇవే...మహీంద్రా కంపెనీ విజన్ ఎస్ గురించి ఇంకా ఎటువంటి అధికారిక ఇంజిన్ స్పెసిఫికేషన్‌లను వెల్లడించలేదు. కానీ విజన్ S 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుందని మార్కెట్లో భావిస్తున్నారు. భవిష్యత్తులో హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెర్షన్‌లను కూడా ప్రవేశపెట్టవచ్చు. ఒకవేళ మహీంద్రా విజన్ ఎస్ మార్కెట్లోకి వస్తే కనుక, ఈ SUV టాటా సియెర్రాకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.