Mahindra Thar Sales Report: మహీంద్రా థార్ (Mahindra Thar) మనదేశంలో లాంచ్ అయినప్పటి నుంచి భారతీయ కస్టమర్లలో బాగా ప్రాచుర్యం పొందింది. దేశీయ మార్కెట్లో రెండు లక్షల యూనిట్ల సేల్స్ మార్కును దాటిందంటే అది ఎంత ప్రజాదరణ పొందిందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ గణాంకాల్లో తాజాగా లాంచ్ అయిన థార్ రాక్స్ నంబర్లు కూడా ఉన్నాయి.
సియామ్ ఇండస్ట్రీ హోల్‌సేల్ డేటా ప్రకారం 2024 అక్టోబర్ చివరి నాటికి మహీంద్రా థార్, థార్ రాక్స్ మొత్తం అమ్మకాలు 2,07,110 యూనిట్లుగా ఉంది. 2020 అక్టోబర్‌లో మహీంద్రా థార్ మొదటిగా మార్కెట్లో లాంచ్ అయింది. అంటే ఈ కారు లాంచ్ అయి ఇప్పటికి నాలుగు సంవత్సరాలు అయింది. ఇప్పుడు థార్ మొత్తం రెండు లక్షల సేల్స్ మార్కును దాటింది.
ఏ సంవత్సరంలో ఎన్ని విక్రయాలు జరిగాయి?
2021 ఆర్థిక సంవత్సరంలో థార్ మొత్తంగా 14,186 యూనిట్లను విక్రయించింది. 2022 ఆర్థిక సంవత్సరంలో థార్ సేల్స్ 37, 844 యూనిట్లకు చేరింది. ఇది కాకుండా 2023 ఆర్థిక సంవత్సరంలో థార్ సేల్స్ మరింత పెరిగి 47,108 యూనిట్లను చేరాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో మహీంద్రా థార్ 65,246 మంది కస్టమర్లను పొందగా, ఏప్రిల్ నుంచి అక్టోబర్ నెలల్లో, థార్, థార్ రాక్స్ మొత్తంగా 42,726 మంది కొత్త కస్టమర్లను పొందాయి.
Also Read: సేఫ్టీ రేటింగ్‌లో దుమ్ము దులుపుతున్న థార్ రోక్స్ - సెక్యూరిటీ ఫీచర్లు అదుర్స్!
మహీంద్రా థార్ ఇంజిన్ ఎలా ఉంది?
మహీంద్రా థార్ ఇంజిన్ గురించి చెప్పాలంటే ఇది మూడు ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది. ఈ ఎస్‌యూవీ టీజీడీఐతో కూడిన 2.0 లీటర్ ఎంస్టాలియన్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఈ ఇంజన్‌తో మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్లు రెండూ అందుబాటులో ఉన్నాయి. ఈ ఇంజన్ 112 కేడబ్ల్యూ పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 300 ఎన్ఎమ్ టార్క్‌ను, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
మహీంద్రా థార్ 1.5 లీటర్ ఎంహాక్ టర్బో డీజిల్ ఇంజిన్‌ను కూడా పొందుతుంది. ఈ ఇంజన్ 87.2 కేడబ్ల్యూ పవర్, 300 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఎస్‌యూవీ 2.2 లీటర్ ఎంహాక్ టర్బో డీజిల్ ఎంపికతో వస్తుంది. ఇది 97 కేడబ్ల్యూ పవర్‌ని, 300 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
Also Read: సేల్స్‌లో దూసుకుపోతున్న రెనో 7 సీటర్ కారు - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!