Mahindra Thar Roxx Sales in October 2024: థార్ రోక్స్, ఎక్స్‌యూవీ700లతో మహీంద్రా గత నెల అక్టోబర్‌లో రికార్డ్ బ్రేకింగ్ అమ్మకాలను నమోదు చేసింది. ఈ ఏడాది అక్టోబర్‌లో కంపెనీ మొత్తం 96,648 యూనిట్లను విక్రయించింది. ఇది వార్షికంగా 20 శాతం పెరిగింది. ఇది కాకుండా మొత్తం వాణిజ్య వాహనాల విక్రయాలు 28,812 యూనిట్లుగా ఉన్నాయి. ఎక్స్‌పోర్ట్ గణాంకాలను పరిశీలిస్తే ఇందులో 89 శాతం పెరుగుదల కనిపించింది.


కంపెనీ విక్రయాల్లో థార్ రాక్స్‌కు పెద్ద పాత్ర ఉంది. థార్ రాక్స్ సేల్ ప్రారంభం అయిన కేవలం 60 నిమిషాల్లోనే సుమారు 1.76 లక్షల ఆర్డర్లు పొందింది. దీంతో కంపెనీ పెర్ఫార్మెన్స్ చాలా మెరుగైంది. పండుగ సీజన్‌లో మహీంద్రా థార్ రాక్స్ భారీగా అమ్ముడయ్యాయి. ఇది కాకుండా ప్రముఖ ఎస్‌యూవీలు మహీంద్రా స్కార్పియో ఎన్, స్కార్పియో క్లాసిక్, ఎక్స్‌యూవీ700, బొలెరో కూడా మంచి పనితీరును కనబరిచాయి.


మహీంద్రా థార్ రాక్స్ ఇంజిన్ ఇలా...
థార్ రాక్స్ ఒక ఆఫ్ రోడ్ ఎస్‌యూవీ. ఈ వాహనం పెట్రోల్ వేరియంట్ 2 వీల్ డ్రైవ్‌తో మాత్రమే మార్కెట్లోకి వచ్చింది. ఈ ఎస్‌యూవీలో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంది. ఈ ఇంజన్‌ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో 162 హెచ్‌పీ పవర్, 330 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. అదే సమయంలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ వేరియంట్ 177 హెచ్‌పీ పవర్, 380 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు.



Also Read: వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉన్న బెస్ట్ కార్లు - అసలు లేకపోయినా ఆశ్చర్యం అక్కర్లేదు!


మహీంద్రా థార్ రాక్స్ 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌ను కూడా కలిగి ఉంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లలో 152 హెచ్‌పీ పవర్‌ని, 330 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజన్ వేరియంట్‌లలో ఫోర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంది.


థార్ రోక్స్ ధర ఎంత?
మహీంద్రా థార్ రాక్స్ ఏడు కలర్ వేరియంట్లలో మార్కెట్లో లభ్యమవుతోంది. ఈ కారులో 26.03 సెంటీమీటర్ల ట్విన్ డిజిటల్ స్క్రీన్ ఉంది. కారులో పనోరమిక్ స్కైరూఫ్ కూడా అందించారు. ఈ మహీంద్రా ఎస్‌యూవీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 12.99 లక్షల నుంచి మొదలై రూ. 22.49 లక్షల వరకు ఉంటుంది. దీనికి మన మార్కెట్లో డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది.



Also Read: ఆకాశాన్నంటే ధర - అయినా అవుట్ ఆఫ్ స్టాక్ - మార్కెట్లో ఈ కియా కారుకు సూపర్ డిమాండ్‌!