New Mahindra Thar Facelift Vs Old Comparison 2025: భారతీయ మార్కెట్‌లో, ముఖ్యంగా యంగ్‌స్టర్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కొత్త మహీంద్రా థార్‌ 2025 ఫేస్‌లిఫ్ట్‌ ఎట్టకేలకు లాంచ్‌ అయింది. తెలుగు రాష్ట్రాల్లో, ఈ బైకాన్‌ SUV ధరలు రూ. 9.99 లక్షల నుంచి రూ. 16.99 లక్షల వరకు (ఎక్స్‌-షోరూమ్‌) ఉన్నాయి. 2020 నుంచి అమ్మకాల్లో ఉన్న ప్రస్తుత థార్‌ మోడల్‌కు, ఇది ఐదేళ్ల తర్వాత వచ్చిన అప్‌డేట్‌.

Continues below advertisement

మహీంద్రా ఇప్పుడు వేరియంట్ల పేర్లను కూడా కాస్త మార్చింది. AX, LX అనే వేరియంట్లు ఇప్పుడు AXT & LXT పేర్లతో రీప్లేస్‌ చేసింది. ఇంతకుముందు ఉన్న కన్వర్టబుల్‌ టాప్‌ థార్‌ వెర్షన్‌ మాత్రం ఈసారి ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌లో రాలేదు.

ఎక్స్‌టీరియర్‌ డిజైన్‌లో మార్పులు 

Continues below advertisement

ఇప్పటికే ఉన్న బండితో పోలిస్తే, కొత్త మహీంద్రా థార్‌ ఫేస్‌లిఫ్ట్‌ లుక్స్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. కొన్ని చిన్న అప్‌డేట్లు మాత్రం ఆకట్టుకుంటున్నాయి. 

ముందు బాడీ కలర్‌ గ్రిల్‌, డ్యూయల్‌ టోన్‌ బంపర్స్‌, ఫ్యూయల్‌ లిడ్‌ను వెహికల్‌ లోపల నుంచే ఓపెన్‌ అయ్యేలా చేయడం వంటి ఫీచర్లను చేర్చారు.

రియర్‌ వైపర్‌, వాషర్‌, రియర్‌ కెమెరా లాంటి సౌకర్యాలు కొత్తగా లభిస్తున్నాయి. కానీ LED హెడ్‌ల్యాంప్స్‌ మాత్రం ఇంకా మార్చలేదు, పాత హాలోజెన్‌ లైట్స్‌నే కొనసాగించారు.

వీల్‌ డిజైన్‌లోనూ పెద్ద మార్పు లేదు. LXT మోడల్‌లో 16 అంగుళాల స్టీల్‌ వీల్స్‌, AXT మోడల్‌లో 18 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ ఉన్నాయి.

2022లో వచ్చిన అప్‌డేట్‌లో చేర్చిన ట్విన్‌ పీక్స్‌ లోగో ఇప్పుడు కూడా వీల్‌ కాప్స్‌, కీ ఫాబ్‌, ఇంటీరియర్‌లో ఉంటుంది.

ఇంటీరియర్‌ & ఫీచర్ల అప్‌డేట్స్‌

ఇంటీరియర్‌లో మహీంద్రా పూర్తి స్థాయి మార్పులు చేసింది. 

కొత్త 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇప్పుడు అందుబాటులో ఉంది, ఇది పాత 7 అంగుళాల స్క్రీన్‌కంటే పెద్దది. ఇందులో అడ్వెంచర్‌ స్టాట్స్‌ అనే కొత్త ఫీచర్‌ కూడా ఉంది.

కొత్త స్టీరింగ్‌ వీల్‌, ఇండికేటర్‌ & వైపర్‌ స్టాక్స్‌, A-పిల్లర్‌ గ్రాబ్‌ హ్యాండిల్స్‌, డోర్‌పై పవర్‌ విండోస్‌ (డ్రైవర్‌కి వన్‌-టచ్‌ ఫీచర్‌తో), అలాగే రియర్‌ ఏసీ వెంట్స్‌ కూడా జోడించారు.

ఆటోమేటిక్‌ వేరియంట్లలో డెడ్‌ పెడల్‌, ఫ్రంట్‌ స్లైడింగ్‌ ఆర్మ్‌రెస్ట్‌లు కూడా లభిస్తాయి. మొత్తంగా చూస్తే, డ్రైవర్‌ కంఫర్ట్‌ మరింత మెరుగైంది.

ఇంజిన్‌ & గేర్‌బాక్స్‌

ఇంజిన్‌ సెక్షన్‌లో మాత్రం మార్పులు లేవు. పాత 2.0L టర్బో పెట్రోల్‌ (152 hp), 1.5L డీజిల్‌ (119 hp), 2.2L డీజిల్‌ (132 hp) ఇంజిన్‌లు యథాతథంగా కొనసాగుతున్నాయి.

టర్బో పెట్రోల్‌ వేరియంట్‌లో 4WD ఆప్షన్‌ లభిస్తుండగా, 2.2L డీజిల్‌ మోడల్‌లో ఇది స్టాండర్డ్‌గా ఉంటుంది.

కొత్త థార్‌ ఫేస్‌లిఫ్ట్‌లో ఇంజిన్‌ పెద్దగా మారకపోయినా, ఇంటీరియర్‌లో చేసిన మార్పులు ఈ SUV ని మరింత మోడ్రన్‌గా మార్చాయి. రియర్‌ ఏసీ వెంట్స్‌, పెద్ద టచ్‌ స్క్రీన్‌, పవర్‌ విండోస్‌ వంటి ఫీచర్లతో డ్రైవింగ్‌ అనుభవం మరో లెవల్‌లోకి వెళ్లింది. దీంతో, సిటీ డ్రైవింగ్‌కైనా, అడ్వెంచర్‌ ట్రిప్స్‌కైనా థార్‌ ఇప్పుడు మరింత సౌకర్యవంతంగా, ప్రాక్టికల్‌గా మారింది.