Mahindra Thar 3-Door Facelift Features: మహీంద్రా, తన మోస్ట్‌ పాపులర్‌ & పవర్‌ఫుల్‌ SUV థార్ 3-డోర్‌ను కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈసారి దాని ఫీచర్లు & ఇంటీరియర్‌తో మోత మోగిపోనుంది, చాలా మార్పులు జరిగాయి. ఈ కంపెనీ, Thar Roxx 5-door నుంచి చాలా అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లను తీసుకుని వాటిని 3-డోర్ థార్‌లో అమర్చింది. రాక్స్ & థార్ రెండూ వేర్వేరు మోడల్స్‌ అయినప్పటికీ, 5-డోర్ రాక్స్‌ వచ్చిన తర్వాత 3-డోర్ థార్ అమ్మకాలు ప్రభావితమయ్యాయి. దీంతో, 3-డోర్‌ తిరిగి పుంజుకోవడానికి ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కంపెనీ లాంచ్‌ చేయనుంది.  

ఎక్స్‌టీరియర్‌ డిజైన్‌లో మార్పులుఫేస్‌లిఫ్టెడ్ మహీంద్రా థార్ 3-డోర్ బయటి భాగం మునుపటి కంటే మరింత తాజాగా & ఆధునికంగా కనిపిస్తుంది. దీనికి కొత్త బంపర్ డిజైన్, కొత్త గ్రిల్, అప్‌డేట్‌ చేసిన హెడ్‌ల్యాంప్‌లు & కొత్త అల్లాయ్ వీల్స్ బిగిస్తారు. ఈ మార్పులు ఈ SUV ని మరింత స్టైల్‌గా కనిపించేలా చేస్తాయి, అదే సమయంలో దాని ఆఫ్-రోడింగ్ కెపాసిటీ ఏమాత్రం తగ్గదు.     

ఇంటీరియర్ మరింత ప్రీమియంNew Thar 3-Door లోపలి భాగంలోనూ అతి పెద్ద మార్పులు కనిపిస్తాయి. దీనికి రాక్స్ లాగా కొత్త స్టీరింగ్ వీల్ & సెంటర్ కన్సోల్ ఇవ్వవచ్చు. పవర్ విండో స్విచ్‌లు ఇప్పుడు తలుపులపై ఉంటాయి & ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ పరిమాణం కూడా మునుపటి కంటే పెద్దదిగా ఉంటుంది. ఇంకా, అనేక కొత్త కంఫర్ట్ ఫీచర్లు & టెక్నాలజీని ఇందులో చేరుస్తారు. ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్ మునుపటి కంటే ఎక్కువ సౌకర్యవంతమైన సీట్లు & ప్రాక్టికల్‌ ఫీచర్లను కలిగి ఉంటుంది, తద్వారా ఇది ఆఫ్-రోడింగ్‌కు మాత్రమే కాకుండా రోజువారీ ఉపయోగం కోసం కూడా మరింత ఆకర్షణీయంగా మారుతుంది.       

ఇంజిన్ & పనితీరుమహీంద్రా థార్ 3-డోర్ ఫేస్‌లిఫ్ట్‌లో, ఇంజిన్ లైనప్‌లో ఎటువంటి మార్పు ఉండదు. ఇది మునుపటి లాగే 1.5-లీటర్ డీజిల్ (RWD మోడల్), 2.0-లీటర్ పెట్రోల్ & 2.2-లీటర్ డీజిల్ ఇంజన్‌లతో పని చేస్తుంది. ఈ SUV కొనేవాళ్లకు మాన్యువల్ & ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు రెండూ అందుబాటులో ఉంటాయి. 4x4 వేరియంట్లు కూడా కొనసాగుతాయి, ఇది ఆఫ్-రోడింగ్ సాహసికులకు ప్రత్యేకం.        

ధర వివరాలుఫేస్‌లిఫ్టెడ్ థార్ 3-డోర్ ధర ప్రస్తుత మోడల్ కంటే కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. అయితే, 5-డోర్ థార్ రాక్స్ & స్టాండర్డ్ 3-డోర్ థార్ మధ్య సమతౌల్యాన్ని కొనసాగిస్తూ కంపెనీ దీనిని పరిచయం చేస్తుంది. ప్రస్తుతం, ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణ రాష్ట్రాల్లో 3-డోర్ థార్ ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 11.50 లక్షల (Mahindra Thar 3-Door price, Hyderabad Vijayawada) నుంచి ప్రారంభం అవుతుంది. 5-డోర్ థార్ రాక్స్ ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 12.99 లక్షల (Thar Roxx 5-door price, Hyderabad Vijayawada) నుంచి ప్రారంభం అవుతుంది.