Mahindra Thar Roxx | 9S అనేది కొత్త మహీంద్రా కంపెనీ తీసుకొచ్చిన కొత్త SUV. మహీంద్రా కంపెనీ రెగ్యూలర్ కార్లతో పాటు ఎస్‌యూవీలు, ఇతర లగ్జరీ కార్లపై సైతం ఫోకస్ చేసింది. తమ కస్టమర్ల కోసం అన్ని రకాల కేటగిరీలలో బెస్ట్ కార్లను అందించడానికి నిరంతరం చర్యలు తీసుకుంటుంది. మహీంద్రాలో థార్ రాక్స్, ఎక్స్‌ఈవీ 9ఎస్, స్కార్పియో ఎన్ లాంటి ఎస్‌యూవీ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే మీ డబ్బు విలువ, సామర్థ్యం, పనితీరు పరంగా ఏది బెస్ట్ అనిపిస్తుందో ఈ వివరాలు చూసి మీరే డిసైడ్ అవ్వండి.
మహీంద్రా థార్ రాక్స్ కంపెనీ నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన ఉత్పత్తులలో ఒకటిగా ఉంది. డీజిల్ వెర్షన్ కోసం 4x4తో మార్కెట్లోకి వస్తుంది. థార్ రాక్స్ 5-డోర్ వెర్షన్, 3 డోర్ కంటే మరింత సౌకర్యవంతంగా ఉంటుందని చెబుతున్నారు. ఇది ఒక సమర్థవంతమైన SUV, కానీ రాక్స్ మరిన్ని ఫీచర్లతో విక్రయాలలో దూసుకెళ్తోంది. ఇది కాంపాక్ట్ SUVకి ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయంగా మారుతోంది.
మహీంద్రా స్కార్పియో N ఒక భారీ విజయం సాధించిన SUV అని చెప్పవచ్చు. కంపెనీ నుంచి మాత్రమే కాకుండా, ఓవరాల్ గా చూసినా ఎస్‌యూవీ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న వాటిలో ఒకటిగా నిలుస్తోంది. స్కార్పియో N పెట్రోల్, డీజిల్ వేరియంట్ ఎంపికలను కలిగి ఉంది. దృఢత్వంతో పాటు కస్టమర్లకు సౌకర్యవంతమైన ప్రయాణాలకు ఇది పెట్టింది పేరు. కొత్త స్కార్పియో N అనేది రోడ్డు మీద, ఆఫ్ రోడ్‌లో కూడా సమర్థవంతమైన SUVగా చెప్పవచ్చు.
మహీంద్రా XEV 9S అనేది కొత్త మహీంద్రా SUVలలో ఒకటి. ఇది ఎలక్ట్రిక్ రేంజ్‌లోకి వస్తుంది. కానీ ధర కొంచెం ఎక్కువగా ఉందని కస్టమర్లు భావిస్తున్నారు. ఎక్స్‌ఈవీ 7 సీట్లతో కుటుంబం మొత్తం కలిసి జర్నీ చేసేందుకు మంచి చాయిస్. రెండవ వరుసలోని ప్రయాణీకుల కోసం మరిన్ని ఫీచర్లను తీసుకొచ్చింది. ఇందులో రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలు ఉన్నాయి. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 500 కి.మీ. వరకు ప్రయాణం చేయవచ్చు అని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.