Mahindra SUV 2026 Launches: గత ఏడాదిన్నర కాలంలో Mahindra తన పోర్ట్‌ఫోలియోను బాగా విస్తరించింది. పూర్తిగా ఎలక్ట్రిక్ మోడళ్లైన XEV 9e, BE 6, XEV 9S, అలాగే Thar ఫేస్‌లిఫ్ట్, Thar Roxx లాంటి మోడళ్లతో మార్కెట్‌లో దూకుడు చూపించింది. అయితే 2026లో మాత్రం Mahindra నుంచి కొత్త పేరుతో ఒక్క కారు కూడా రావడం లేదు. అయినప్పటికీ, ఆ కంపెనీ తన రెండు అత్యంత ప్రజాదరణ పొందిన SUVలకు ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్స్ ఇవ్వనుంది.
2026లో Mahindra లాంచ్ చేయబోయే SUVలు – XUV 7XO (XUV700 కు ఫేస్‌లిఫ్ట్) & Scorpio-N ఫేస్‌లిఫ్ట్.
Mahindra XUV 7XO
లాంచ్ సమయం: జనవరి 2026 (అంచనా)ధర: ₹14 లక్షల నుంచి ₹24 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్, అంచనా)
నాలుగు సంవత్సరాలుగా మార్కెట్‌లో ఉన్న Mahindra XUV700, ఇప్పుడు మిడ్-లైఫ్ సైకిల్ అప్‌డేట్‌కు సిద్ధమవుతోంది. ఫేస్‌లిఫ్ట్ తర్వాత దీనికి XUV 7XO అనే కొత్త పేరు ఇవ్వనున్నారు. ఇప్పటికే రోడ్డుపై తిరుగుతున్న ఈ టెస్టింగ్ వెహికల్స్ ద్వారా కొన్ని కీలక మార్పులు బయటపడ్డాయి.
బయటి డిజైన్‌లో పెద్ద మార్పులు రాకపోయినా, ఫ్రంట్ లుక్ మరింత షార్ప్‌గా కనిపించనుంది. కొత్త గ్రిల్, పెద్ద ఎయిర్ ఇన్‌టేక్స్, ట్విన్-పాడ్ హెడ్‌ల్యాంప్స్ ఈ మార్పుల్లో ప్రధానమైనవి. ఇప్పటికే గుర్తింపుగా మారిన C-షేప్ DRLs కొనసాగుతూనే, మరింత ఆధునికంగా ఉండే అవకాశం ఉంది. అదనంగా, కనెక్టెడ్ లైట్ బార్ కూడా రావొచ్చని సమాచారం.
వెనుక భాగంలో కూడా కొత్త డిజైన్ లాంగ్వేజ్‌కు అనుగుణంగా టెయిల్ ల్యాంప్స్, బంపర్లు మారనున్నాయి. కొత్త ఏరో ఆప్టిమైజ్డ్ వీల్స్ కూడా చూడొచ్చు.
ఇంటీరియర్‌లో అయితే మార్పులు మరింత స్పష్టంగా ఉంటాయి. Mahindra ఎలక్ట్రిక్ SUVల నుంచి ప్రేరణ పొందిన ట్రిపుల్ స్క్రీన్ సెటప్ ఈ SUVలో ప్రధాన ఆకర్షణగా మారనుంది. సీటింగ్ పరంగా ఇప్పటిలాగే 6 సీటర్, 7 సీటర్ ఆప్షన్లు కొనసాగుతాయి.
ఇంజిన్ విషయంలో పెద్ద మార్పులు ఉండే సూచనలు లేవు. ప్రస్తుతం ఉన్న 2.0 లీటర్ పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్లు అలాగే కొనసాగనున్నాయి.
Mahindra Scorpio-N Facelift
లాంచ్ సమయం: 2026 తొలి త్రైమాసికంధర: ₹14 లక్షల నుంచి ₹26 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్, అంచనా)
Mahindraకి అసలైన బ్రాండ్ ఐడెంటిటీ ఇచ్చిన SUVల్లో Scorpio-N ఒకటి. 2026లో దీనికి కూడా ఒక లైట్ ఫేస్‌లిఫ్ట్ రానుంది. స్పై ఫొటోల ప్రకారం, డిజైన్‌లో పెద్ద మార్పులు లేకుండా... లైటింగ్ ఎలిమెంట్స్, ట్రిమ్ భాగాలు, వీల్ డిజైన్‌లో స్వల్ప అప్‌డేట్స్ కనిపిస్తాయి.
లోపల మాత్రం కొంత కొత్తదనం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా Thar Roxx నుంచి వచ్చిన 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ Scorpio-N ఫేస్‌లిఫ్ట్‌లో ఇవ్వొచ్చని సమాచారం. అదనంగా, కొంతమంది యూజర్లు కోరుతున్న అధిక కంఫర్ట్ ఫీచర్లు కూడా జోడించే అవకాశం ఉంది.
ఇంజిన్ విషయంలో మాత్రం Mahindra మార్పులు చేయడం లేదు. 2.0 లీటర్ పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్లు కొనసాగుతాయి. డీజిల్ వేరియంట్‌లో 4x4 ఆప్షన్ కూడా యథావిధిగా అందుబాటులో ఉంటుంది.
ముగింపు
2026లో Mahindra నుంచి కొత్త పేర్లు రాకపోయినా, XUV 7XO, Scorpio-N ఫేస్‌లిఫ్ట్‌లు బ్రాండ్‌కు కీలకమైన అప్‌డేట్స్ అవుతాయి. కొత్త డిజైన్ టచ్‌లు, మెరుగైన టెక్నాలజీ, ఇప్పటికే నమ్మకమైన ఇంజిన్లతో ఈ రెండు SUVలు మార్కెట్‌లో Mahindra స్థానాన్ని మరింత బలపరిచే అవకాశముంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.