మహీంద్రా ఎట్టకేలకు మోస్ట్ అవైటెడ్ స్కార్పియో-ఎన్‌ను లాంచ్ చేసింది. జెడ్2, జెడ్4, జెడ్6, జెడ్8, జెడ్8ఎల్ ట్రిమ్స్‌లో ఈ కొత్త స్కార్పియో లాంచ్ అయింది. దీని ముందు వెర్షన్‌కు స్కార్పియో క్లాసిక్ అని పేరు మార్చారు. వాటితో పాటే వీటిని కూడా విక్రయించనున్నారు.


మహీంద్రా స్కార్పియో-ఎన్ ధర
ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ మోడళ్లలో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మోడళ్ల ధరలను మాత్రమే మహీంద్రా వెల్లడించింది. ఈ కొత్త స్కార్పియో-ఎన్ ధర రూ.11.99 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఇది జెడ్2 బేస్ మోడల్ మాన్యువల్ వేరియంట్ ధర. ఇందులో డీజిల్ వేరియంట్ ధర రూ.12.49 లక్షలుగా ఉంది. జెడ్4లో మాన్యువల్ వేరియంట్ ధర రూ.13.49 లక్షలు కాగా, డీజిల్ ఎంటీ వేరియంట్ ధర రూ.13.99 లక్షలుగా నిర్ణయించారు. 


జెడ్8లో ఎంటీ ఆప్షన్ ధర రూ.16.99 లక్షలు కాగా, డీజిల్ ఎంటీ ఆప్షన్ ధర రూ.17.49 లక్షలుగా ఉంది. జెడ్8ఎల్ పెట్రోల్ ఎంటీ వేరియంట్ ధర రూ.18.99 లక్షలు కాగా... డీజిల్ వేరియంట్ ధర రూ.19.49 లక్షలుగా నిర్ణయించారు.


బాడీ, డిజైన్, సస్పెన్షన్
ఇందులో మూడో తరం లైటర్ బాడీ ఆన్ ఫ్రేమ్ చాసిస్‌ను అందించారు. దీని ముందువైపు సిక్స్ స్లాట్ గ్రిల్ డిజైన్‌ను ఉంది. ఎక్స్‌యూవీ700 తరహాలో ట్విన్ పీక్ లోగో డిజైన్ కూడా చూడవచ్చు. ముందువైపు ప్రత్యేకమైన డీఆర్ఎల్ స్లాట్లు కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్‌లో ఉన్నాయి. దీని షాక్ అబ్జార్బర్లలో ఎంటీవీ సీఎల్ టెక్నాలజీని అందించారు. ఈ విభాగంలో ఈ టెక్నాలజీని అందించడం ఇదే మొదటిసారి. దీని ద్వారా మీ రైడ్ మరింత కంఫర్టబుల్‌గా ఉండనుంది.


ఇంటీరియర్, సేఫ్టీ
ఈ కొత్త స్కార్పియోలో పూర్తిగా కొత్త క్యాబిన్ లేఅవుట్‌ను అందించారు. ఇందులో కొత్త డ్యూయల్ టోన్ ఇంటీరియర్‌ను అందించారు. మధ్యలో కొత్త 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టంను అందించారు. మహీంద్రా అడ్రెనాక్స్ టెక్నాలజీని ఇది సపోర్ట్ చేయనుంది. ఆరు ఎయిర్ బ్యాగ్స్‌ను ఇందులో అందించారు.


ఏడు అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 8 అంగుళాల ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం, రెండో వరుసలో కెప్టెన్ సీట్లు, రిమోట్ ఇంజిన్ స్టార్ట్, అడ్రెనాక్స్ ద్వారా టెంపరేచర్ కంట్రోల్, 6-వే పవర్ అడ్జస్టబుల్ సీట్లు, సింగిల్ టచ్ టంబుల్ సెకండ్ రో సీట్లు, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, సన్‌రూఫ్, 12 స్పీకర్ల సోనీ 3డీ సరౌండ్ సౌండ్ సిస్టం, అలెక్సా సపోర్ట్ కూడా ఈ కారులో మహీంద్రా అందించింది.


ఇక సేఫ్టీ విషయానికి వస్తే... ఇందులో ఆల్ వీల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం ఉంది. ఆరు ఎయిర్ బ్యాగ్స్, డ్రైవర్ డ్రౌజీనెస్ డిటెక్షన్, అడ్వాన్స్‌డ్ సీట్ రిస్ట్రెయింట్ సిస్టం, కొలాప్సబుల్ స్టీరింగ్ సిస్టం, అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రిక్ స్టెబిలిటీ  కంట్రోల్ ఫీచర్లను అందించారు.


ఇంజిన్
కొత్త స్కార్పియో-ఎన్‌లో ఎంస్టాలియన్ పెట్రోల్ ఇంజిన్, ఎంహాక్ డీజిల్ ఇంజిన్లను అందించారు. 197 హెచ్‌పీ, 380 ఎన్ఎం పీక్ టార్క్‌ను పెట్రోల్ ఇంజిన్, 175 హెచ్‌పీ, 400 ఎన్ఎం పీక్ టార్క్‌ను డీజిల్ ఇంజిన్ అందించనున్నాయి. టార్మాక్, స్నో, మడ్, డిజర్ట్ మోడ్స్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.


దీనికి సంబంధించిన బుకింగ్స్ జులై 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ముందుగా బుక్ చేసుకున్న వారికి ముందుగా డెలివరీ చేయనున్నారు. హ్యుండాయ్ అల్కజార్, టాటా సఫారీలతో ఇది పోటీ పడనుంది.


Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?