Mahindra Scorpio N facelift Price And Features Telugu: మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన SUVలలో ఒకటైన మహీంద్రా స్కార్పియో N.. ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌గా మార్కెట్లోకి వచ్చింది. మహీంద్రా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌ ప్రారంభ ధరను రూ.13.69 లక్షలుగా (ఎక్స్ షోరూమ్) నిర్ణయించారు. అత్యాధునిక సాంకేతికత, కొత్త సౌకర్యాలు & ప్రీమియం ఫీచర్లతో కంపెనీ ఈ మోడల్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. అయితే ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు, ఫీచర్లు & డిజైన్ అప్‌డేట్‌లపైనే దృష్టి పెట్టింది.

Continues below advertisement

ఇంటీరియర్‌కొత్త స్కార్పియో Nలో అతిపెద్ద ఆకర్షణ 12.3 అంగుళాల ఫ్రీ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. గతంలో ఉన్న 8 అంగుళాల యూనిట్ స్థానంలో దీన్ని అమర్చారు. అలాగే, 10.25 అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా జోడించారు. దీంతో డ్రైవింగ్ సమయంలో వాహనానికి సంబంధించిన సమాచారం మరింత స్పష్టంగా కనిపిస్తుంది.

తొలిసారిగా, పానోరమిక్ సన్‌రూఫ్‌ను కూడా స్కార్పియో Nలో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు.. 540 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్, కొత్త సెంటర్ కన్సోల్ స్విచ్‌లు & అడ్వెంచర్ స్టాటిస్టిక్స్ ఫీచర్‌ కూడా యాడ్‌ అయ్యాయి. ఇందులో ఇంజిన్ పనితీరు, రోల్‌, పిచ్‌, కంపాస్‌, ఆల్టీమీటర్‌, G ఫోర్స్ వంటి వివరాలను డ్రైవర్ ప్రత్యక్షంగా చూడవచ్చు.

Continues below advertisement

ఫీచర్లుముందు వరుస ప్రయాణికుల కోసం 65W USB Type C ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్‌ను కంపెనీ అందించింది. వైర్‌లెస్ Android Auto, Apple CarPlay, Adrenox కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, Alexa బిల్ట్ ఇన్‌, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్‌, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్‌, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీట్‌, 12 స్పీకర్ల Sony ఆడియో సిస్టమ్‌, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్లు కొనసాగుతున్నాయి. ఈ SUVను 6 సీటర్ & 7 సీటర్ లేఅవుట్‌లలో కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: రేస్‌ బైక్‌ తరహాలో Yamaha R15 V4, MT-15 MotoGP ఎడిషన్లు లాంచ్‌ - FZ-S సిరీస్‌కు కొత్త రంగులు

సేఫ్టీభద్రత పరంగా కూడా మహీంద్రా ఎలాంటి రాజీ పడలేదు. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్‌, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్‌, హిల్ హోల్డ్‌, హిల్ డిసెంట్ కంట్రోల్‌, నాలుగు చక్రాల డిస్క్ బ్రేక్‌లు, డ్రైవర్ డ్రౌజినెస్ డిటెక్షన్‌, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్లు అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. టాప్ ఎండ్ Z8L వేరియంట్‌లో Level 2 ADAS కూడా ఉంది. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్‌, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్‌, లేన్ కీప్ అసిస్ట్‌, లేన్ డిపార్చర్ వార్నింగ్‌, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్‌, స్మార్ట్ పైలట్ అసిస్ట్‌, హై బీమ్ అసిస్ట్ వంటి ఆధునిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

ఎక్స్‌టీరియర్‌బయటి డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. స్కార్పియో Nకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన బాక్సీ స్టైల్‌ను అలాగే కొనసాగించింది. క్రోమ్ ఆరు స్లాట్ గ్రిల్‌, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌, C ఆకారంలోని LED DRLs, నిలువుగా ఉన్న LED టెయిల్ ల్యాంప్స్‌, సిల్వర్ స్కిడ్ ప్లేట్‌, రూఫ్ రైల్స్‌, సైడ్ స్టెప్స్‌, ఎత్తైన బాడీ డిజైన్ యథాతథంగా ఉన్నాయి. అయితే, టాప్‌ వేరియంట్లలో కొత్త 18 అంగుళాల డ్యూయల్ టోన్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌ను అందించారు. ఎవెరెస్ట్ వైట్‌, గెలాక్సీ గ్రే, ఓషియానిక్‌, స్టెల్త్ బ్లాక్‌, డీప్ ఫారెస్ట్ అనే ఐదు రంగుల్లో ఈ SUV అందుబాటులో ఉంటుంది.

ఇది కూడా చదవండి: TVS స్కూటర్ల ధరలు పెంపు.. పాపులర్‌ మోడళ్ల రేట్లు ఏకంగా రూ.11,000 వరకు హైక్‌, ఇదిగో లిస్ట్‌

ఇంజిన్ ఈ కారులోని 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 203 hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్ గేర్‌బాక్స్‌తో 370 Nm టార్క్‌, ఆటోమేటిక్‌తో 380 Nm టార్క్ లభిస్తుంది. 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ రెండు ట్యూనింగ్‌లలో అందుబాటులో ఉంది. తక్కువ వేరియంట్లలో 132 hp పవర్‌, 300 Nm టార్క్‌, టాప్‌ వేరియంట్లలో 175 hp పవర్‌, మాన్యువల్‌తో 370 Nm & ఆటోమేటిక్‌తో 400 Nm టార్క్‌ను అందిస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ & 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి.

అన్ని వేరియంట్లలో Rear Wheel Drive స్టాండర్డ్‌గా ఉంటుంది. ఎంపిక చేసిన డీజిల్ వేరియంట్లలో 4XPLOR Four Wheel Drive సిస్టమ్‌ను అందించారు. ఇందులో Snow, Mud & Ruts, Sand టెర్రైన్ మోడ్‌లు ఉన్నాయి. అలాగే Zip, Zap & Zoom డ్రైవ్ మోడ్‌లు కూడా కొనసాగుతున్నాయి. 

మొత్తంగా చూస్తే.. 2026 మహీంద్రా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌లో మెకానికల్ మార్పులు లేకపోయినా, కొత్త ఫీచర్లు & సాంకేతికతతో ఈ SUVని మరింత ప్రీమియంగా మార్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.