Mahindra BE 6 vs Tata Curvv : భారత్ ఆటోమొబైల్ మార్కెట్‌లో ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో మహీంద్రా తన బార్న్ ఎలక్ట్రిక్‌తో సంచలనం సృష్టిస్తోంది. టాటా మోటార్స్ తన వినూత్నమైన ఎస్‌యూవీ కూపే డిజైన్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. 

Continues below advertisement

ఒక వైపు 683 కిలోమీటర్ల భారీ రేంజ్ , ఫ్యూచరిస్టిక్‌ డిజైన్‌తో మహీంద్రా BE6 దూసుకుపోతుంటే, మరోవైపు డీజిల్‌, పెట్రోల్ ఆఫ్షన్లతోపాటు ఆకర్షణీయమైన ఎస్‌యూవీ కూపే శైలిలో టాటా కర్వ్‌ సవాలు విసురుతోంది. ఈ రెండింటిలో సాంకేతిక సామర్థ్యం ఎవరిది? ఏ కారు కొంటే మీ పెట్టుబడికి సరైన ప్రతిఫలం లభిస్తుంది? 2026 నాటి తాజా మార్కెట్‌ పరిస్థితులు, అధికారిక గణాంకాల ఆధారంగా రూపొందించిన లోతైన విశ్లేషణ ఇది. 

మహీంద్రా సంస్థ తన ఎలక్ట్రిక్‌ వాహనాల శ్రేణిని విస్తరించే క్రమంలో బీఈ6 మోడల్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. 2025 చివరి నాటికి మహీంద్రా బీఈ 6, ఎక్స్‌ఈవీ 9ఎస్‌ ఎక్స్‌ఈవీ 9e మోడళ్లు కలిసి దేశవ్యాప్తంగా 41వేల కంటే ఎక్కువ యూనిట్లు సేల్స్‌ జరిగాయి. మహీంద్రా ఇప్పుడు కేవలం అమ్మకాలకే పరిమితం కాకుండా, ఢిల్లీ -ఎన్సీఆర్ వంటి ప్రాంతాల్లో ఈవీల కోసం డోర్‌స్టెప్‌ సర్వీస్‌ నెట్‌వర్క్‌ను కూడా బలోపేతం చేసింది. 

Continues below advertisement

టాటా మోటార్స్‌ తన కర్వ్‌ మోడ్‌ను ఒక యూనిక్‌ బాడీ స్టెల్‌తో మార్కెట్‌లోకి తెచ్చింది. ఇది ఇప్పటికే ఉన్న నెక్సాన్, సియెర్రా మోడళ్ల మధ్య ఒక కీలకమైన కనెక్టివిటీగా నిలిచింది. టాటా కర్వ్‌ తన స్టైలిష్ ఎక్స్‌టీరియర్‌ విస్తృతమైన వేరియంట్ ఆప్షన్ల ద్వారా వినియోగదారులను ఆకర్షిస్తోంది. 

మహీంద్రా బీఈ 6 ఫార్ములా ఈ ఎడిషన్‌ జనవరిలో బుకింగ్స్ ప్రారంభించింది. దీని డెలివీలు కూడా నిర్ణీత గడువు ప్రకారం ప్రారంభమయ్యాయి. ఇి టెక్ ప్రియులను ఆకర్షిస్తోంది. టాటా మోటార్స్ తన లెగసీ మోడల్ సియెర్రాను 2025 చివరలో మళ్లీ తీసుకురావడంతో, కర్వ్‌, సియెర్రా మధ్య ఫీచర్ల పరంగా పెద్ద చర్చ నడిచింది. సియెర్రా తన ఐకానిక్ లెగసీతో కర్వ్ కంటే ఎక్కువ ఆకర్షణను తెచ్చే అవకాశం ఉందని మార్కెట్‌లో అంచనాలు ఉన్నాయి. 

ధర, పవర్‌ట్రెయిన్‌లో పోలిక 

మహీంద్రా బీఈ 6 సుమారు 27.65 లక్షలు కాగా, టాటా కర్వ్‌ డీజిల్‌ వేరియంట్‌ 18.85 లక్షలుగా ఉంది. ప్రారంభ ధరల విషయానికి వస్తే బీఈ 6 రూ. 18.90 లక్షల నుంచి, కర్వ్‌ 9.66 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. మహీంద్రా బీఈ 6 ఆన్‌రోడ్‌ ప్రైస్‌ 29,02,791 రూపాయలు, టాటా కర్వ్‌ ఆన్‌రోడ్‌ ప్రైస్‌ 22,,16,868 రూపాయలుగా ఉంది. 

మహీంద్రా బీఈ 6 282 బీహెచ్‌పీ పవర్‌, 380 Nm టార్క్‌ను అందిస్తే, కర్వర్‌ 1.5 లీటర్ల KRYJET డీజల్ ఇంజిన్, 116బీహెచ్‌పీ పవర్‌, 260Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. బీఈ 6 ఎలక్ట్రిక్‌ 683 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంది. టాటా కర్వ్‌ డీజిల్‌ మైలేజీ సిటీలో 13 కిలోమీటర్లు, హైవేపై 15 కిలోమీటర్లు ఇస్తుంది. 

బీఈ 6 పొడవు 4371 ఎంఎం, వీల్‌బేస్‌ 2775 ఎంఎం కలిగి ఉంది. బూట్‌స్పేస్‌ 45 లీటర్లు ఉంది. కర్వ్‌ పొడవు 4308 ఎంఎం, వీల్‌బేకస్‌ 2560 ఎంఎం కలిగి ఉంది. దీని బూట్ స్పేస్‌ 500 లీటర్లు ఉంది. భద్రత విషయంలో రెండు వాహనాలకి కూడా ఎన్‌క్యాప్‌లో 5 స్టార్ రేటింగ్ కలిగి ఉన్నాయి. 

మహీంద్రా బీఈ 6ను మధ్యతరగతి స్పోర్ట్స్‌ కార్‌గా చెప్పుకుంటారు. ఇది డ్రైవర్‌ సెంట్రిక్‌ డిజైన్, 0-100కి.మీ. వేగాన్ని కేవలం 6.7 సెకన్లలో అందుకోగల సామర్థ్యం కలిగి ఉంది. కాన్సెప్టు కార్ లాంటి డిజైన్‌ సూపర్‌  కార్లకంటే ఎక్కువ దృష్టిని ఆకర్షిస్తుంది. రియల్‌ వరల్డ్‌ రేంజ్ 400-500 కిలోమీటర్ల వరకు ఉండటం వల్ల లాంగ్ ట్రిప్స్‌కు అనుకూలంగా ఉంటోంది. 12.3 ఇంచుల డ్యూయల్‌స్క్రీన్‌లు, 16 స్పీకర్లు హార్మాన్‌/కార్డాన్‌ ఆడియో సిస్టమ్‌ కలిగి ఉంది.  

టాటా కర్వ్‌ ప్రత్యేకతలు  చూస్తే విలక్షణమైన ఎస్‌యూవీ కూపే బాడీ స్టైల్‌, 18-ఇంజుల అల్లాయ్‌వీల్స్ కలిగి ఉంది. పనోరమిక్‌ సన్‌రూఫ్‌, 12.3 ఇంచుల టచ్‌స్క్రీన‌, జేబీఎల్‌ సౌండ్ సిస్టమ్‌, రైడ్ క్వాలిటీ స్లో స్పీడ్‌లో, హై స్పీడ్‌లో కూడా చాలా స్థిరంగా ఉంటుంది.

మహీంద్రా బీఈ 6 మెరిట్స్‌

మీరు అత్యాధునిక ఎలక్ట్రిక్‌ టెక్నాలజీని, డ్రైవింగ్ పవర్‌ను, అదిరి పోయే రేంజ్‌ను కోరుకుంటే బీఈ 6 సరైన ఎంపిక. దీని రన్నింగ్‌ కాస్ట్‌ కిలోమీటర్లకు కేవలం 1.16రూపాయలు మాత్రమే. డ్రైవర్‌కి ప్రాధాన్యతనిచ్చే ఈ కారులో ఎల్‌2 ఆడాస్‌ వంటి భద్రతా ఫీచర్లు భారతీయ రోడ్లకు అనుగుణంగా చక్కగా రూపొందించారు. 

మహీంద్రా బీఈ 6 డీ మెరిట్స్

ఈ వాహనం సీటులో హెడ్‌రూమ్‌ పొడవుగా ఉన్న వారికి ఇబ్బందికరంగా ఉండొచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్‌ బాగున్నప్పటికీ, వృద్ధులకు అసౌకర్యంగా ఉంటుంది. ఎక్కేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. 

టాటా కర్వ్‌కి ఉన్న మెరిట్స్ ఏంటీ?

ప్రాక్టికాలిటీకి, బడ్జెట్‌కు ప్రాధాన్యత ఇస్తే టాటాకర్వ్‌ ఉత్తమం. దీని 500 లీటర్లు బూట్‌స్పేస్‌ కుటుంబంతో ప్రయాణించేటప్పుడు సూట్‌కేసులు, ఇతర బ్యాగులను సర్దుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌ ఉండం వల్ల ఛార్జింగ్‌ స్టేషన్లు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. 

టాటా కర్వ్‌కి ఉన్న డీ మెరిట్స్ ఏంటీ?  

ఇంటీరియల్‌ డిజైన్ టాటా నెక్సాన్‌న పోలి ఉండటం వల్ల కొత్తదనం తక్కువగా అనిపించవచ్చు. ఫోన్, వాలెట్‌ పెట్టడానికి క్యాబిన్‌లో సరైన స్టోరేజ్‌ ఆప్షన్‌లు లేవు.