Ramadan 2026: ఇస్లామిక్ క్యాలెండర్లో ప్రకారం తొమ్మిదో నెల రంజాన్. తెలుగు నెలలు అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యమి తో మొదలవుతాయి...ఇస్లామిక్ నెలలు నెలవంక దర్శనంతో ప్రారంభమవుతాయి. ప్రతి నెలా 29 రోజులు లేదా 30 రోజులుంటుంది. ఇండొనేసియా నుంచి మొరాకో వరకు ఉన్న చాలా  ముస్లిం దేశాల్లో నెలవంక ఒక్కో దేశంలో ఒక్కో సమయంలో కనిపించే అవకాశం ఉంది. మక్కాలో నెలవంక కనిపించే సమయాన్నే ప్రామాణికంగా తీసుకుంటారు. సౌదీ అరేబియాతో సహా పలు గల్ఫ్‌ దేశాల్లో రంజాన్‌ నెలవంక ఫిబ్రవరి 17 మంగళవారం కనిపించింది. దీంతో భక్తిశ్రద్ధలకు ప్రత్యేకమైన పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభమైనట్టే. నెలవంక కనిపించిన సమాచారాన్ని సౌదీ అరేబియా ప్రకటించడంతో ..దీనినే  భారతీయ ముస్లింలు ప్రామాణికంగా భావిస్తారు. నెలవంక సౌదీ అరేబియాలో మంగళవారం దర్శనమిచ్చింది..ఈ లెక్కన భారత్ లో ఫిబ్రవరి 18న మొదలవ్వాలి. ఫిబ్రవరి 18 బుధవారం సాయంత్రం నెలవంక కనిపిస్తే రంజాన్ తొలిరోజు అవుతుంది.  UAEకి చెందిన కమిటీ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించింది. ఒమన్, తుర్కియే వంటి దేశాల్లో నెలవంక కనిపించకపోవడంతో ఆ దేశాల్లో ఫిబ్రవరి 19 గురువారం నుంచి రంజాన్ మాసం మొదలవుతుంది.

Continues below advertisement

రంజాన్ మాసం ముస్లింలకు ఎందుకు ప్రత్యేకం అంటే... వారి పవిత్ర గ్రంథం ఖురాన్ అవిర్భవించింది ఈ నెలలోనే. కఠినంగా ఆచరించే 'రోజా' ఉపవాస దీక్షలు, దాన ధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో ఈ నెల సాగుతుంది.  మనుషులను కష్టాల నుంచి గట్టెక్కించేందుకు మహ్మద్‌ ప్రవక్త లా ఇల్లాహ ఇల్లాల్ల అనే సూత్రం ప్రకారం ఈ మాసాన్ని సృష్టించాడని విశ్వాసం. ఈ నెల రోజులు చేసే దీక్షలతో శరీరం, మనసులో మలినాలు ప్రక్షాళన అవుతాయని, పాపాలు దహించుకుపోతాయని విశ్వసిస్తారు. సూర్యోదయ సమయంలో ‘సహర్‌’ నుంచి సూర్యాస్తమయం 'ఇప్తార్‌' వరకు నీళ్లు కూడా తీసుకోకుండా కఠిన ఉపవాసం చేస్తారు రంజాన్ నెలలో ఉపవాస దీక్షలు చేసేందుకు వయసుతో సంబంధం లేదు..కేవలం వారి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా నియమాలు పాటిస్తారు. ఈ దీక్షలతో బలహీనతలు, వ్యసనాలు జయించవచ్చని బోధిస్తారు మత గురువులు. సాయంత్రం వరకూ ఉపవాసం ఆచరించి ముందుగా ఖర్జూరం తీసుకుని దీక్ష విరమిస్తారు. అనంతరం హలీమ్ తీసుకుంటారు..రుచికరమైన భోజనం చేస్తారు రంజాన్ నెల రోజులు పెట్టుకుని కాటుకను సుర్మా అంటారు. ప్రవక్త హజరత్‌ మహ్మద్‌ నిత్యం సుర్మా పెట్టుకునేవారట. పౌడర్‌ రూపంలో ఉండే సుర్మాను వారు పెట్టుకోవడంతో పాటూ అతిథులకు కూడా ఇస్తారు. ప్రతి రోజూ నమాజ్ చేసేముందు సుర్మా పెట్టుకుంటారు. ఇది సంప్రదాయం మాత్రమే కాదు కళ్లకు ఆరోగ్యం కూడా. 

ప్రతి శుక్రవారం చేసే నమాజ్ ల కన్నా రంజాన్ నెలలో చేసే నమాజ్ చాలా ప్రత్యేకం. ఈ సమయంలో మసీదుకి వెళ్లలేని వారు ఇంటి దగ్గర స్థలాన్ని శుభ్రం చేసుకుని ప్రార్థనలు చేస్తారు. నమాజ్ పూర్తయ్యాక అంతా అలయ్ బలయ్ చెప్పుకుంటారు. పండుగ రోజు షీర్ ఖుర్మా  అనే వంటాకాన్ని  పంచుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తారు ఖురాన్ ప్రకారం 

Continues below advertisement

ప్రతి మనిషి తమ సంపాదనలో కొంత మొత్తాన్ని పేదలకు దానం చేయాలి. అందుకే ఈ నెలలో పండ్లు, గోధుమలు, సేమియా, వస్త్రాలు, బంగారం...ఎవరి స్తోమతకు తగ్గట్టు దానం చేస్తారు. పండుగ వేళ పేదలు కూడా  సంతోషంగా ఉండాలన్నదే దానాల వెనుకున్న ఆంతర్యం