అతివేగంగా వెళ్లే కార్లు, లగ్జరీ కార్లు, సూపర్‌కార్లను ఇష్టపడే వారి కోసం Lamborghini కొత్త అద్భుతమైన కారు Fenomeno Roadsterను లాంచ్ చేసింది. ఈ కారు కేవలం వేగం మాత్రమే కాకుండా, ప్రత్యేకమైన డిజైన్, అతి తక్కువ సంఖ్యలో ఉత్పత్తి (Limited Production) కారణంగా వార్తల్లో నిలిచింది. కంపెనీ ఈ సూపర్‌కార్‌ను ప్రపంచంలోని కొందరు ఎంపిక చేసిన కస్టమర్ల కోసం సిద్ధం చేసింది. పవర్‌ఫుల్ ఇంజిన్, ఓపెన్ రూఫ్ డిజైన్, అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న ఈ కారు అటు లగ్జరీ, ఇటు పెర్ఫార్మెన్స్‌ల సూపర్ కాంబినేషన్‌గా నిలవనుంది.
కేవలం 15 యూనిట్లు మాత్రమే తయారీ.. ఇది చాలా ప్రత్యేకంLamborghini బ్రాండ్ ప్రపంచంలో బెస్ట్ బ్రాండ్లలో ఒకటి. ఈ కంపెనీ తీసుకొస్తున్న Fenomeno Roadster కారు అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే అతి తక్కువ యూనిట్లు తయారు చేయడం. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఈ సూపర్‌కార్ కేవలం 15 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేసింది. అందుకే లాంచ్ అయిన వెంటనే ఈ కారు సూపర్‌కార్ ప్రియులలో హాట్ టాపిక్ అవుతోంది. తక్కువ యూనిట్లు ఉండటం వల్ల ఈ కారు చాలా ఎక్స్‌క్లూజివ్‌గా భావిస్తారు. దీనిలోని కొన్ని యూనిట్లు భారత్‌లోనూ కూడా కనిపించే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. అలాంటి సందర్భంలో ఈ లాంబోర్గిని కారు దేశంలోని సంపన్న కార్ కలెక్షన్ కోరుకుని వారి వద్ద మరింత ప్రత్యేక ఆకర్షణగా మారవచ్చు.
V12 Hybrid ఇంజిన్ ఇచ్చే సూపర్ పవర్Lamborghini ఈ సూపర్‌కార్‌లో పవర్‌ఫుల్ V12 Hybrid ఇంజిన్‌ను అందించింది. ఈ ఇంజిన్ సుమారు 1080hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల కారు అత్యంత వేగాన్ని అందుకుంటుంది. దీంతో పాటు 8 స్పీడ్ ట్రాన్స్‌మిషన్ కూడా ఇచ్చారు. ఇది డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ మరింత అద్భుతంగా మారుస్తుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ సూపర్‌కార్ కేవలం 2.4 సెకన్లలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అలాగే దీని టాప్ స్పీడ్ గంటకు 340 కిలోమీటర్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఇంతటి వేగం దీనిని ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన రోడ్‌స్టర్ కార్లలో ఒకటిగా చేస్తుంది. పైగా లిమిటెడ్ ఎడిషన్ వల్ల మరింత పేరు వస్తుంది..
దీనిని ప్రత్యేకంగా మార్చనున్న డిజైన్, ఫీచర్లు Fenomeno Roadster డిజైన్ చాలా ఆకర్షణీయంగా, స్పోర్టీగా రూపొందించారు. ఇందులో LED హెడ్‌లైట్లు, LED DRL, భారీ 22 ఇంచుల అలాయ్ వీల్స్, అద్భుతమైన ఏరోడైనమిక్ బాడీ ఇచ్చారు. కారు ఓపెన్ రూఫ్ డిజైన్ దీనిని మరింత ప్రీమియంగా మార్చేస్తోంది. ఫెనోమెనో రోడ్‌స్టర్ ఇంటీరియర్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కో-ప్యాసింజర్ స్క్రీన్ వంటి ఫీచర్లు ఇచ్చారు. లాంబోర్గిని కంపెనీ కారులో కార్బన్ ఫైబర్ భాగాలను కూడా ఉపయోగించింది. దీనివల్ల బరువు మరింత తగ్గి కారు పనితీరు బెస్ట్ అనిపిస్తుంది.
ధరపై కొనసాగుతున్న సస్పెన్స్..
Lamborghini కంపెనీ ప్రస్తుతానికి Fenomeno Roadster ధరకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే, దీని లిమిటెడ్ ఎడిషన్, అద్భుతమైన ఫీచర్లను బట్టి చూస్తుంటే, దీని ధర కోట్ల రూపాయలలో ఉంటుందని ఆటో నిపుణులు చెబుతున్నారు.
