Honda NX500 E-Clutch Launched in India: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అడ్వెంచర్ ప్రియుల కోసం సరికొత్త NX500 మోడల్‌ను ఈ-క్లచ్ వేరియంట్‌లో మార్కెట్లోకి రిలీజ్ చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.44 లక్షల నుండి ప్రారంభం అవుతుంది. ఈ బైక్ లోని మెయిన్ హైలైట్ ఏంటంటే, రైడర్లు.. క్లచ్, లివర్ వాడకుండానే చాలా స్మూత్‌గా గేర్లు షిఫ్ట్ చేసుకోవచ్చు. బైక్ డిజైన్ లేదా మిగతా మెకానికల్ పార్ట్స్‌లో కంపెనీ ఎటువంటి మార్పులు చేయలేదు. కేవలం రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ పెంచేలా ఈ కొత్త టెక్నాలజీని జోడించింది.
ఈ సరికొత్త ఈ-క్లచ్ సిస్టమ్ రెండు ఎలక్ట్రానిక్ యాక్చుయేటర్ల సాయంతో గేర్లు మార్చేటప్పుడు క్లచ్‌ను ఆటోమేటిక్‌గా ఆపరేట్ చేస్తుంది. బైక్ పూర్తిగా ఆగిపోయినప్పుడు లేదా మళ్లీ కదలడం స్టార్ట్ చేసినప్పుడు కూడా ఈ సిస్టమ్ పర్‌ఫెక్ట్‌గా పని చేస్తుంది. ఒకవేళ రైడర్‌కు పాత పద్ధతిలోనే బైక్ నడపాలని ఉంటే, మ్యాన్యువల్ క్లచ్ లివర్ , గేర్ పెడల్ వాడుకునే ఛాన్స్ కూడా ఉంది. ఈ ఎక్స్‌ట్రా టెక్నాలజీ వల్ల బైక్ బరువు 3 కిలోలు పెరిగి, ప్రస్తుతం 199 కేజీలకు చేరుకుంది. హోండా ఇదివరకే తన CB650R మోడల్స్‌లో ఈ ఫీచర్ ఇచ్చింది, ప్రస్తుతం ఆ బైక్స్ స్టాక్ లేవు.
పవర్ ఫుల్ ఇంజిన్..ఇక ఇంజిన్ పవర్ విషయానికొస్తే, ఇందులో 471cc ట్విన్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8,500 rpm వద్ద 47 హార్స్ పవర్ శక్తిని, అలాగే 6,500 rpm వద్ద 43 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో సిక్స్-స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. లాంగ్ జర్నీలలో కంఫర్ట్ కోసం ఫ్రంట్ సైడ్ అప్-సైడ్ డౌన్ (USD) ఫోర్క్స్, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ అమర్చారు. రోడ్లపై గ్రిప్ కోసం ముందు 19-ఇంచ్, వెనుక 17-ఇంచ్ అలాయ్ వీల్స్ ఇచ్చారు.
డ్యూయల్ ఛానల్ ABS..
సేఫ్టీ కోసం ఇందులో డ్యూయల్ ఛానల్ ABS ఉంది. ముందు వైపు 296 mm ట్విన్ డిస్క్ బ్రేకులు, వెనుక వైపు 240 mm సింగిల్ డిస్క్ బ్రేక్ సెటప్ ఉంటుంది. రైడర్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం 5-ఇంచ్ టీఎఫ్‌టీ (TFT) స్క్రీన్ ఈ బైక్ లో ఉంది. ఇందులో ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ ఉన్నప్పటికీ, రైడింగ్ మోడ్స్ లాంటి లగ్జరీ ఫీచర్లు మాత్రం లేవు. ఇప్పటికీ కేబుల్ ఆపరేటెడ్ థ్రోటిల్ సిస్టమ్‌నే కంపెనీ వాడుతోంది. సిటీ ట్రాఫిక్‌లో పదే పదే క్లచ్ నొక్కలేక ఇబ్బంది పడే వారికి, అలాగే లాంగ్ రైడ్స్ వెళ్లే వారికి ఈ ఈ-క్లచ్ వెర్షన్ ఒక వరం లాంటిది. హోండా నుంచి వచ్చిన ఈ క్రేజీ అప్‌డేట్ అడ్వెంచర్ బైక్ సెగ్మెంట్‌లో హాట్ టాపిక్ గా మారింది. ఈ బైక్ లాంగ్ జర్నీలు చేసే వారికి సరికొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
