KTM Launches New Electric Bicycle: నగరంలో ట్రాఫిక్ కష్టాలు, పెట్రోల్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో… యువతకు ఆనందకరమైన & ఆశ్చర్యకరమైన షాక్ ఇస్తూ KTM ఒక మెగా బ్లాస్ట్ చేసింది. కేవలం రూ. 14 వందల 99 రూపాయల బుకింగ్ ఫీజుతో ఈ-బైక్ (ఎలక్ట్రిక్ సైకిల్) ను లాంచ్ చేసింది. ఈ e-సైకిల్ సింగిల్ ఛార్జ్‌తో 220 కిలోమీటర్ల రైడ్ ఇస్తుంది, దీంతో మీరు ఎంచక్కా చక్కర్లు కొట్టొచ్చు.
స్టూడెంట్స్‌కి, ఆఫీస్ బర్డ్స్‌కు, డైలీ యూజ్‌కి పర్ఫెక్ట్ పెయిర్‌ఈ KTM ఈ-బైక్ టార్గెట్ చేసినవాళ్లు క్లియర్‌గా యంగ్‌స్టర్సే. కాలేజీ కుర్రాళ్లు, ఆఫీస్ వెళ్లే యంగ్ జనరేషన్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌తో అలసిపోయిన ట్రావెలర్స్‌కు ఇది ఫర్ఫెక్ట్ రైడ్ మేట్. తేలికపాటి బాడీ, మస్త్ రేంజ్, తక్కువ ఛార్జ్ ఖర్చు - వీటన్నింటినీ కలిసి చూస్తే దీనిని “సూపర్ బడ్జెట్ e-వెహికల్” అని చెప్పొచ్చు.
ఒక్కసారి ఛార్జ్‌తో 220 కి.మీ. రేంజ్‌రేంజ్ విషయానికి వస్తే, ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత, Eco మోడ్‌లో 220 కిలోమీటర్ల వరకు వెళ్తుందని KTM క్లెయిమ్ చేసింది. అంటే మీరు ఒకసారి ఛార్జ్ పెట్టి, వారం పాటు స్కూల్, కాలేజీ, ఆఫీస్ హడావిడిని సులభంగా పూర్తి చేయొచ్చు. అంటే, “ఛార్జింగ్ లేదు” అనే టెన్షన్ మీ డిక్షనరీ నుంచి మాయమైపోతుంది.
బ్లాస్టింగ్ ఫీచర్స్
- హబ్ మోటార్ - సైలెంట్‌గా, స్మూత్‌గా పవర్ ఇస్తుంది
- 3 రైడ్ మోడ్‌లు - Eco, Normal, Boost
- మెకానికల్ డిస్క్ బ్రేక్స్ - ఎమర్జెన్సీలోనూ పక్కా కంట్రోల్
- LED హెడ్‌ల్యాంప్స్ & టెయిల్‌లైట్స్ - నైట్ రైడ్‌లో బాగుంటాయి
- IP-రేటెడ్ బ్యాటరీ - వర్షంలోనూ సేఫ్
- అర్బన్-రెడీ టైర్లు, మడ్‌గార్డ్స్, ర్యాక్ మౌంట్స్ - రోజూ నగరాలు/పట్టణాల్లో ఉపయోగించడానికి బెటర్
డిజైన్ - స్ట్రీట్ వైబ్స్‌ఈ KTM సైకిల్ లుక్స్‌ను సూపర్ క్లీన్‌గా డిజైన్ చేశారు. స్ట్రాంగ్ అలాయ్ ఫ్రేమ్, ఇంటర్నల్ కేబుల్ రూటింగ్, కూల్ LED డీకల్స్‌తో “ఇది సైకిలా? మినీ e-బైకా?” అని మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని కచ్చితంగా అడుగుతారు, అంత స్టైలిష్‌గా ఉంది.
బుకింగ్ & EMI - స్టూడెంట్స్‌కే టార్గెట్KTM కొత్త e-బైక్ ధరతోనూ సంతోషకరమైన షాక్ ఇస్తుంది. ఫస్ట్ బుకింగ్ కేవలం ₹1,499 మాత్రమే. తర్వాత మిగతా డబ్బును EMI ఆప్షన్స్‌లో కూడా చెల్లించొచ్చు. అంటే మీ నెలవారీ ఖర్చు ఎక్కువేమీ కాదు. పెట్రోల్ ఖర్చుతో పోలిస్తే ఈ-బైక్ సూపర్ చీప్.
మార్కెట్లో ఇప్పటికే చాలా ఈ-స్కూటర్స్, ఈ-బైక్స్ ఉన్నా… KTM ఈ-సైకిల్ రేంజ్ (220 KM), ప్రైస్ (₹1,499 బుకింగ్), లుక్స్ దీనిని గేమ్ ఛేంజర్‌గా నిలబెడతాయి. ట్రాఫిక్‌ను ఓడించాలా?, ఖర్చు తగ్గించాలా?, సిటీలో కూల్‌గా రౌండ్లు కొడుతూ ఎంజాయ్ చేయాలా? - ఈ KTM e-సైకిల్ మీ ఫస్ట్ చాయిస్ కావచ్చు.