KTM 160 Duke TFT Variant: కేటీఎం అభిమానులకు శుభవార్త. ఇండియా మార్కెట్‌లో KTM 160 డ్యూక్‌కు తాజాగా ఒక కీలక అప్‌డేట్‌ వచ్చింది. ఇప్పటికే యువ రైడర్లలో మంచి గుర్తింపు తెచ్చుకున్న 160 డ్యూక్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తూ, కేటీఎం కొత్త టాప్‌-స్పెక్‌ వేరియంట్‌ను అధికారికంగా లాంచ్‌ చేసింది. ఈ కొత్త వేరియంట్‌ ధర ₹1.79 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర)గా నిర్ణయించింది. బేస్‌ వేరియంట్‌తో పోలిస్తే ఇది సుమారు ₹8,000 అదనపు ధరతో వస్తోంది.

Continues below advertisement

390 డ్యూక్‌ నుంచి నేరుగా వచ్చిన TFT డిస్‌ప్లే

ఈ కొత్త KTM 160 డ్యూక్‌ టాప్‌ వేరియంట్‌లో ప్రధాన హైలైట్‌ – TFT డిస్‌ప్లే. ఇదే స్క్రీన్‌ ప్రస్తుతం KTM 390 డ్యూక్‌లో ఉపయోగిస్తున్నారు. అంటే, ఫ్లాగ్‌షిప్‌ డ్యూక్‌ ఫీల్‌ ఇప్పుడు 160 సెగ్మెంట్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ TFT డిస్‌ప్లే 5 అంగుళాల సైజ్‌లో ఉండి, హై రిజల్యూషన్‌, షార్ప్‌ గ్రాఫిక్స్‌తో స్పష్టంగా కనిపిస్తుంది.

Continues below advertisement

ఈ స్క్రీన్‌లో రెండు డిస్‌ప్లే థీమ్‌లు అందుబాటులో ఉంటాయి. రైడర్‌ అవసరానికి అనుగుణంగా థీమ్‌ను మార్చుకునే అవకాశం ఉంది. 390 డ్యూక్‌లో ఉన్నట్టే, 160 డ్యూక్‌లో కూడా 4-వే స్విచ్‌గియర్‌ అలాగే కొనసాగుతోంది. దీంతో డిస్‌ప్లే ఆప్షన్లను సులభంగా ఆపరేట్‌ చేయవచ్చు.

బేస్‌ వేరియంట్‌ కూడా కొనసాగింపు

కొత్త TFT వేరియంట్‌ వచ్చినప్పటికీ, KTM బేస్‌ వేరియంట్‌ను నిలిపివేయలేదు. LCD డిస్‌ప్లేతో వచ్చే బేస్‌ వేరియంట్‌ కూడా మార్కెట్‌లో కొనసాగుతుంది. ప్రస్తుతం ఆ మోడల్‌ ధర ₹1.71 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర)గా ఉంది. అంటే, కొనుగోలుదారులకు ఇప్పుడు రెండు ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి – ఒకటి స్టాండర్డ్‌ LCD డాష్‌, మరొకటి ప్రీమియం TFT డాష్‌.

ఫీచర్లలో మార్పులేమీ లేవు

TFT డిస్‌ప్లే వచ్చింది తప్ప, మిగతా ఫీచర్లలో పెద్దగా మార్పులు లేవు. KTM 160 డ్యూక్‌ ఇప్పటి లాగే బ్లూటూత్‌ కనెక్టివిటీ, స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ సపోర్ట్‌ అందిస్తుంది. KTM యాప్‌తో కనెక్ట్‌ చేసినప్పుడు మ్యూజిక్‌ కంట్రోల్‌, ఇన్‌కమింగ్‌ కాల్స్‌ నోటిఫికేషన్లు, టర్న్‌-బై-టర్న్‌ నావిగేషన్‌ వంటి ఫీచర్లు ఉపయోగించుకోవచ్చు. రోజువారీ నగర ప్రయాణాల్లో ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

MT-15తో పోలికలో ఎలా ఉంది?

Yamaha MT-15 కూడా ఇటీవల TFT డిస్‌ప్లేతో టాప్‌ వేరియంట్‌ను తీసుకొచ్చింది. ధర పరంగా చూస్తే... TFT డిస్‌ప్లే ఉన్న MT-15తో పోలిస్తే KTM 160 డ్యూక్‌ సుమారు ₹13,000 ఎక్కువ. అయితే, 160 డ్యూక్‌లో ఉన్న 5 అంగుళాల పెద్ద TFT స్క్రీన్, ఎక్కువ రిజల్యూషన్‌, క్రిస్ప్‌ గ్రాఫిక్స్‌ కారణంగా ఈ అదనపు ధర న్యాయంగా అనిపించవచ్చు. MT-15లో ఉండే 4.2 అంగుళాల TFT డాష్‌ FZ-S FI హైబ్రిడ్‌ నుంచి తీసుకున్నది.

మొత్తంగా చూస్తే, కొత్త TFT డిస్‌ప్లే వేరియంట్‌తో KTM 160 డ్యూక్‌ ఫీచర్ల పరంగా మరింత బలపడింది. స్టైల్‌, పనితీరు, టెక్నాలజీ అన్నీ కలిపి ఇది యంగ్‌ రైడర్లకు ఇంకా ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.