Chinni Serial Today Episode నాగవల్లి మధుతో నా కొడుకుని నీ కొంగున  చుట్టేసేకోవాలని అనుకుంటున్నావా.. నువ్వు వాడిని ఎందుకు అమెరికా వెళ్లకుండా వెనక్కి తీసుకొచ్చావో నాకు తెలుసు.. ఇప్పుడు వాడు అమెరికా వెళ్లిపోతే ఇప్పట్లో తిరిగి రాడని.. వాడి కోపం తగ్గించడం నీకు కుదరదు అని నీకు తెలుసు.. మీ మమ్మీడాడీ కోసం అని చెప్పి వాడి దగ్గర మార్కులు కొట్టేసి.. మెల్లగా చిన్నీ మీద కోపం తగ్గించి నువ్వే చిన్ని అని వాడికి చెప్పాలని నీ ప్లాన్ అదే కదా చెప్పవే వాడికి దగ్గర అవ్వాలి అనుకుంటున్నావ్ అది ఈ జన్మలో జరగదు.. నువ్వే చిన్ని అని ఇప్పుడు చెప్తే వాడు ఈ జన్మలో నీ ముఖం చూడడు అని అంటుంది. 

Continues below advertisement

నాగవల్లి మాటలకు మధు అవునా అయితే ఇప్పుడే నేను చిన్నీ అని చెప్పేయండి మ్యాడీని పిలవనా అని అంటుంది. నాకు తెలుసు మీరు నేను చిన్ని అని చెప్పరు అని.. ఇప్పుడు నేనే చిన్ని అని తెలిస్తే నా మీద ఉన్న ప్రేమకి.. మధుగా ఉన్న స్నేహానికి తన కోపం పోతుందని మీ భయం అంటుంది. దానికి నాగవల్లి అవునా అంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నావ్ కదా.. మరి నువ్వు ఎందుకు చెప్పడం లేదు అని అడుగుతుంది. మా అమ్మ నిర్దోషి అని నిరూపించే వరకు నేనే చిన్ని అని మ్యాడీకి చెప్పకూడదు అని అనుకుంటున్నా. మ్యాడీతో పాటు మీ అందరికీ మా అమ్మ నిర్దోషి అని తేల్చిన తర్వాత మీతోనే నేనే చిన్ని అని చెప్పిస్తా అని అంటుంది. అది జరగదు అని నాగవల్లి అంటే జరుగుతుంది అని మధు అంటుంది. ఇద్దరూ ఛాలెంజ చేసుకుంటారు.

 మ్యాడీ వెనక్కి తిరిగి రావడంతో శ్రేయ చాలా సంతోషపడుతుంది. ఇంతలో శ్రేయ దగ్గరకు మ్యాడీ వస్తాడు. మ్యాడీ శ్రేయతో నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని కూర్చొపెడతాడు. శ్రేయ టెన్షన్ పడుతుంది. టెన్షన్ పడకు శ్రేయ మన మంచి కోసమే మాట్లాడుతున్నా అని అంటాడు. చిన్నప్పటి నుంచి చిన్నిని ప్రేమించా చిన్నినే పెళ్లి చేసుకోవాలి అనుకున్నా కానీ ఇప్పుడు తనని చేసుకోను.. అలా అని ఇప్పుడు నిన్ను చేసుకోలేను.. అలా అని చేసుకోలేను అని కాదు.. చిన్నప్పటి నుంచి నన్ను ప్రేమించిన నువ్వు మరో అబ్బాయిని పెళ్లి చేసుకో అని మమ్మీ వాళ్లు చెప్తే నన్ను మర్చిపోయి వెంటనే అతన్ని పెళ్లి చేసుకొని నన్ను మర్చిపోగలవా.. నీకు కొంచెం టైం కావాలి కదా.. నాకు అలాగే ఉంది శ్రేయ. నేను నిన్ను పెళ్లి చేసుకుంటా.. గ్యారెంటీగా నిన్ను పెళ్లి చేసుకుంటా.. కానీ దానికి కొంచెం టైం కావాలి అదే ఇవ్వమని నీకు అడుగుతున్నా. అందుకే ఫారెన్ వెళ్లిపోవాలి అనుకున్నా.. అది కరెక్ట్‌ కాదు నీతో మాట్లాడమని మధు చెప్పింది. ఈ విషయం నువ్వే అమ్మ వాళ్లకి చెప్పాలి.. ఈలోపు నీ చదువు కూడా పూర్తయిపోతుంది. ఏమంటావ్ అని అడుగుతాడు. 

Continues below advertisement

శ్రేయ చాలా సంతోషంతో ఏం అంటాను బావ నీ మాటే నా మాట. ఇంతకాలం నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అనే భయం ఉండేది. ఇప్పుడు నువ్వే నీ నోటితో చెప్పావు కదా పెళ్లి చేసుకుంటా అని ఎంత కాలం అయినా వెయిట్ చేస్తా.. అత్తామామయ్యా ఇంట్లో వాళ్లని నేనే ఒప్పిస్తా నువ్వేం టెన్షన్ పడకు బావ. నీకు ఎప్పుడు నచ్చితే అప్పుడే పెళ్లి చేసుకుందాం అని శ్రేయ అంటుంది. మ్యాడీ చాలా సంతోషపడతాడు. శ్రేయ చేతులు పట్టుకొని థ్యాంక్స్ చెప్తాడు. 

లోహిత మొత్తం విని ప్రస్తుతానికి ఈ పెళ్లి ఆపడానికి ఆ మధు ఇలా ప్లాన్ చేసిందా అని శ్రేయ దగ్గరకు వెళ్తుంది. నీకు ఓ గుడ్ న్యూస్ చెప్పాలి అని శ్రేయ అంటే నీకు ఓ బ్యాడ్ న్యూస్ చెప్పాలని లోహిత అంటుంది. ఇక మధుకి మ్యాడీ కాల్ చేసి విషయం చెప్తాడు. మధు మనసులో శ్రేయ, మ్యాడీ పెళ్లి ఆపేశాను ఇక నా ప్రయత్నాలు నేను చేసుకోవాలి అని అంటుంది. 

శ్రేయ లోహితతో విషయం చెప్తుంది. మీ బావ నీతో పెళ్లి పోస్ట్ పోన్ చేయమంది నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదు నీతో పెళ్లి పెటాకులు చేసుకోవడానికి అని చెప్తుంది. అలా కాకుండా ఉండాలి అంటే నేను చెప్పింది వెళ్లి మీ అత్తకి చెప్పు అంటుంది. శ్రేయ నాగవల్లి దగ్గరకు వెళ్లి ఓ గుడ్‌న్యూస్ అని అంటుంది. లోహిత అందరినీ పిలుస్తుంది. బావ నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పాడని అందరికీ చెప్తుంది. అందరూ చాలా సంతోషపడతారు. ఇంతలో శ్రేయ బావ కండీషన్ పెట్టాడని అంటుంది. ఏంటి అని అందరూ అడిగితే బావ త్వరగా మా నిశ్చితార్థం జరిపించేయమని చెప్పాడని.. త్వరలోనే పెళ్లి కూడా చేసేయ్మన్నాడు అని చెప్తుంది. దేవా మ్యాడీని హగ్ చేసుకొని చాలా సంతోషపడతాడు. అందరూ చాలా సంతోషపడతాడు.

మ్యాడీ షాక్ అయిపోతాడు. శ్రేయ అబద్ధం చెప్తుంది. నేను ఇప్పుడే పెళ్లి వద్దు అన్నాను అని అంటాడు. ఇద్దరూ నువ్వు అబద్ధం చెప్తున్నావ్ అంటే నువ్వు అబద్దం చెప్తున్నావ్ అని అరుస్తారు. దేవా ఇద్దరినీ ఆపి త్వరలోనే నిశ్చితార్థం అని అంటాడు. శ్రేయ అబద్ధం చెప్తుందమ్మా అని నాగవల్లితో మ్యాడీ చెప్తే తను ఎంత ప్రేమిస్తే అంతలా అబద్ధం చెప్తుందని అంటుంది. మ్యాడీ అందరికీ నన్ను అర్థం చేసుకో అని బతిమాలుతాడు. ఎవరూ మ్యాడీకి సపోర్ట్ చేయరు. దేవా మ్యాడీతో ఈ క్షణం నుంచి నీ పెళ్లి విషయంలో నాకు నచ్చినట్లే జరుగుతుంది అని అంటాడు. నాగవల్లి మ్యాడీతో నీ పెళ్లికి సంబంధించి నువ్వు ఏ పని కాదు అన్నా నా మీద ఒట్టు అంటుంది. రేపే నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించు అని నాగవల్లితో దేవా చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.